Asianet News TeluguAsianet News Telugu

ల‌ఖింపూర్ లో దారుణం.. చెట్టుకు వేలాడుతూ ఇద్ద‌రు ద‌ళిత అక్కాచెళ్లెల్ల మృతదేహాలు

ఇద్దరు దళిత మైనర్ సోదరీమణులను ముగ్గురు యువకులు కిడ్నాప్ చేశారు. కొంత సమయం తరువాత వారి మృతదేహాలు గ్రామంలోని ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో జరిగింది. 


 
The dead bodies of two minor Dalit sisters found hanging from a tree in Lakhimpur.
Author
First Published Sep 15, 2022, 8:59 AM IST

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో దారుణం జ‌రిగింది. నిఘాసన్ ప్రాంతంలో ఇద్దరు మైనర్ సోదరీమణుల మృతదేహాలు బుధవారం అనుమానాస్పద స్థితిలో చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం సృష్టించింది. అయితే ముగ్గురు వ్య‌క్తులు త‌మ పిల్ల‌ల‌ను కిడ్నాప్ చేసి హత్య చేశారని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. 

ప్ర‌శాంత జీవితాన్ని గ‌డ‌పాల‌నుకున్నా.. ద‌య‌చేసి బెయిల్ ఇవ్వండి

బాధితుల తల్లి తెలిపిన వివరాల ప్ర‌కారం వివ‌రాలు ఇలా ఉన్నాయి. బుధవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 15, 17 ఏళ్ల వయసున్న తోబుట్టువులు త‌న త‌ల్లితో క‌లిసి ఇంటి బ‌య‌ట కూర్చొని ఉన్నారు. కొంత స‌మ‌యం త‌రువాత త‌ల్లి ఇంట్లోకి వెళ్లింది. దీంతో ఓ ముగ్గురు యువ‌కులు బైక్ పై అక్క‌డికి చేరుకున్నారు. అందులో ఇద్ద‌రు యువ‌కులు త‌మ కూతుళ్లను లాగి బైక్ పై కూర్చొబెట్టి ఇద్ద‌రితో క‌లిసి క‌లిసి అక్క‌డి నుంచి పారిపోయారు. 

ఆ తర్వా త బాలికల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. ముగ్గురు యువకులు లాల్పూర్ గ్రామానికి చెందిన వారని మృతుల తల్లి చెబుతోంది. నిందితులు కూడా దళితులేనని చెప్పారు. ‘‘ నేను స్నానం చేయడానికి లోపలికి వెళ్లారు. అదే సమయంలో ముగ్గురు నిందితులు మోటర్ బైక్‌పై వచ్చారు. వారు పసుపు, తెలుపు, నీలం రంగు టీషర్టులు ధరించారు. ఇద్దరు నిందితులు నా కుమార్తెలను ఎత్తుకెళ్లి బైక్‌పై కూర్చోబెట్టి పారిపోయారు ’’ అని బాధితుల తల్లి చెప్పినట్టు ‘హిందుస్థాన్ టైమ్స్’ పేర్కొంది.

విమాన సిబ్బందికి డీజీసీఎ కీల‌క ఉత్త‌ర్వులు .. విధుల్లో చేరాలంటే.. ఆ ప‌రీక్ష త‌ప్ప‌నిస‌రి..

కిడ్నాప్ జ‌రిగిన అనంత‌రం కుటుంబ సభ్యులు బాలికల కోసం గాలింపు చేపట్టారు. కానీ ఎక్క‌డా వారి ఆచూకీ ల‌భించ‌లేదు. మ‌రి కొంత స‌మ‌యం త‌రువాత రెండు మృత‌దేహాలు స్థానికంగా ఒ చెట్టుకు వేలాడుతూ ఉన్నాయ‌ని గ్రామ‌స్తులు గుర్తించారు. పోలీసులు అక్క‌డికి చేరుకొని విచార‌ణ చేప‌ట్టారు. అయితే ఇది ఆరేళ్ల కింద‌ట జ‌రిగిన బ‌దౌన్ ఘ‌ట‌న‌ను గుర్తు చేస్తోంది.

అల్ల‌ర్లు సృష్టించేందుకు ఇత‌ర రాష్ట్రాల నుంచి గూండాలు.. బీజేపీ పై మ‌మ‌తా ఫైర్

2014లోయూపీలోని బదౌన్ జిల్లా కత్రా సదత్గంజ్ గ్రామంలో 12, 14 ఏళ్ల వయసున్న ఇద్దరు దళిత బంధువుల మృతదేహాలు కూడా ఓ మామిడి చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. మే 27వ తేదీ రాత్రి, ఆమె బహిర్ముకానికి పొలం వైపు వెళుతుండగా ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసి మృతదేహాలను చెట్టుకు ఉరివేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన తర్వా త దేశ వ్యా ప్తం గా దుమారం రేగింది. దీనిపై కూడా పెద్ద ఎత్తున రాజ‌కీయ దుమారం రేగింది. ఓ వ‌ర్గానికి చెందిన అబ్బాయిలు మైనర్లపై  అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ కేసులో సీబీఐ విచారణ కూడా జ‌రిగింది. అయితే ఆ తర్వా త ఈ కేసు పరువు హత్య అని నివేదికలో తేలింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios