గ్రీజుతో తాకాడని.. దళితుడి ముఖం, తల, శరీరంపై మానవ మలాన్ని పూసి.. మధ్యప్రదేశ్ లో మళ్లీ దారుణం..
దళితుడు గ్రీజ్ తో అనుకోకుండా తాకాడని ఓబీసీ వర్గానికి చెందిన ఓ వ్యక్తి అతడిపై అమానవీయంగా ప్రవర్తించాడు. ఓ మగ్గులో మానవ విసర్జకాలను తీసుకొచి శరీరం, ముఖం, తలపై పూశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది.

మధ్యప్రదేశ్ లో మళ్లీ దారుణం చోటు చేసుకుంది. ఇటీవల సిద్ధి జిల్లాలో గిరిజనుడిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసి, వీడియో వైరల్ అవడంతో దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఘటన మరవకముందే అదే రాష్ట్రంలో దానికన్నా ఘోరమైన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఓ దళితుడిపై మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అమానవీయంగా ప్రవర్తించాడు. కేవలం గ్రీజుతో అనుకోకుండా తాకడంతో అతడి ముఖం, శరీరం, తలపై మానవ విసర్జకాలు పూశాడు.
హింసకు పాల్పడితే దేవాలయాలనైనా మూసివేయండి - మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛతర్పూర్ జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలోని బికౌరా గ్రామం ఉంది. ఆ ఊర్లో గ్రామ పంచాయతీ కోసం డ్రైనేజీ నిర్మాణం చేపడుతున్నారు. ఇందులో దళిత సామాజిక వర్గానికి చెందిన అహిర్వార్, మరి కొందరితో కలిసి శుక్రవారం ఈ నిర్మాణ పనులు చేస్తున్నాడు. ఈ ప్రాంతానికి సమీపంలోని హాండ్ పంప్ వద్ద ఓబీసీ వర్గానికి చెందిన రాంకృపాల్ పటేల్ స్నానం చేస్తున్నాడు. ఈ క్రమంలో నిర్మాణ పనుల్లో వాడుతున్న గ్రీజ్ అనుకోకుండా అహిర్వార్ చేతితో పటేల్ ను తాకింది.
మంచినీరు అని భావించి యాసిడ్ తాగిన కార్మికురాలు.. తరువాత ఏమైందంటే ?
దీంతో అతడు కోపోద్రిక్తుడు అయ్యాడు. అహిర్వార్ ను కులం పేరుతో దూషించాడు. దీంతో పటేల్ ఆగ్రహంతో ఊగిపోతూ తన స్నానానికి ఉపయోగించిన మగ్గులో పక్కనే ఉన్న మలాన్ని తీసుకొచ్చి అతడి తల, ముఖంతో పాటు శరీరంపై కూడా పూశాడు. దీంతో బాధితుడు ఈ విషయం గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. వారు పంచాయితీ నిర్వహించారు. అయితే అహిర్వార్ కు న్యాయం చేయడానికి బదులు అతడికే తిరిగి రూ.600 జరిమానా విధించారు.
యూట్యూబ్ లో ఉన్నట్టు చేసి ప్రాణాలో పోగొట్టుకున్న ఆరో తరగతి విద్యార్థి.. ఇంతకీ ఆ బాలుడు ఏం చేశాడంటే ?
కాగా.. బాధితుడు ఆ రోజు తన డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి చేసి, మరుసటి రోజు శనివారం ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రాంకృపాల్ పటేల్ పై ఐపీసీ సెక్షన్ 294 (అశ్లీల చర్యలు లేదా బహిరంగ పదాలకు శిక్ష), 506 (క్రిమినల్ బెదిరింపు), షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ (ఎస్ డీఓపీ) మన్మోహన్ సింగ్ బఘేల్ తెలిపారు. ఈ ఘటనలో నిందితుడి, బాధితుడి వయస్సు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందని బఘేల్ ‘పీటీఐ’తో చెప్పారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పంచాయితీ విషయంపై తనకు సమాచారం లేదని అన్నారు.