రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధం అన్ని దేశాలపై ప్రభావం చూపిందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ఈ యుద్ధం వల్ల ఇప్పటికే ధరలు పెరిగాయని తెలిపారు. మరి కొంత కాలం తరువాత ఆకలి సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంధనం, ఆహారం, ఎరువుల సంక్షోభానికి దారితీసిందని..ఇది ఇలాగే కొన‌సాగితే ఆకలి సంక్షోభానికి కూడా దారితీస్తుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంక‌ర్ అన్నారు. ధ‌ర‌లు పెరుగుతాయ‌ని చెప్పారు. ‘‘ ఉక్రెయిన్‌ పరిస్థితి పలు పర్యావసానాలను తీసుకొచ్చింది. మనం వాటిని మూడు ‘F’ సంక్షోభంగా పిలుస్తాము. ఇవి ఇంధనం, ఆహారం, ఎరువులు. ఈ మూడింటి ధరలు పెరిగాయి. అవి చాలా గణనీయమైన ద్రవ్యోల్బణ ప్రభావాన్ని కలిగి ఉన్నాయి ’’ అని ఆయ‌న అన్నారు. కేంద్రంలో న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంటున్న సంద‌ర్భంగా జాతీయ భద్రతపై జరిగిన ప్రసంగంలో జై శంక‌ర్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. 

నూపుర్ శ‌ర్మ వ్యాఖ్య‌ల‌పై హౌరాలో ఆందోళ‌న.. మ‌మ‌తా బెన‌ర్జీ ఆగ్ర‌హం.. ఢిల్లీకెళ్లాల‌ని సూచ‌న‌

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ (NIAS), ఇంటర్నేషనల్ స్టడీస్ నెట్‌వర్క్ బెంగళూరు (ISNB)తో కలిసి క‌ర్ణాట‌క రాజ‌ధానిలో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా జై శంక‌ర్ మాట్లాడుతూ.. ‘‘ యుద్ద వాతావరణ ఆహారం విషయంలో గమనిస్తే ఆకలి పరిస్థితులకు దారి తీస్తాయి. ఎరువుల ధరలు కూడా పెరుగుతాయి. దీని ప్రభావం చాలా ఉంటుంది. ’’ అని తెలిపారు. గత రెండేళ్లలో దేశం నాలుగు ప్రధాన సవాళ్లను ఎదుర్కొందని జై శంకర్ గుర్తు చేశారు. అవి కోవిడ్-19, వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో ఉద్రిక్తత, ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి. ఉక్రెయిన్ యుద్ధం అని తెలిపారు. ఈ నాలుగు ప్రధాన సంఘటనలు ఒక దేశం శ్రేయస్సుపై ధీర్ఘ కాలంలో ప్రత్యక్ష ప్రభావాన్ని ఎలా కలిగి ఉందో చూపించాయని తెలిపారు. 

ఇక చైనా విష‌యంలో మంత్రి మాట్లాడుతూ.. ఉత్తర సెక్టార్ లోని లడఖ్ వాస్తవాధీన రేఖ వద్ద యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చడానికి పొరుగు దేశం ప్రయత్నించిందని అన్నారు. వాస్తవాధీన రేఖను ఏకపక్షంగా మార్చేందుకు అనుమతించబోమని, త‌మ‌కున్న అవగాహనలను ఉల్లంఘించేలా మార్చడానికి తాము అనుమతించబోమని తాము మళ్ళీ చాలా స్పష్టంగా చెబుతున్నామ‌ని అన్నారు. 

Presidential Election : రాష్ట్రపతి అభ్యర్థి కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు.. ప్రతిపక్ష నేతలతో చర్చలు ప్రారంభం

1962 యుద్ధం తరువాత సైనిక మోహరింపు బహుశా అతిపెద్దదని జై శంక‌ర్ అన్నారు. లాజిస్టిక్స్ సరఫరా కోసం ఆ ప్రాంతంలో చేసిన మౌలిక సదుపాయాల పురోగతి కారణంగా దళాలు రెండు శీతాకాలాలను తట్టుకోగలిగాయ‌ని తెలిపారు. ఇక పాకిస్తాన్ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. సీమాంతర ఉగ్రవాదం ఒత్తిడి వల్ల మనం టేబుల్ పైకి టేబుల్‌పైకి తీసుకురాలేమనే స్పష్టతను (ఎనిమిదేళ్లలో) చూశామని జైశంకర్ అన్నారు. ‘‘ మోడీ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో సాధించిన మరో ముఖ్యమైన విజయం బంగ్లాదేశ్ తో భూ సరిహద్దు ఒప్పందం. ఇది భారతదేశం-బంగ్లాదేశ్ సంబంధాలపై అపారమైన ప్రభావాన్ని చూపింది.’’ అని పేర్కొన్నారు. ఈ ఒప్పందం బంగ్లాదేశ్ కు, భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలకు భారీ అవకాశాలను తెచ్చిందని జై శంకర్ అన్నారు. 

మయన్మార్ విషయాన్ని ప్రస్తావిస్తూ.. భారత తిరుగుబాటు గ్రూపులు ఎదగడం కష్టతరం చేయడానికి అక్కడ పాలనను నిమగ్నం చేసే విదేశాంగ విధానం దేశంలో ఉందని అన్నారు. ఫలితంగా ఈశాన్య ప్రాంతంలో శాంతి నెలకొందని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వ సమగ్ర దృక్పథం కారణంగానే దేశం ఈ సవాళ్లను ఎదుర్కోగలిగిందని ఆయన అన్నారు. డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, బాలికల విద్యపై దృష్టి సారించడం వంటి అనేక కార్యక్రమాల ద్వారా దేశ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నించిందని ఆయన తెలిపారు.