తిరుపతికి డబుల్ డెక్కర్ ఈ-బస్సులు.. ఏపీలో తొలి సారిగా ఇక్కడే సేవలు.. ఎప్పటి నుంచి అంటే ?
తిరుపతిలో త్వరలోనే డబుల్ డెక్కర్ ఈ-బస్సులు సేవలు అందించనున్నాయి. దీని వల్ల తిరుపతి ప్రజలతో పాటు ప్రతీ రోజు లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు ఎంతో సౌకర్యవంతమైన ప్రయాణం లభించనుంది. టీఎంసీ ఈ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది.
ప్రముఖ అధ్యాత్మిక నగరమైన తిరుపతిలో డబుల్ డెక్కర్ ఈ-బస్సులు సేవలు అందించనున్నాయి. దీంతో ఈ బస్సుల సేవలు పొందుతున్న సిటీగా తిరుపతి రికార్డు నెలకొల్పనుంది. అలాగే దక్షిణ భారతదేశంలో రెండో సిటీగా (మొదటిది హైదరాబాద్) నిలవనుంది. తిరుపతి నగరంలో అతి తక్కువ కాలంలోనే 20కి పైగా మాస్టర్ ప్లాన్ రోడ్లను ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాల రూపురేఖలను మార్చిన తిరుపతి నగరపాలక సంస్థ (టీఎంసీ) ఇప్పుడు అంతర్గత ప్రజారవాణా కోసం సొంతంగా ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
ప్రచార హోరు.. కేటీఆర్ కు కామారెడ్డి.. హరీశ్ రావుకు గజ్వేల్.. సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు
టీఎంసీ ఏర్పాటు చేసిన తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ సుమారు రూ.550 కోట్లు వెచ్చించి శ్రీనివాస సేతు ఎలివేటెడ్ ఎక్స్ ప్రెస్ వే ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎలివేటెడ్ ఎక్స్ ప్రెస్ వే ను ఇటీవల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. అయితే దీని వల్ల అత్యుత్తమ అంతర్గత రహదారి మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి భక్తులతో పాటు ప్రజలను ఇబ్బందికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా తమ గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రపంచ స్థాయి ప్రజా రవాణా వ్యవస్థను నెలకొప్పడంపై టీఎంసీ ఇప్పుడు ఫోకస్ పెట్టింది.
మొబైల్ ఫోన్ కోసం గొడవ.. స్నేహితుడిని ఇటుకతో కొట్టిచంపిన మైనర్...
డబుల్ డెక్కర్ ఈ-బస్సు సేవలను ప్రారంభించడంపై ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడారు. తిరుపతి నగరంలో నాలుగు లక్షల జనాభా ఉందని, ప్రతిరోజూ లక్ష మందికి పైగా యాత్రికులు వస్తుంటారని తెలిపారు. అందుకే నగరంలో డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభిస్తున్నామని, దీని వల్ల సౌకర్యవంతమైన, సులభమైన ప్రయాణాలు అందరికీ అందుబాటు ధరలోకి వస్తుందని చెప్పారు. ప్రజా రవాణా కోసం ఇలాంటి బస్సులను ప్రవేశపెట్టిన మొదటి నగరంగా తిరుపతిని మార్చినందుకు టీఎంసీ గర్విస్తోందని అన్నారు. ఈ విషయంలో సీఎం విజన్ ను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు.
హోంవర్క్ సరిగా చేయలేదని చిన్నారిపై టీచరమ్మ కర్కషం.. వీపుపై వాతలు వచ్చేలా.. 35సార్లు..
కాగా.. టీఎంసీకి చెందిన డబుల్ డెక్కర్ బస్సులు నాలుగు వేర్వేరు రూట్లలో నడుస్తాయి. దేవాలయాలు, చౌరస్తాలతో సహా నగరంలో తప్పక సందర్శించవలసిన అన్ని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను కలపనున్నాయి. ఈ నెలాఖరులోగా ఒక ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు తిరుపతి రోడ్లపైకి రానుండగా, ట్రయల్ రన్ పూర్తయిన తర్వాత డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టాలని టీఎంసీ యోచిస్తోంది.