అన్ని మసీదులను భజరంగ్ దళ్ కార్యాలయాలుగా మారుస్తామని భజరంగ్ దళ్ కార్యకర్త ఒకరు మధ్యప్రదేశ్ లోని సాహోర్ జిల్లాలోని నిర్వహించిన ర్యాలీలో నినదించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

అన్ని మసీదులను భజరంగ్ దళ్ కార్యాలయాలుగా మారుస్తామని ఆ మితవాద సంస్థకు చెందిన కార్యకర్త ఒకరు హెచ్చరిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో క్లిప్ మధ్యప్రదేశ్ లోని సాహోర్ జిల్లాకు చెందినది. జూన్ 25వ తేదీన సాహోర్ జిల్లాలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ వంటి హిందూ సంస్థలు హిందూ జాగరణ్ యాత్రను నిర్వహించాయి.

మంచి దొంగలు.. జేబులో రూ.20 నోటు మాత్రమే దొరకడంతో దంపతులకే డబ్బులిచ్చి, స్కూటీపై పరారీ.. వీడియో వైరల్

లవ్ జిహాద్, మతమార్పిడులను వ్యతిరేకిస్తూ ఈ యాత్ర నిర్వహించారు. సాహోర్ జిల్లాలోని 130 గ్రామాల్లో 130 కిలోమీటర్ల మేర ర్యాలీ కొనసాగింది. హిందువులను జాగృతం చేయడమే ఈ ర్యాలీ ప్రధాన లక్ష్యమని హిందూ విశ్వ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ శర్మ ‘ఈటీవీ భారత్’తో తెలిపారు. మతమార్పిడులు, లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ, హిందువులను చైతన్యవంతులను చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.

మణిపూర్ కు సాయం చేయాలంటే ముందు మాకు సాయం చేయండి - మహిళలకు ఆర్మీ విజ్ఞప్తి

కాగా.. ఈ ర్యాలీ సందర్భంగా భజరంగ్ దళ్ కు చెందిన కార్యకర్త ఒకరు ముస్లిం వర్గానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాహోర్ జిల్లాలోని అన్ని మసీదులను భజరంగ్ దళ్ కార్యాలయాలుగా మారుస్తామని ఆయన ఆయన నిననదించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

మున్సిపల్ కమిషనర్ కుక్క అదృశ్యం.. వెతికిపట్టుకునేందుకు పోలీసుల తిప్పలు.. 36 గంటల్లో 500 ఇళ్లలో సోదాలు

ఇదిలా ఉండగా.. గత నెలలో ఇండోర్ లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), భజరంగ్ దళ్ కు వ్యతిరేకంగా మసీదు సమీపంలో అభ్యంతరకర కరపత్రాలను పంపిణీ చేసిన 10 మందిపై కేసు నమోదైంది. ఓ హిందూ సంస్థకు చెందిన 45 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.