రూ.3 వేల బాకీ కట్టలేదని.. కూరగాయల వ్యాపారిని చితకబాది, నగ్నంగా ఊరేగించిన దుండగులు.. వీడియో వైరల్
రూ.3 వేల బాకీ కట్టలేదని ఓ కూరగాయల వ్యాపారిని పలువురు దుండగులు చితకబాదారు. బట్టలూడదీసి నగ్నంగా ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీంతో ఇద్దరి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన యూపీలో జరిగింది.
రూ.3,000 రుణం చెల్లించలేదని కూరగాయల వ్యాపారి పట్ల పలువుు వ్యక్తులు దారుణంగా ప్రవర్తించారు. అతడిని చితకబాది, మార్కెట్ లో నగ్నంగా ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పోలీసులు స్పందించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా సిటీలో ఉన్న సెక్టార్ 88 మండీలో చోటుచేసుకుంది.
పని ఇప్పిస్తానని తీసుకెళ్లి వితంతువుపై 14 రోజుల పాటు గ్యాంగ్ రేప్.. మత్తు మందు ఇచ్చి దారుణం..
వివరాలు ఇలా ఉన్నాయి. అమిత్ అనే కూరగాయాల వ్యాపారి మెయిన్ పురిలో నివసిస్తుంటాడు. అతడు నోయిడా ఫేజ్ 2 సెక్టార్ 88 మండీలో కూరగాయలు విక్రయిస్తుంటాడు. కొంత గతంలో అతడు పలు అవసరాల నిమిత్తం సుందర్ అనే వ్యక్తి దగ్గర రూ.5,600 అప్పుగా తీసుకున్నాడు. అయితే కొంత కాలం కిందట రూ.2,500 తిరిగి ఇచ్చేశాడు. అయితే మిగిలిన డబ్బులు ఇవ్వాలని సుందర్.. కూరగాయల మార్కెట్ కు వచ్చి అమిత్ ను అడిగాడు. మిగితా సొమ్ము చెల్లించేందుకు ఆదివారం వరకు సమయం కావాలని కోరారు.
కానీ అతడు వినిపించుకోలేదు. కోపంతో సుందర్ మరి కొందరు స్నేహితులను అక్కడికి పిలిచాడు. వారంతా కలిసి అమిత్ ను కర్రలతో దారుణంగా చితకబాదాడు. నగ్నంగా చేసి మార్కెట్ లో ఊరేగించాడు. దీనిని పలువురు వీడియో తీశారు. అనంతరం సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇది వైరల్ అయ్యింది. పోలీసుల వరకు చేరింది.
దారుణం.. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని తల్లిని చంపిన తనయుడు..
దీంతో వారు అప్రమత్తం అయ్యారు. ఈ ఘటనలో జోక్యం చేసుకున్నారు. బాధితుడి నుంచి ఫిర్యాదు తీసుకొని, కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మిగితా వారంతా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం ఇప్పుడు పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.