Asianet News TeluguAsianet News Telugu

తల్లిదండ్రులు తిట్టారని ఇంటి నుంచి పారిపోయిన బాలిక.. ట్రైన్ లో అత్యాచారం చేసిన స్వీపర్

తల్లిదండ్రులు తిట్టారని ఓ బాలిక ఇంటి నుంచి పారిపోయింది. ఏం చేయాతో తెలియని పరిస్థితుల్లో ఓ రైల్వే స్టేషన్ కు చేరుకుంది. తరువాత ఆపి ఉన్న ట్రైన్ లో ఎక్కింది. అక్కడ ఆమెపై ఓ స్వీపర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. 

The girl who ran away from home because her parents scolded her.. The sweeper who raped her in the train
Author
First Published Jan 19, 2023, 11:30 AM IST

ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. తల్లిదండ్రులు తిట్టారని ఇంటి నుంచి పారిపోయిన ఓ బాలికపై రైల్వే కార్మికుడు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారుణం జనవరి 15వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ShareChat layoffs: కొనసాగుతున్న లేఆఫ్‌లు.. 500 మంది ఉద్యోగులను తొలగించిన షేర్‌చాట్

వివరాలు ఇలా ఉన్నాయి. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు మందలించడంతో ఓ మైనర్ బాలిక కోపంతో ఇంట్లో నుంచి జనవరి 15వ తేదీన పారిపోయింది. తరువాత ఇటావా స్టేషన్‌కు చేరుకుంది. ఓ బోగిలో వెళ్లి కూర్చుంది. ఈ సమయంలో ఆ బోగిలోకి ఓ స్వీపర్ వచ్చాడు. మైనర్‌ని ఒంటరిగా కూర్చుండటం చూసి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. తరువాత ఆమెపై అత్యారానికి పాల్పడ్డాడు. 

మరుసటి రోజు ఉదయం మైనర్ ఎటావా రైల్వే స్టేషన్‌లోని ప్రయాణీకులలో ఒకరి ఫోన్ అడిగి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. తనను అక్కడి నుంచి తీసుకెళ్లాలని కోరింది. తల్లిదండ్రులతో కలిసి ఝాన్సీ ఇంటికి చేరుకుంది. బాలిక ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఏం జరిగిందని తల్లిదండ్రులు ఆరా తీశారు. దీంతో తనపై జరిగిన అఘాయిత్యాన్ని బాలిక వివరింది. తల్లిదండ్రులు ఒక్క సారిగా షాక్ అయ్యారు. అనంతరం ఇటావా రైల్వే స్టేషన్‌కు తిరిగి వెళ్లి ఫిర్యాదు చేశారు.

సమాజ్ వాది పార్టీ నేత కూతురితో పారిపోయిన బీజేపీ నేత ఆశీశ్ శుక్లా..

ఫిర్యాదు మేరకు గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై ఆగ్రా జీఆర్‌పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) మహ్మద్ ముస్తాక్ మాట్లాడుతూ.. ఇటావా రైల్వే స్టేషన్ సమీపంలోని మాల్ గొడం ప్రాంతం నుంచి నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడిని రాజ్‌కపూర్‌ యాదవ్‌గా గుర్తించారు. అతను ఇటావా రైల్వేలో క్యారేజ్ మరియు వ్యాగన్ విభాగంలో పౌర కార్మికుడిగా పనిచేస్తున్నాడు.

ఇక ఓట్ ఫ్రమ్ హోమ్.. త్రిపురలో మొదటి సారిగా ప్రవేశపెట్టనున్న ఎన్నికల కమిషన్.. సీనియర్ సిటిజన్లకు అవకాశం..

బాలికపై అత్యాచారం చేసినట్లు నిందితుడు అంగీకరించారని ఎస్పీ తెలిపారు. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ‘‘పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని కూడా అంగీకరించాడు. సెక్షన్ 376, పోక్సో చట్టంతో పాటు ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. రిమాండ్ కోసం జైలుకు పంపించాం.’’ అని ఆయన చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios