Asianet News TeluguAsianet News Telugu

మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు: రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు


కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి  సూరత్  కోర్టులో  ఎదురు దెబ్బ తగిలింది.  మోడీపై  అనుచిత వ్యాఖ్యలు  చేసిన కేసులో  రాహుల్ ను దోషీగా తేల్చింది  కోర్టు. 

Modi surname remark: Rahul Gandhi convicted of defamation by Surat court lns
Author
First Published Mar 23, 2023, 11:20 AM IST

న్యూఢిల్లీ:   కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి  ఎదురు దెబ్బ తగిలింది.  దొంగలందరికీ  మోడీ అనే ఇంటి పేరు  ఎలా ఉందని  కాంగ్రెస్ పార్టీ ఎంపీ  రాహుల్ గాంధీ  చేసిన  వ్యాఖ్యలపై  సూరత్  కోర్టు  గురువారంనాడు  కీలక తీర్పు ఇచ్చింది.ఈ కేసులో  రాహుల్ గాంధీని దోషిగా  కోర్టు తేల్చింది.ఈ కేసులో  రాహుత్ గాంధీకి  సూరత్  కోర్టు  రెండేళ్ల జైలు శిక్ష విధించింది.  ఈ  తీర్పు వచ్చిన  అనంతరం  రాహుల్ గాంధీ  తరపు న్యాయవాదులు  కోర్టులో  బెయిల్  పిటిషన్ దాఖలు  చేశారు.  ఈ కేసులో రాహుల్ కు  బెయిల్ కూడా లభించింది.  . 2019  ఎన్నికల సమయంలో  రాహుల్ గాంధీ  నరేంద్ర మోడీపై  ఈ వ్యాఖ్యలు  చేశారు.2019  ఎన్నికల ప్రచారంలో  భాగంగా  కర్ణాటకలో  సభలో  రాహుల్ గాంధీ  ఈ వ్యాఖ్యలు  చేశారు

 

 ఈ వ్యాఖ్యలపై  కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం  సాగింది. రాహుల్ గాంధీ  నరేంద్ర మోడీపై  చేసిన వ్యాఖ్యల పై  గుజరాత్ మాజీ మంత్రి , బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ  ఈ విషయమై  పోలీసులకు  ఫిర్యాదు  చేశాడు.ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు  చేసిన విషయం తెలిసిందే. 

ఈ వ్యాఖ్యలు  చేసిన  రాహుల్ గాంధీని  క్షమాపణలు  చెప్పాలని  బీజేపీ  డిమాండ్  చేసిన విషయం తెలిసిందే.  ఈ వ్యాఖ్యలు  చేసిన రాహుల్ గాంధీకి  రెండేళ్ల జైలు  శిక్ష విధిస్తూ  కోర్టు తీర్పు చెప్పడం  బీజేపీ శ్రేణులకు  కొంత ఊరటనిచ్చింది.  రాహుల్ గాంధీకి  కోర్టు  ఈ శిక్ష విధించడంపై  బీజేపీ నేత అమిత్ మాలవీయ  స్వాగతించారు.  రాహుల్ గాంధీపై  ఐపీసీ  499, 500  సెక్షన్ కింద  కేసు నమోదు  చేసింది.  2021  అక్టోబర్ మాసంలో రాహుల్ గాంధీ  వాంగూల్మాన్ని కోర్టు  నమోదు  చేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios