ఇజ్రాయెల్ లో చిక్కుకున్న భారతీయల కోసం ‘ఆపరేషన్ అజయ్’.. నేడు బయలుదేరనున్న మొదటి విమానం..
ఇజ్రాయెల్ లో చిక్కుకున్న భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ అజయ్’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా మొట్ట మొదటి విమానం నేటి సాయంత్రం టెల్ అవీవ్ విమానాశ్రయం నుంచి బయలుదేరనుంది.
యుద్ధంతో అతలాకుతలమైన ఇజ్రాయెల్ చిక్కుకుపోయిన పౌరులను స్వదేశానికి తీసుకురావడానికి భారత్ 'ఆపరేషన్ అజయ్'ను ప్రారంభించించింది. అక్కడ నెలకొన్న పరిస్థితులతో ఇబ్బంది పడుతున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు (గురువారం) సాయంత్రం టెల్ అవీవ్ విమానాశ్రయం నుండి మొదటి విమానం బయలుదేరనుంది.
సీబీఐ స్పెషల్ డైరెక్టర్ గా ఐపీఎస్ ఆఫీసర్ డీసీ జైన్.. ఈ నెలాఖరున పదవి విరమణ.. ఆలోపే ప్రమోషన్
యుద్ధంతో అతలాకుతమౌతున్న ఇజ్రాయెల్ లో సుమారు 18,000 మంది భారతీయులు నివసిస్తున్నారని, వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ అజయ్’ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ తెలిపింది. కాగా.. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ విషయంలో బుధవారం సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఇజ్రాయిల్ లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకువస్తున్నట్టు తెలిపారు. దాని కోసం ప్రత్యేక చార్టర్ విమానాలు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు.
ఇజ్రాయెల్ లో చిక్కుకున్న భారతీయుల కోసం అక్కడి భారత రాయబార కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. భారతీయులందరూ టెల్ అవిన్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ, అలాగే ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరింది. అలాగే ఇజ్రాయెల్లోని భారత రాయబారి సంజీవ్ సింగ్లా విడుదల చేసిన వీడియో సందేశంలో.. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, స్థానిక అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని కోరారు. ఏదైనా సమస్య వస్తే రాయబార కార్యాలయం అత్యవసర నంబర్లను సంప్రదించాలని సూచించారు.
5 వేల ఏళ్లుగా భారత్ లౌకిక దేశమే - ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం మాట్లాడారు. హమాస్ మిలిటెంట్లతో జరుగుతున్న యుద్ధం గురించి వివరించారు. ఈ సందర్భంగా హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలను మోడీ ఖండించారు. ఈ క్లిష్ట సమయంలో ఇజ్రాయెల్ కు మద్దతు ప్రకటించారు. అలాగే ఇజ్రాయెల్ లోని భారతీయ పౌరుల భద్రత, భద్రత అంశాన్ని ఆయన ప్రస్తావించారు.
కాగా.. ఇజ్రాయెల్ పై పొరుగున ఉన్న పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ మధ్య అక్టోబర్ 7 (శనివారం) దాడి చేసింది. దీంతో ఇజ్రాయెల్ దళాలు మరుసటి రోజు నుంచి యుద్ధం ప్రకటించింది. ఇరు దేశాల మధ్య యుద్ధం వల్ల ఇరువైపులా భారీగా ప్రాణనష్టం సంభవించింది. అధికారిక లెక్కల ప్రకారం ఘర్షణ తీవ్రతరం అయినప్పటి నుంచి ఇరువైపులా 4,000 మందికి పైగా చనిపోయారు.