కాళీ పోస్టర్ వివాదం సద్దుమణగకముందే.. సిగరెట్ వెలిగిస్తున్న శివుడి పోస్టర్ వివాదాస్పదంగా మారింది. తమిళనాడులోని కన్యాకుమారిలో వెలిసిన పోస్టర్ వివాదానికి కారణమయ్యింది.
చెన్నై : మదురైలో జన్మించి, కెనడాలో స్థిరపడిన భారతీయ చిత్రనిర్మాత లీనా మణిమేకలై తీస్తున్న సినిమా కాళి పోస్టర్ వివాదం ఇంకా ముగియలేదు. ఇంతలో తమిళనాడులోని కన్యాకుమారిలో శివుడు ‘సిగరెట్ వెలిగిస్తున్న’ పోస్టర్ ఒకటి కనిపించింది. ఇది మరో వివాదానికి తెరలేపినట్లయ్యింది.
అయితే, ఈ పోస్టర్ ను ఇటీవలే పెళ్లి చేసుకున్న తమ స్నేహితుడికి శుభాకాంక్షలు చెప్పడానికి కొంతమంది స్నేహితులు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ పోస్టర్ ను స్థానిక పోలీసులు వెంటనే తొలగించారు. పోస్టర్‌లో కనిపిస్తున్న వరుడు కన్యాకుమారి జిల్లా ఆరోకియాపురంలో ఉండే ప్రతీష్, అతని భార్య. ఆ ఫొటో పక్కన మధ్యలో శివుడు, పార్వతీదేవి.. మరోవైపు శివుడు సిగరెట్ వెలిగిస్తుండడం.. కింద శుభాకాంక్షలు తెలుపుతున్న ఫ్రెండ్స్ ఫొటోలతో ఈ పోస్టర్ ఏర్పాటు చేశారు.
ఈ సమస్య చాలా సున్నితమైందిగా స్థానిక పోలీసులు గ్రహించారు. ఈ పోస్టర్ మీద అనేక హిందూ సంస్థల నుండి ఫిర్యాదులను రావడంతో.. వెంటనే స్పందించిన స్థానిక పోలీసులు వెంటనే బ్యానర్‌ను తొలగించారు. అంతేకాదు పోస్టర్ లో ఉన్న వరుడు, అతని స్నేహితులను కూడా పోలీసులు పిలిపించి, హెచ్చరించి వదిలేశారు.
Kaali poster row: వివాదాస్పద కాళీమాత పోస్టర్.. చిత్ర నిర్మాత సహా మరో ఇద్దరిపై కేసు నమోదు
ఈ సంఘటన లీనా మణిమేకలై చిత్రం కాళి పోస్టర్‌పై చెలరేగుతున్న వివాదాల మధ్యలో కనిపించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కాళీ పోస్టర్ లో కాళీ దేవిగా మేకప్ వేసుకున్న ఓ మహిళ ఒక చేత్తో సిగరెట్ తాగుతూ, మరో చేత్తో LGBTQ జెండాను పట్టుకుని ఉంది. ఈ పోస్టర్ వివాదాస్పదంగా మారింది. ఈ పోస్టర్‌ను తొలగించాలని నిరసనలు, డిమాండ్‌ల మధ్య చిత్ర దర్శకురాలిపై అనేక పోలీసు ఫిర్యాదులు నమోదయ్యాయి.
వివాదాస్పద పోస్టర్ విషయంగా ఆమె మీద విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. దీనికి మణిమేకలై స్పందిస్తూ.. తాను జీవించి ఉన్నంత వరకు నిర్భయంగా తన వాయిస్‌ని వినిపిస్తూనే ఉంటానని చెప్పింది. 'అరెస్ట్ లీనా మణిమేకలై' అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తుఫానుకు దారితీసింది, ఈ చిత్రనిర్మాత మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తుందని ఆరోపణలు వెల్లువెత్తాయి. 'గౌ మహాసభ' పేరుతో ఏర్పడిన ఒక గ్రూప్ సభ్యుడు ఢిల్లీ పోలీసులకు ఆమె మీద ఫిర్యాదు చేశారు. దాడులకు ప్రతిస్పందనగా, టొరంటోకు చెందిన దర్శకురాలు. తన ప్రాణాలను ఫణంగా పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నానని తిప్పి కొట్టింది.
ప్రముఖ ఫిల్మ్ మేకర్ లీనా మణిమేకలై కాళి అనే డాక్యుమెంటీ రూపొందించింది. అయితే, డాక్యుమెంటరీ కోసం రూపొందించిన ఓ పోస్టర్ వివాదానికి కారణమయ్యింది. ఇంతకీ ఆ పోస్టర్ లో ఏముందంటే.. పోస్టర్ లో కాళి మాత సిగరెట్ తాగుతూ.. ఓ చేత్తో ఎల్జీబీటీ జెండాను పట్టుకుని ఉంది. దీంతో ఈ పోస్టర్ మీద సోషల్ మీడియాలో దుమారం చెలరేగింది. ఆమెపై తీవ్ర స్థాయిలో ట్రోటింగ్ మొదలయ్యింది. ట్విట్టర్లో అయితే #arrestleenamanimekalai హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. దీనిమీద ప్రధాని, అమిత్ షా చర్యలు తీసుకోవాలని డిమాండ్స్ వెల్లువెత్తాయి.
