బెంగాల్ టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన మాజీ మంత్రి పార్థా ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ కోర్టు విచారణకు హజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా తాను ప్రశాంతమైన జీవితం గడపాలి అనుకుంటున్నని పార్థా చ‌ట‌ర్టీ  కోర్టుకు తెలిపారు.

బెంగాల్ టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ, అతని సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ బుధ‌వారం వర్చువల్ ప‌ద్ద‌తిలో కోర్టు విచారణకు హాజ‌ర‌య్యారు. టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన వీరిద్దరూ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

ఈ సంద‌ర్భంగా.. మంత్రి పార్థ ఛటర్జీ మాట్లాడుతూ.. " పబ్లిక్‌లో నా ఇమేజ్ గురించి చాలా ఆందోళన చెందుతున్నాను. నేను ఎకనామిక్స్ విద్యార్థిని. మంత్రి కాకముందు నేను ప్రతిపక్ష నాయకుడిని, నేను రాజకీయాల బాధితురాలిని. దయచేసి నా ఇల్లు, నా అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒకసారి సందర్శించవలసిందిగా ఈడీని ఆదేశించండి. నేను లా చదివాను. బ్రిటీష్ స్కాలర్‌షిప్ కూడా పొందాను. నా కూతురు యూకేలో చదువుతోంది. అలాంటి జీవితాన్ని గ‌డుతున్ననేను ఇలాంటి స్కామ్‌లో ఎలా ఇన్వాల్వ్ కాగ‌ల‌ను? అని కోర్టుకు తెలిపారు. న్యాయం కంటే ముందే నాకు వైద్యం అందించండి, నేను ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నాను. దయచేసి నా జీవితాన్ని గడపడానికి నన్ను అనుమతించండి. ఎలాంటి షరతులోనైనా నాకు బెయిల్ ఇప్పించండి’’ అని ఛటర్జీ కోర్టును కోరారు.

అనంత‌రం ఛటర్జీ త‌రుఫు న్యాయ‌వాది మాట్లాడుతూ.. “నా క్లయింట్ దర్యాప్తు సంస్థకు సహకరిస్తున్నాడు. భవిష్యత్తులో కూడా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. దయచేసి అతనికి ఎలాంటి షరతుతోనైనా బెయిల్ మంజూరు చేయండి' అని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

ఛటర్జీ తర్వాత, అతని సహచరురాలు అర్పితను న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈ సంద‌ర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఇంత పెద్ద కుంభ‌కోణం ఎలా జ‌రిగిందో నాకు తెలియదు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నా ఇంటి నుంచి ఇంత పెద్ద మొత్తంలో డబ్బును ఎలా? ఎక్కడి నుంచి రికవరీ చేసిందో? నాకు నిజంగా తెలియదు” అని ముఖర్జీ కోర్టుకు తెలిపారు.

అనంత‌రం అర్పితను న్యాయ‌మూర్తి ప్ర‌శ్నించారు. ఆ డబ్బు ఎక్కడ దొరికిందో తెలుసా అని ప్రశ్నించారు. అంతుకు ఆమె స‌మాధానమిస్తూ.. "నా నివాసంలో అని తెలిపింది. "మీరు ఆ ఇంటికి యజమానివా ?" అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. అర్పిత సానుకూలంగా స్పందించింది. అయితే, చట్టం ప్రకారం.. మీరు జవాబుదారీగా ఉంటారు" అని న్యాయమూర్తి చెప్పారు.

అనంత‌రం అర్పిత మాట్లాడుతూ.. “కానీ రికవరీ చేసిన డబ్బు గురించి నాకు తెలియదు. నేను మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడిని. నాన్న లేరు. నా 82 ఏళ్ల తల్లికి ఆరోగ్యం బాగాలేదు. నేను సాధారణ కుటుంబానికి చెందినవాడిని. నా ఇంటిపై ED ఎలా దాడి చేస్తుంది? అని అన్నారు. 

అనంతరం న్యాయ‌మూర్తి మాట్లాడుతూ.. “తమ దర్యాప్తులో అవసరమైతే ED ఎవ‌రి ఇంటిపైనా దాడి చేయవచ్చు.వారికి అధికారం ఉంది’’ అని అన్నారు. అన్ని పక్షాల వాదనలను విన్న న్యాయస్థానం పార్థ ఛటర్జీ, అర్పితా ముఖర్జీ ఇద్దరి జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించింది. సెప్టెంబర్ 28న మ‌రోసారి ఇద్దరినీ కోర్టు ముందు హాజరు పరచనున్నారు.

కేసు ఏంటీ? 

కోల్‌కతాలోని అర్పితా ముఖర్జీ ఇళ్ల నుంచి జులైలో ఈడీ భారీగా నగదును స్వాధీనం చేసుకుంది. కౌంటింగ్ మెషీన్లతో ఆర్థిక దర్యాప్తు సంస్థ అర్పిత ఇళ్లలో దాదాపు 50 కోట్ల నగదు, బంగారం, ఆభరణాలను స్వాధీనం చేసుకుంది. బెంగాల్ టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కామ్‌తో పార్థ ఛటర్జీని కనెక్ట్ చేసినట్లు వారు పేర్కొన్న నేరారోపణ పత్రాలను కూడా ఏజెన్సీ కనుగొంది.

దీంతో తృణమూల్ కాంగ్రెస్ .. ఛటర్జీని మొదట మంత్రి పదవి నుంచి తప్పించి, ఆ తర్వాత పార్టీ పదవులన్నింటినీ తొలగించారు. ఆరోపణలు రుజువైతే తమ‌ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు.