Asianet News TeluguAsianet News Telugu

ShareChat layoffs: కొనసాగుతున్న లేఆఫ్‌లు.. 500 మంది ఉద్యోగులను తొలగించిన షేర్‌చాట్

Bangalore: షేర్ చాట్ లో లేఆఫ్‌ల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ఇప్పటికే 500 మంది ఉద్యోగులను తొలగించిన షేర్‌చాట్.. ఉద్యోగాల‌కు భారీ షాక్ ఇచ్చింది. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం షేర్‌చాట్ 20% మంది ఉద్యోగులను తొలగించింద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. కంపెనీ ఇన్వెస్ట్‌మెంట్ మార్కెట్ వృద్ధి వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి.
 

ShareChat layoffs: Continued layoffs.. ShareChat laid off 500 employees
Author
First Published Jan 19, 2023, 10:48 AM IST

ShareChat layoffs: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం షేర్ చాట్ లో లేఆఫ్‌ల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ఇప్పటికే 500 మంది ఉద్యోగులను తొలగించిన షేర్‌చాట్.. ఉద్యోగాల‌కు భారీ షాక్ ఇచ్చింది. సోషల్ మీడియా దిగ్గజం షేర్‌చాట్ 20% మంది ఉద్యోగులను తొలగించింద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

వివ‌రాల్లోకెళ్తే.. గత ఏడాది ప్రారంభం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపు ప్రమాదం పెరుగుతోంది. ముఖ్యంగా దీని ప్రభావం వెబ్ ఆధారిత కంపెనీలపై ఎక్కువగా పడింది. ఫేస్‌బుక్, గూగుల్, ట్విట్టర్ వంటి పెద్ద కంపెనీలు మొద‌లుకుని, చిన్న కంపెనీలు, వివిధ ప్రముఖ యాప్‌లు కూడా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నార‌ని నివేదిక‌లు పేర్కొంటున్నాయి. ఉద్యోగుల‌ను తొల‌గింపు ప్ర‌క్రియ‌ను ప్రారంభించిన కంపెనీల‌లో షేర్ చాట్ కూడా చేరింది. సోషల్ మీడియా దిగ్గజం షేర్‌చాట్ తన ఉద్యోగులలో 20శాతం మందిని తొలగించింది.

సోషల్ మీడియా దిగ్గజం షేర్‌చాట్.. 

ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ కంపెనీ షేర్‌చాట్ బెంగళూరులో ఉంది. ShareChat, దాని చిన్న వీడియో ప్లాట్‌ఫారమ్ మొహల్లా టెక్ (Mohalla Tech Pvt Ltd) ఉన్నాయి. షేర్‌చాట్ అన్ని వర్గాల వినియోగదారులలో ప్రసిద్ధి చెందింది. ఇది అనేక భారతీయ భాషలలో అందుబాటులో ఉంది. మంచి గుర్తింపుతో టాప్ యాప్స్ లో ఒక‌టిగా ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రజలు ఈ యాప్‌ను సులువుగా ఉపయోగించుకునేలా దీన్ని ఏర్పాటు చేశారు. షేర్ చాట్ అనేది షేర్ చాట్, మోజ్, మోజ్ లైట్+ వంటి యాప్‌ల మాతృ సంస్థ. భారతదేశంలో టిక్‌టాక్ నిషేధించబడిన తర్వాత, మోజ్ ప్రారంభించబడింది. ఇప్ప‌టికీ ఇది విజయవంతంగా నడుస్తోంది. షేర్‌చాట్‌లో దాదాపు 2,100 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ సందర్భంలో, షేర్‌చాట్ తన ఉద్యోగులలో 20 శాతం మందిని తొలగించింది. 2,100 మంది ఉద్యోగుల్లో 500 నుంచి 600 మందిని తొలగించారని చెబుతున్నారు.

ఉద్యోగుల‌ తొలగింపున‌కు కార‌ణాలు.. 

షేర్‌చాట్ ప్రతినిధి ఒక‌రు ఉద్యోగుల‌ తొలగింపులపై వ్యాఖ్యానిస్తూ, “మేము మా కంపెనీ చరిత్రలో అత్యంత విషాదకరమైన నిర్ణయం తీసుకున్నాము. మొదటి నుండి మాతో పనిచేసిన మా ఉత్తమ ఉద్యోగులలో 20 శాతం మందిని తొలగించవలసి వచ్చింది" అని పేర్కొన్నారు. అలాగే, కంపెనీ ఇన్వెస్ట్‌మెంట్ మార్కెట్ వృద్ధి వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుని, ఈ లేఆఫ్ తీసుకోబడిందని తెలిపారు. అస్థిర ఆర్థిక వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ తొలగింపులు చేపట్టినట్లు షేర్‌చాట్‌ ప్రతినిధి తెలిపారు. షేర్‌చాట్ తన వర్క్‌ఫోర్స్‌ను అధికంగా నియమించుకోవడం వల్ల ఇటువంటి తొలగింపులకు కారణాలుగా ఉన్నాయ‌ని కూడా పేర్కొన్నారు. 

2021-2022 ఆర్థిక సంవత్సరానికి మొహల్లా (Mohalla Tech Pvt Ltd) మొత్తం ఆదాయం రూ. 80 కోట్లుగా ఉండ‌గా,  4.3 రెట్లు పెరిగి రూ. 419.2 కోట్లుగా నమోదైంది. మొహల్లా టెక్ షేర్‌చాట్ ప్రకటనల ద్వారా కంపెనీ ఆదాయానికి భారీగా సహకరిస్తుంది. మొహల్లా కంపెనీ తన వార్షిక ఆదాయంలో 30% ప్రకటనల ద్వారా సంపాదిస్తున్నట్లు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం 2021లో మొహల్లా టెక్ ఖర్చు రూ.1,557.5 కోట్లు. ఖర్చు చేసిన మొత్తంతో పోలిస్తే 119% వృద్ధితో రూ.3,407.5 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు నివేదిక‌లు పేర్కొంటున్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios