నటీ నటులు 30 రోజులు టమాటాలు తినకపోతే శరీరంలో ప్రోటీనేం తగ్గిపోదు - మహారాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ముండే..
నటీ నటులు 30 రోజుల పాటు టమాటాలు తినకపోతే వారి శరీరంలోని ప్రోటీన్ లేమీ తగ్గిపోవని మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ధనుంజయ్ ముండే అన్నారు. టమాటాల ధర పెరగడం వల్ల రైతులకు లాభం వస్తోందని, ఇది మంచి విషయమే అని తెలిపారు.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం టమోటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎక్కడ చూసినా వీటి గురించే చర్చ నడుస్తోంది. మన దగ్గర కిలోకకు రూ.120 నుంచి రూ.150 ధర పలుకుతోంది. అయితే ఉత్తర భారతదేశంలో మాత్రం దానికి రెట్టింపు ధర ఉంది. చంఢీగడ్ లో దీని రిటైల్ ధర కిలో రూ.300 నుంచి రూ.350కి చేరింది. ఇదే సమయంలో టమోటా ధరల పెరుగుదలపై రాజకీయాలు కూడా మొదలయ్యాయి. ధరలను అదుపులో పెట్టలేకపోతోందంటూ ఆయా ప్రభుత్వాలపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
దారుణం.. గవర్నమెంట్ స్కూల్ టీచర్ హత్య.. విజయనగరంలో ఘటన
అధికారంలో ఉన్న నాయకులు వారికి ధీటుగా బదులిస్తున్నారు. తాజాగా ఈ టమాటా ధరలపై మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా మాట్లాడారు. కానీ ఆయన ఓ అసంబద్ధమైన ప్రకటన చేశారు. ‘‘ నటీనటులు 30 రోజుల పాటు టమోటాలు తినకపోతే శరీరంలోని ప్రోటీన్ వాల్యూ తగ్గదు’’ అని పేర్కొన్నారు.
వాస్తవానికి శుక్రవారమే ఆయన మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన.. ఇటీవల మహారాష్ట్రలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో భాగంగా అజిత్ పవార్ వర్గంలో చేరిపోయారు. జూలై 2వ తేదీన
అజిత్ పవార్ తో ఏక్ నాథ్ షిండే-బీజేపీ ప్రభుత్వంలో చేరిన 8 మంది ఎమ్మెల్యేలో ఆయన కూడా ఉన్నారు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆయనకు వ్యవసాయ మంత్రిత్వ శాఖను కేటాయించారు.
వావ్.. చంద్రయాన్ -3 ప్రయోగాన్ని విమానంలో నుంచి వీడియో తీసిన ప్రయాణికుడు.. వైరల్
కాగా.. శనివారం మంత్రి ధనుంజయ్ ముండే వ్యవసాయ శాఖ అధికారులతో మొదటి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం టమోటా ధరల పెరుగుదలపై మీడియాతో ఆయన మాట్లాడుతూ.. టమోటా ధరల పెరుగుదల కారణంగా కొంతమంది నిరసన తెలిపారని అన్నారు. ‘‘టమోటా అమ్మే రైతుకు ఎక్కువ డబ్బు వస్తే మంచిదే. ఆ విషయంలో రాజకీయాలు ఉండకూడదు. 30 రోజుల పాటు టమోటాలు తినకపోతే శరీరంలోని ప్రోటీన్ వాల్యూ తగ్గదు’’అని వ్యాఖ్యానించారు.
చిరుత అనారోగ్యంగా ఉందని, బైక్ పై ఎక్కించుకొని హాస్పిటల్ కు తీసుకెళ్లిన యువకుడు.. నోరెళ్లబెట్టిన జనం
ఇటీవల నటుడు సునీల్ శెట్టి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ మంత్రి ఈ విధంగా మాట్లాడారని తెలుస్తోంది. టమాటా ధరల పెరుగుదలపై నటుడు సునీల్ శెట్టి మాట్లాడుతూ.. ‘‘ నా భార్య మనా శెట్టి ఒకటి లేదా రెండు రోజులకు ఒక సారి తాజా కూరగాయలు కొంటుంది. అయితే ప్రస్తుతం టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇది మన వంటగదిని కూడా ప్రభావితం చేసింది. కాబట్టి నేను టమోటాలు తక్కువగా తింటున్నాను. నేను సూపర్ స్టార్ కాబట్టి ఇలాంటి విషయాలు నన్ను ప్రభావితం చేయవని ప్రజలు అనుకోవచ్చు, కానీ అది నిజం కాదు. ఇలాంటి సమస్యలను నేను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.’’ అని అన్నారు.