Asianet News TeluguAsianet News Telugu

అగ్నిపథ్ స్కీమ్ లో ఫస్ట్ బ్యాచ్ కు మొదలైన ట్రైనింగ్.. ఎక్కడంటే ?

అగ్నిపథ్ స్కీమ్ కిందట సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ట్రైనింగ్ ప్రారంభమైంది. ఎయిర్స్ ఫోర్స్ అభ్యర్థులకు జవవరి 1వ తేదీన శిక్షణ మొదలవగా.. ఆర్మీ అభ్యర్థులకు నేడు శిక్షణ ప్రారంభమైంది. 

The training started for the first batch in the Agnipath scheme.. where?
Author
First Published Jan 2, 2023, 2:34 PM IST

త్రివిధ దళాల్లో రిక్రూట్ మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ కింద ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్‌కు ఎంపికైన యువతకు శిక్షణ ప్రారంభమైంది. ఇటీవలే యువకులు శిక్షణా కేంద్రాలకు చేరుకోవడంతో అధికారికంగా జనవరి 1వ తేదీ నుంచి మొదటి బ్యాచ్ కు ట్రైనింగ్ మొదలైంది. 

పొగమంచు కార‌ణంగా ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బొలెరో.. ముగ్గురు మృతి

ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. “ మూడు వేల మందితో అగ్నివీర్ వాయు మొదటి బ్యాచ్  శిక్షణ ఈరోజు (ఆదివారం) నుంచి బెలగావిలోని ఎయిర్‌మెన్ ట్రైనింగ్ స్కూల్ (ఏటీఎస్)లో ప్రారంభమైంది” అని ఎయిర్ ఫోర్స్ తెలిపింది. ఈ సందర్భంగా ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, ట్రైనింగ్ కమాండ్ ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ ఏటీఎస్ ను సందర్శించి కొత్తగా రిక్రూట్ అయిన బ్యాచ్‌ని ఉద్దేశించి ప్రసంగించారు.అలాగే ఇండియన్ ఆర్మీ కోసం ఎంపికైన యువకులకు సోమవారం నుంచి శిక్షణ ప్రారంభిస్తున్నట్టు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంకే పాండే గత వారం తెలియజేశారు.

షార్ట్ టర్మ్ సర్వీస్ కోసం సైనికులను నియమించుకునేందుకు గతేడాది జూన్ 14వ తేదీన కేంద్రం ఈ అగ్నిపథ్ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. లెగసీ సిస్టమ్ స్థానంలో సాయుధ దళాల ఏజ్ ప్రొఫైల్‌ను తగ్గించడానికి, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోగల సామర్థ్యం, సాంకేతికంగా నైపుణ్యం ఉన్న దళాన్ని రూపొందించడానికి దీనిని రూపొందించారు. అయితే ఈ ప్రకటన దేశ వ్యాప్తంగా ఒక్క సారిగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. 

దెయ్యం వదిలిస్తానని నమ్మించి మైనర్ బాలికపై మాంత్రికుడి అత్యాచారం.. యూపీలో ఘటన

అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి రాస్తారోకోలు చేశారు. రైల్వే స్టేషన్లకు వెళ్లి పట్టాలపై కూర్చుకున్నారు. రైళ్లను, రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. అలాగే రోడ్లపై వాహనాలను తగులబెట్టారు. ఈ ఆందోళన వల్ల రైల్వే ఆస్తులకు భారీ నష్టమే చేకూరింది. ఈ విషయాన్ని పార్లమెంట్ లో కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఈ నిరసనల వల్ల దాదాపు 2 వేలకు పైగా రైళ్లు రద్దయ్యాయని చెప్పింది. జూన్ 15 నుంచి 23 తేదీల మధ్య 2,132 రైళ్లు రద్దయ్యాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. రైళ్ల రద్దు కారణంగా ప్రయాణికులకు రిఫండ్ చేసేందుకు ప్రత్యేక డేటాను నిర్వహించామని.. జూన్ 14 నుంచి 30 మధ్య కాలంలో రూ.102.96 కోట్ల మొత్తాన్ని మంజూరు చేశామని రైల్వే మంత్రి తెలిపారు. రైల్వే ఆస్తులు ధ్వంసం కావడంతో మొత్తంగా భారతీయ రైల్వేలకు రూ.259.44 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆయన వెల్లడించారు.

కాగా.. ఈ అగ్నిపత్ స్కీమ్ కింద 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల లోపున్న అభ్యర్థులను ఆర్మీ, నేవి, వైమానిక దళాలకు ఎంపిక చేస్తారు. దీని కింద ఎంపికైన వారు నాలుగు సంవత్సరాల పాటు పని చేయాల్సి ఉంటుంది. నాలుగేళ్ల తరువాత వారిలో 25 శాతం మందిని ఉద్యోగాల్లోనే ఉంచి, మిగితా వారిని ఇంటికి పంపిస్తారు. ఆ 25 శాతం అభ్యర్థులు రెగ్యులర్ కేడర్‌లో 15 సంవత్సరాల పాటు విధుల్లో కొనసాగుతారు.

బీజేపీ ఎమ్మెల్యే పేరు నోట్ లో రాసి సూసైడ్ చేసుకున్న బెంగళూరు వాసి.. ఎందుకంటే ?

అయితే అగ్నివీర్స్ సర్వీస్ మొదటి సంవత్సరంలో  అభ్యర్థులు 4.76 లక్షలు, నాలుగో సంవత్సరంలో రూ. 6.92 లక్షల వార్షిక జీతం తీసుకుంటారు. రూ. 48 లక్షల నాన్-కంట్రిబ్యూటరీ బీమా కవరేజీని పొందుతారు. ఒక వేళ విధుల్లో మరణిస్తే అదనంగా రూ. 44 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios