Asianet News TeluguAsianet News Telugu

అత్యాచారాన్ని ప్రతిఘటించిందని బాలిక హత్య.. నిందితుడిపై కాల్పులు జరిపి, అరెస్టు చేసిన పోలీసులు..

అత్యాచారాన్ని ప్రతిఘటించిందని ఓ బాలికపై యువకుడు దారుణంగా ప్రవర్తించాడు. ఘోరం హత్య చేసి పరిపోయాడు. పోలీసులు అతడిని పట్టుకోవడానికి వెళ్తే వారిపైనే కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు కూడా అతడిపై కాల్పులు జరిపి, చివరికి అరెస్టు చేశారు. 

The girl was killed for resisting the rape.. The police shot at the accused and arrested him..ISR
Author
First Published Oct 12, 2023, 4:13 PM IST | Last Updated Oct 12, 2023, 4:13 PM IST

లైంగిక దాడిని ప్రతిఘటించిందని ఓ బాలికపై కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడరు. ఆమెను ఘోరంగా హతమార్చాడు. అయితే దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్టు చేయడానికి వెళ్తే పోలీసులపైనే కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు కూడా అతడిపై ఎదురుకాల్పులు జరిపి.. ఎట్టకేలకు పట్టుకున్నారు. ఈ ఘటన యూపీలో జరిగింది. 

హమాస్ ను భూమి మీద కనిపించకుండా అంతం చేస్తాం - ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రతిజ్ఞ

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని లఖింపూర్ ప్రాంతంలో 8 ఏళ్ల మైనర్ బాలిక జీవిస్తోంది. అదే ప్రాంతంలో 23 ఏళ్ల సద్దాం కూడా జీవిస్తున్నాడు. ఒకే ప్రాంతంలో కలిసి ఉండటం వల్ల ఒకరికొకరు పరిచయం ఉంది. ఇటీవల సద్దాం ఆ బాలికను సమీపంలోని చెరకు తోటలోకి పిలిపించాడు. దీంతో ఆ బాలిక వెళ్లింది. అయితే అక్కడికి వెళ్లిన తరువాత ఆ బాలిక పై సద్దాం అసభ్యంగా ప్రవర్తించాడు.

ఇజ్రాయెల్ లో చిక్కుకున్న భారతీయల కోసం ‘ఆపరేషన్ అజయ్’.. నేడు బయలుదేరనున్న మొదటి విమానం..

బాలికను పొలాల్లోకి లాక్కెళ్లిపోయాడు. ఆమెపై అత్యాచారం చేయాలని భావించాడు. కానీ బాలిక దానిని ప్రతిఘటించింది. దీంతో అతడు కోపోద్రిక్తుడయ్యాడు. ఆమెను దారుణంగా హతమార్చాడు. అక్కడి నుంచి పారిపోయాడు. అయితే బాలిక తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు కంగారు పడ్డారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. అక్టోబర్ 8వ తేదీన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. 

తిరుపతికి డబుల్ డెక్కర్ ఈ-బస్సులు.. ఏపీలో తొలి సారిగా ఇక్కడే సేవలు.. ఎప్పటి నుంచి అంటే ?

అయితే మరుసటి రోజు బాలిక చెరకు తోటలో శవమై కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతడి కోసం ప్రత్యేకంగా ఓ బృందాన్ని రంగంలోకి దింపారు. ఓ ప్రాంతంలో అతడి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు కూడా కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ క్రమంలో సద్దాంకు బుల్లెట్ గాయం అయ్యింది. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశామని లఖింపూర్ ఖేరి ఎస్పీ గణేష్ ప్రసాద్ సాహా తెలిపారు. ఈ ఘటనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios