హమాస్ ను భూమి మీద కనిపించకుండా అంతం చేస్తాం - ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రతిజ్ఞ
ఇజ్రాయెల్ పై దాడి చేసిన హమాస్ ను భూమిపై లేకుండా చేస్తామని ప్రధాని నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు. మహిళలు, చిన్నారులు, బాలికపై దాడి చేయడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ను భూమి మీద కనిపించకుండా అంతం చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. ప్రపంచం మొత్తం ఐసిస్ ను అనిచివేసినట్టుగానే మేము హమాస్ ను నిర్మూలిస్తామని స్పష్టం చేశారు. ఇజ్రాయిల్ పై హమాస్ ఆకస్మికంగా దాడి చేసిన నాటి నుంచి తీవ్ర ప్రాణ నష్టం జరుగుతోంది. యుద్ధానికి ఇజ్రాయెల్ కూడా సిద్ధపడటంతో మరింత విధ్వంసం జరుగుతోంది. అయితే హమాస్ దళాలు మహిళలు, పిల్లలపై క్రూరత్వం చూపిస్తుండటంతో ఇజ్రాయెల్ ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
5 వేల ఏళ్లుగా భారత్ లౌకిక దేశమే - ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
ఈ దారుణాలు బుధవారం వెలుగులోకి రావడంతో నెతన్యాహు హమాస్ పై కన్నెర్ర చేశారు. హమాస్ భూమి మీద లేకుండా చేస్తామని, దానిని తుడిచిపెట్టేస్తామని ప్రతిజ్ఞ చేశారు.‘‘హమాస్ అంటే ఐసిస్- ప్రపంచం ఐసిస్ ను అణచివేసి నిర్మూలించింది. కాబట్టి మేము ఐసిస్ ను అంతం చేస్తాం’’ అని ఆయన ‘ఎక్స్’(ట్విట్టర్)లో పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మిలిటెంట్ గ్రూపులోని ప్రతి సభ్యుడిని ‘చనిపోయిన మనిషి’ గా అభివర్ణించారు. అర్థరాత్రి జాతినుద్దేశించి ప్రసంగించిన నెతన్యాహు.. 40 మంది చిన్నారుల తలలు నరికి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. సైనికులపై క్రూరంగా దాడి చేశారని, మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారని మీడియాలో వచ్చిన వార్తలను ధృవీకరించారు. బాలురు, బాలికల తలలపై కాల్పులు జరిపారని, ప్రజలను సజీవ దహనం చేశారని ఆయన అన్నారు.
పాలస్తీనాలో కాల్పుల విరమణకు పిలుపునిచ్చిన మలాలా.. యుద్ధం పిల్లలనూ వదలదన్న శాంతి బహుమతి గ్రహీత
గత శనివారం ఇజ్రాయిల్ పై హమాస్ ఆకస్మికంగా దాడి చేసింది. దీంతో ఇజ్రాయెల్ ఎదురుదాడికి దిగింది. హమాస్ దళాలు తలదాచుకున్న గాజా స్ట్రిప్ లో ఇజ్రాయెల్ భీకరంగా దాది చేస్తోంది. అయితే ఈ యుద్ధంతో ఇరువైపులా తీవ్ర ప్రాణ నష్టం జరుగుతోంది. ఈ దాడిలో కనీసం 1,200 మంది ఇజ్రాయెలీలు మరణించారు. మొత్తంగా ఇరువైపులా 3000 వేల మంది చనిపోయారని పలు నివేదికలు చెబుతున్నాయి.