పెంపుడు జంతువులను వేటాడేందుకు ఓ సింహం గుజరాత్ లోని ఓ గ్రామంలోకి అడుగుపెట్టింది. అయితే ఆ గ్రామంలో ఉన్న వీధి కుక్కలు దానిని గమనించాయి. ఆ సింహం ఊరి నుంచి పారిపోయేదాకా దానిని తరిమికొట్టాయి. 

సింహం అడవికి రాజు. దానిని చూసి అన్ని జంతువులు భయపడతాయి. మనుషులు కూడా సింహం కనిపిస్తే ఆమడ దూరం పరిగెడుతారు. అలాంటి సింహం ఒక వేళ గ్రామంలోకి అడుగు పెడితే ఏం జరుగుతుంది. అందరూ తలుపులు మూసేసి ఇళ్లల్లోనే దాక్కుంటారు. అది వెళ్లిపోయేదాకా బయటకు అడుగుపెట్టారు. కానీ అదే సింహం వీధి కుక్కల కంటపడితే ఏం జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా ? ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. అలాంటి ఘటన గురించే మనం ఇప్పుడు చదవబోతున్నాం.

పెరుగుతున్న కోవిడ్ కేసులు: కొత్తగా 1300 మందికి పాజిటివ్.. గ‌త 140 రోజుల్లోనే అత్య‌ధికం

గుజరాత్ రాష్ట్రంలోని ఓ గ్రామంలోకి ఓ సింహం అడుగుపెట్టింది. అయితే అది గ్రామంలోని వీధి కుక్కల కంట పడింది. దీంతో ఆ కుక్కలన్నీ కలిసి సింహాన్ని గ్రామం నుంచి తరిమికొట్టాయి. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత్ నందా (ఐఎఫ్ఎస్ సుశాంత నందా) షేర్ చేశారు. తన వీధిలో కుక్క కూడా ఒక సింహమే అనే క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Scroll to load tweet…

ఈ వీడియో గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ గ్రామంలోనిది. రాత్రి సమయంలో ఒక బబ్బర్ సింహం వేట కోసం గ్రామంలోకి అడుగుపెట్టింది. చీకట్లో ఆహారం కోసం సంచరిస్తున్న ఆ సింహాన్ని ఆ గ్రామంలో ఉన్న వీధి కుక్కలు గమనించాయి. దీంతో దానిని వెంబడించడం ప్రారంభించాయి. అది ఊరి నుంచి వెళ్లి పోయేదాకే దాని వెనకాలే పరిగెత్తాయి. చివరికి కుక్కల బాధ భరించలేక సింహం పారిపోయింది.

కుక్కలకు సింహం కూడా భయపడుతుందా అనే విషయం ఈ వీడియో చూసేంత వరకు ఎవ్వరూ నమ్మరు. ఈ ఘటన మొత్తాన్ని ఎవరో కెమెరాలో బంధించగా ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ క్లిప్ షేర్ చేసిన తరువాత ఇప్పటి వరకు వేలాది వ్యూవ్స్ వచ్చాయి. పోస్ట్ చేసిన గంటలోనే ఐదు వేల మంది దీనిని చూశారు. 300 లైక్‌లు వచ్చాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే వచ్చింది. 

మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు: రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు

కాగా.. ఈ వీడియోను ఇంతకు ముందు అజయ్ చౌహాన్41 అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. అతడు క్యాప్షన్ లో ‘‘సింహాన్ని కుక్కలు వెంబడించాయి. గిర్ సోమనాథ్ గ్రామంలో వేటను వెతుక్కుంటూ వచ్చిన సింహాన్ని కుక్కలు తరిమి కొట్టాయి’’ అని రాశారు. అప్పటి ఈ వీడియో పలు సోషల్ మీడియా వేధికల్లో హల్ చల్ చేస్తోంది. తాగాజా దీనిని ఐఎఫ్ఎస్ సుశాంత నందా పోస్ట్ చేయడంతో మరింత వైరల్ గా మారింది. ఈ వీడియోకు నెటిజన్లు చాలా ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘‘గుజరాత్ రాష్ట్రంలో ఏ ఏ ప్రదేశాలలో ఇలాంటి పరిస్థితి ఉంది. ఆ విషయం తెలిస్తే నేను ఆ ప్రాంతాలకు వెల్లకుండా ఉంటాను.’’ అని ఓ యూజర్ కామెంట్ చేశారు.