ఓ రైతు తన తోటలో పండిన టమాటాలను లారీలో మార్కెట్ కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇద్దరు దంపతులు, వారి అనుచరులు లారీని అడ్డగించి, దానిని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక్క సారిగా ఈ పెరిగిన ధరల వల్ల నేరాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ రైతు తరలిస్తున్న టమాటా లోడ్ ను ఇద్దరు దంపతులు ఎత్తుకెళ్లారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి, వెంబడించి ఎట్టకేలకు దొంగలను అదుపులోకి తీసుకున్నారు.
లంచం తీసుకొని దొంగలను వదిలిపెడుతున్నారు.. రోడ్డుపై పడుకొని నిరసన తెలిపిన పోలీసు.. వీడియో వైరల్
వివరాలు ఇలా ఉన్నాయి. . ఈ నెల 8న చిత్రదుర్గ జిల్లా హిరియూరు పట్టణం నుంచి కోలార్ మార్కెట్ కు శివన్న అనే రైతు లారీలో టమాటాలను తరలిస్తున్నాడు. అందులో దాదాపు రూ. 2.5 లక్షల విలువైన టమోటాలు ఉన్నాయి. దీంతో దారి మధ్యలో ఓ వాహనంతో ఆ లారీని భాస్కరన్, సింధూజ అనే దంపతులు ఢీకొట్టారు. అనంతరం తరువాత ఆ దంపతులతో ఉన్న రాకీ, కుమార్ లు ట్రక్కును వెంబడించి చిక్కజాల సమీపంలో అడ్డుకున్నారు.
ఆ తర్వాత లారీ నుంచి శివన్నను బలవంతంగా కిందకు దింపారు. అనంతరం ట్రక్కును తమిళనాడులోని వాణియంబాడికి తీసుకెళ్లి అక్కడే వదిలేశారు. అయితే దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు లారీని వెంబడించి భాస్కరన్, సింధుజలను అరెస్టు చేశారు. మరో ఇద్దరు అనుచరులు పరారీలో ఉన్నారు.
మళ్లీ దేశ రాజధానికి వరద ముప్పు.. ప్రమాద స్థాయిని దాటిన యమునా నీటిమట్టం.. అలెర్ట్ అయిన ప్రభుత్వం
కాగా.. దంపతులపై దొంగతనం, నేరపూరిత కుట్ర అభియోగాలు మోపారు. ప్రస్తుతం వారు పోలీసుల అదుపులో ఉన్నారు. ఇదిలా ఉండగా.. కర్ణాటకలో పెరిగిపోతున్న లారీ దొంగతనాలకు ఈ ఘటన సాక్ష్యంగా నిలిచింది. ఇటీవలి నెలల్లో రాష్ట్రంలో అనేక ట్రక్కులు, లారీలు చోరీకి గురవుతున్నాయి. వాటిని తరచుగా హింసాత్మక ఘటనలకు ఉపయోగిస్తున్నారు.
గ్రీజుతో తాకాడని.. దళితుడి ముఖం, తల, శరీరంపై మానవ మలాన్ని పూసి.. మధ్యప్రదేశ్ లో మళ్లీ దారుణం..
దీంతో ట్రక్కు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలు ఉంటే అధికారులకు తెలియజేయాలని పోలీసులు కోరుతున్నారు. టమోటా ట్రక్కు చోరీ కేసులో మరో ఇద్దరు సహచరులను పట్టుకునేందుకు ప్రజలకు తమకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
