Asianet News TeluguAsianet News Telugu

జార్ఖండ్‌లోని దుమ్కాలో చెట్టుకు వేలాడుతూ మరో గిరిజన బాలిక మృతదేహం

Dumka district: జార్ఖండ్‌లోని దుమ్కాలో చెట్టుకు వేలాడుతూ మరో గిరిజన బాలిక మృతదేహం తొలుత గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించగా, వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
 

Another tribal girl's body hanged from a tree in Dumka, Jharkhand
Author
First Published Oct 13, 2022, 4:07 AM IST

Jharkhand: జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో ఓ గిరిజన బాలిక మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. గత మూడు నెలల్లో దుమ్కాలో ఇలాంటి ఘటనలు జరగడం ఇది నాలుగోసారి. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి దుర్వాసన వచ్చింది. మృతదేహాన్ని మొదట గుర్తించిన గ్రామస్తులు వెంట‌నే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని శవపరీక్ష కోసం పంపారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే విషయం దర్యాప్తు తర్వాతే తెలుస్తుందని పోలీసులు తెలిపారు. బాలిక రెండు మూడు రోజుల క్రితం మరణించిందనీ, మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిందని స్థానికులు తెలిపారు.

కాగా, మృతురాలిని 10వ తరగతి విద్యార్థినిగా గుర్తించారు. దుమ్కాలోని అంబజోరా గ్రామంలో తన అమ్మమ్మ, తోబుట్టువులతో కలిసి నివసిస్తోంది. ఆమె రాంకుమార్ మరాండి అనే యువకుడితో సంబంధం కలిగి ఉందని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. అతను తరచుగా అమ్మాయిని చూడ‌టానికి ఇంటికి వచ్చేవాడ‌నీ, దీంతో ఆగ్రహించిన ఇంటి యజమాని బాలిక కుటుంబాన్ని బయటకు వెళ్లాల్సిందిగా కోరాడు. బాధితురాలి తండ్రి సెప్టెంబర్ 26న ఆమెను కలవడానికి వచ్చి ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. తన కుమార్తె పరీక్షలు పూర్తయ్యే వరకు వారిని ఉండనివ్వమని యజమానిని కోరాడు. 

అయితే, మరుసటి రోజు, బాలిక అంబజోడ నుండి జిల్లాలోని బద్దల్లా గ్రామంలోని తన మేనమామ ఇంటికి బయలుదేరింది. అక్టోబర్ 7న తల్లిదండ్రుల ఇంటికి వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతకడం ప్రారంభించారు. అయితే, ఆమె జాడ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు అక్టోబర్ 10న రామ్‌కుమార్ మరాండీని సంప్రదించగా.. మరుసటి రోజు పోలీసులకు మిస్సింగ్ కేసు పెట్టారు. ఈ రోజు, బద్దల్లా గ్రామంలో ఒక చెట్టుకు బాలిక మృతదేహం వేలాడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలియగానే, వారు తమ బాలిక మృతదేహాన్ని కనుగొనడానికి సంఘటన స్థలానికి చేరుకున్నారు.

బాలిక మృతదేహాన్ని కనుగొన్న తర్వాత, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యువకుడు ముఫాసిల్‌లోని జియాధర్ గ్రామానికి చెందిన యువకుడితో పరిచయం కలిగి ఉన్నాడని తేలింది. కాతికుండ్ పోలీసుల సూచన మేరకు ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతని గురించి పోలీసులు ఇంకా ఏమీ వెల్లడించలేదు.

“అమ్మాయి పూజ సెలవుల్లో తన మామయ్య దగ్గర ఉండడానికి వచ్చింది. అక్టోబరు 7న ఆమె తన ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు నిన్న సాయంత్రం వరకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఈ ఉదయం, మేము బద్దల్లాలోని చెట్టు నుండి బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాము”అని పోలీసులు తెలిపారు. "ప్రేమ వ్యవహారం ఉంద‌ని స‌మాచారం. అయితే, ఈ ఘ‌ట‌న‌పై మేము దానిని హత్య కేసుగా పరిశోధిస్తున్నాము" అని పోలీసులు తెలిపారు. బీజేపీ నాయ‌కుడు, మాజీ సాంఘిక సంక్షేమ మంత్రి లూయిస్ మరాండి మాట్లాడుతూ.. “ఇటీవలి రోజుల్లో, ఇటువంటి సంఘటనల గురించి నిరంతరం వార్తలు వస్తున్నాయి. ఇది చాలా ఆందోళన కలిగిస్తుంది. గత మూడు నెలల్లో దుమ్కా జిల్లాలో ఇలాంటిది నాలుగో సంఘటన. దీనికి సంబంధించి కఠిన చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఎంతమంది అమ్మాయిలు ఇలా ప్రాణాలు కోల్పోవాల్సి వ‌స్తుందో" నంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios