Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ ఎమ్మెల్యే పేరు నోట్ లో రాసి సూసైడ్ చేసుకున్న బెంగళూరు వాసి.. ఎందుకంటే ?

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్ణాటక బీజేపీ ఇరాకాటంలో కూరుకుపోతోంది. ప్రభుత్వం బిల్లులు ఆలస్యం చెల్లించడం ఆలస్యం చేస్తోందని ఆరోపిస్తూ రెండు రోజుల కిందట ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మరవకముందే తాజాగా మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్ లో బీజేపీ ఎమ్మెల్యేతో పాటు మరో ఆరుగురు వ్యక్తుల పేరు పేర్కొన్నాడు. 

Bengaluru resident who committed suicide by writing BJP MLA's name on a note.. because?
Author
First Published Jan 2, 2023, 12:28 PM IST

బెంగళూరుకు చెందిన 47 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే బీజేపీ ఎమ్మెల్యేతో పాటు మరో ఆరుగురు వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకున్నట్టు ఓ సూసైడ్ నోట్ రాశాడు. ఇది బయటకు రావడంతో రాజకీయంగా వివాదం చెలరేగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

అనుమాన‌స్ప‌ద స్థితిలో అద్దె ఇంట్లో మ‌హిళ మృతి.. ప్రియుడి కోసం పోలీసుల గాలింపు

ఎస్. ప్రదీప్ అనే వ్యక్తి 2018లో మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి బెంగళూరు క్లబ్‌లో రూ.1.2 కోట్లు పెట్టుబడి పెట్టాడు. అయితే క్లబ్‌లో పని చేసినందుకు జీతంతో పాటు ప్రతీ నెలా మూడు లక్షల రూపాయలు తిరిగి ఇస్తానని వారు హామీ ఇచ్చారు. అయితే డబ్బులు తీసుకున్న తర్వాత గోపి, సోమయ్య అనే ఇద్దరు వ్యక్తులు కొన్ని నెలలుగా ప్రదీప్‌కు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించారు. వడ్డీ చెల్లించేందుకు ప్రదీప్ పలుమార్లు అప్పులు చేయాల్సి వచ్చింది. వాటిని చెల్లించేందుకు తన ఇల్లు, వ్యవసాయ భూమిని కూడా విక్రయించాల్సి వచ్చిందని నోట్‌లో అతడు పేర్కొన్నాడు. 

అహ్మదాబాద్ లో అగ్నిప్రమాదం.. భార్యభర్తలు, ఎనిమిదేళ్ల చిన్నారి మృతి..

మానసిక వేధింపులు... 
డబ్బులు ఇవ్వాలని ప్రదీప్ మిగితా సభ్యులకు ఎన్ని సార్లు విన్నవించినప్పటికీ వారు తిరిగి డబ్బును ఇవ్వలేదు. ప్రదీప్ ఈ విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలి దృష్టికి తీసుకెళ్లారు. ఆ ఎమ్మెల్యే ఇద్దరితో మాట్లాడాడని, అయితే వారు కేవలం 90 లక్షలే ఇస్తామని చెప్పినట్టు సూసైడ్ నోట్ తెలిపింది.

రాజస్థాన్‌లో ప‌ట్టాలు త‌ప్పిన ప్యాసింజర్ రైలు.. ప‌లువురికి గాయాలు

ప్రదీప్ సోదరుడి ఆస్తిపై జైరాంరెడ్డి అనే డాక్టర్ సివిల్ కేసు పెట్టాడని, ప్రదీప్‌ను మానసికంగా హింసించి వేధిస్తున్నాడని సూసైడ్ నోట్‌ పేర్కొంది. నోట్ చివరలో పేర్కొన్న ఆరుగురు వ్యక్తుల పేరును ప్రదీప్ పేర్కొన్నాడు. బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలీ తనకు వ్యతిరేకంగా, డబ్బులు ఇవ్వని వ్యక్తులకు మద్దతిస్తున్నారని ప్రదీప్ అందులో ఆరోపించారు. ఈ ఆత్మహత్యకు ఎమ్మెల్యేతో పాటు మరో ఆరుగురు వ్యక్తులు కూడా కారణమని అందులో పేర్కొన్నాడు. 

పెద్ద నోట్ల రద్దును సమర్ధించిన సుప్రీం కోర్టు.. కీలక కామెంట్స్..

కాగా.. బెంగళూరులోని నెట్టిగెరె గ్రామంలో ఆదివారం చనిపోయి కనిపించాడు. ప్రదీప్ తలకు బుల్లెట్ గాయం ఉంది. అతడి కారులో సూసైడ్ నోట్ దొరికిందని, అందులో బీజేపీ ఎమ్మెల్యేతో పాటు ఆరుగురు పేర్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios