Bhagwant Mann Wedding: ఘనంగా భగవంత్ మాన్ పెళ్లి.. హాజరైన కేజ్రీవాల్.. ఫోటోలు..
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వివాహం నేడు ఘనంగా జరిగింది. ఆయన డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ను రెండో వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు, అతికొద్ది మంది సన్నిహితులు హాజరయ్యారు.

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వివాహం నేడు ఘనంగా జరిగింది. ఆయన డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ను రెండో వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు, అతికొద్ది మంది సన్నిహితులు హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఎంపీ రాఘవ్ చద్దాతో పాటు పలువురు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు హాజరయ్యారు.
ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన కొన్ని చిత్రాలను రాఘవ్ చద్దా ట్విట్టర్‌లో షేర్ చేశారు. Mann Sahab స్పెషల్ డే అని పేర్కొన్నారు. ఆ ఫొటోలో భగవంత్ మాన్‌తో పాటు, అరవింద్ కేజ్రీవాల్, రాఘవ్ చద్దా ఉన్నారు.
48 ఏళ్ల భగవంత్ మాన్ వారికి కుటుంబానికి తెలిసిన డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ను వివాహం బంధంలోకి అడుగుపెట్టారు. 32 ఏళ్ల గురుప్రీత్ కౌర్ పంజాబ్ ఎన్నికల ప్రచారంలో భగవంత్ మాన్‌కు సాయం చేసినట్టుగా ఆప్ వర్గాలు తెలిపాయి.
‘‘భగవంత్ మాన్ మళ్లీ పెళ్లి చేసుకుని స్థిరపడాలనేది ఆయన తల్లి కల. నేను అతనిని అభినందిస్తున్నాను. దేవుడు ఈ జంటను ఆశీర్వదిస్తాడు’’ అని ఈ పెళ్లి కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న రాఘవ్ చద్దా మీడియాకు తెలిపారు.
ఇక, మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న 7 ఏళ్ల తర్వాత భగవంత్ మాన్ రెండో వివాహం చేసుకున్నారు. ఇక, భగవంత్ మాన్ కొన్నేళ్ల కిందట Inderpreet Kaurను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు Dilshan Mann, Sirat Kaur Mann ఉన్నారు.
అయితే 2015లో భగవంత్ మాన్, ఇందర్‌ప్రీత్ కౌర్ విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం భగవంత్ మాన్ ఇద్దరు పిల్లలు.. వారి తల్లితో కలిసి యూనైటెడ్ స్టేట్స్‌లో నివసిస్తున్నారు. అయితే ఇటీవల పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ఇద్దరు పిల్లలు వచ్చారు.