విద్యార్థులకు క్లాసులకు హాజరుకాలేదని, తాను ఎవరికీ చదువుచెప్పలేదని పేర్కొంటూ ఓ ప్రొఫెసర్ తనకు ఉద్యోగంలో జాయిన్ అయిన దగ్గర నుంచి అందిన జీతం మొత్తం యూనివర్సిటీకి ఇచ్చేశారు. ఈ విచిత్ర ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. 

గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్స్ లో టీచ‌ర్లు, కాలేజీల్లో లెక్చ‌ర‌ర్లు పిల్ల‌ల‌కు స‌రిగా చ‌దువు చెప్ప‌కుండానే జీతాలు తీసుకుంటార‌ని త‌ర‌చూ వారిపై ఆరోప‌ణ‌లు వ‌స్తుంటాయి. అయితే ఈ స‌మ‌యంలో ఓ ప్రొఫెస‌ర్ మాత్రం ఒక ప‌ని చేసి వార్త‌ల్లో ప్ర‌త్యేకంగా నిలిచారు. బీహార్ లో ని ముజఫర్‌పూర్‌ నితీశ్వర్ కాలేజీకి చెందిన హిందీ అసిస్టెంట్ ప్రొఫెసర్ లల్లన్ కుమార్ త‌న జీతాన్ని తిరిగి ప్ర‌భుత్వానికి ఇచ్చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

Bhagwant Mann Wedding: ఘనంగా భగవంత్ మాన్ పెళ్లి.. హాజరైన కేజ్రీవాల్.. ఫోటోలు..

2019 సెప్టెంబ‌ర్ లో విధుల్లో చేరిన ప్రొఫెసర్ డాక్టర్ లలన్ కుమార్ తన రెండు సంవత్సరాల తొమ్మిది నెలల పూర్తి జీతాన్ని బీహార్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌కు తిరిగి ఇచ్చారు. తరగతిలోకి విద్యార్థులు ఎప్పుడూ హాజ‌ర‌వ‌డం లేద‌ని పేర్కొంటూ ఇంత వ‌ర‌కు త‌న‌కు అందిన జీతం మొత్తం రూ. 23 లక్షల 82 వేల 228 తిరిగి ఇచ్చేశారు. దీంతో పాటు ఎల్‌ఎస్‌, ఆర్‌డీఎస్‌, ఎండీడీఎం, పీజీ విభాగంలో త‌న‌ను బదిలీ చేయాలని రిజిస్ట్రార్‌ను కోరారు. 

‘నిన్న కాళీ, నేడు శివ’.. వివాదాస్పదంగా మారిన సిగరెట్ వెలిగిస్తున్న శివుడి పోస్టర్... ఎక్కడంటే..

త‌న నిర్ణ‌యాన్ని తెలియ‌జేస్తూ ఓ లేఖ రాసి దాని కాపీలను వైస్ ఛాన్సలర్, ఛాన్సలర్, సీఎం, యూజీసీ, పీఎంవో, రాష్ట్రపతికి కూడా పంపారు. రిజిస్ట్రార్ డాక్టర్ ఠాకూర్ ఆయ‌న‌ చెక్కును స్వీకరించడానికి మొదట నిరాకరించాడు. ఇలా ఇచ్చే బ‌దులు ఉద్యోగాన్ని మానేయాల‌ని సూచించారు. కానీ ఆయ‌న త‌న‌ను క‌చ్చితంగా బ‌దిలీ చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. ఈ సంద‌ర్భంగా యూనివర్శిటీ విద్యావ్యవస్థపై కూడా ఆయన ప్రశ్నలు సంధించారు.

Bagalkot violence : బాగల్ కోట్ లో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ.. పలు దుకాణాలకు నిప్పు.. పాఠశాలల మూసివేత

ఈ విష‌యంలో డాక్టర్ లాలన్ మాట్లాడుతూ.. నితీశ్వర్ కాలేజీలో నా ప‌ని ప‌ట్ల నాకు అస్స‌లు సంతృప్తి లేదు. నేను పిల్ల‌ల‌కు చ‌దువు చెప్పేందుకు అవ‌కాశం ల‌భించ‌లేదు. అందువల్ల, జాతిపిత మహాత్మా గాంధీ అందించిన జ్ఞానం, మనస్సాక్షి వ‌ల్ల నేను ఇప్ప‌టి వ‌ర‌కు పొందిన జీతం మొత్తం యూనివ‌ర్సిటీకి అంకితం చేస్తున్నాను. ’’ అని అన్నారు. ‘‘ నేను జీతం తీసుకోవడం అనైతికం. నేను విద్యార్థులకు నేర్పించకపోతే నాకు యూనివర్సిటీ జీతం ఎందుకు చెల్లించాలి ? నేను 25 సెప్టెంబర్ 2019 నుండి కళాశాలలో పని చేస్తున్నాను. బోధించాలనే కోరిక ఉంది. కానీ అండర్ గ్రాడ్యుయేట్ హిందీ విభాగంలో ఉన్న 131 మంది విద్యార్థుల్లో ఒక్క‌రు కూడా క్లాసుల‌కు హాజ‌రుకాలేదు.’’ అని అన్నారు. కాగా అసిస్టెంట్ ప్రొఫెసర్ లాలన్ 2019 సెప్టెంబర్ 24వ తేదీన యూనివర్సిటీలో నియమితులయ్యారు.