Asianet News TeluguAsianet News Telugu

హైవేపై చెడిపోయిన బస్సు.. కాన్వాయ్ నుంచి దిగి నెట్టిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. వీడియో వైరల్

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.తన సింప్లిసిటీని ప్రదర్శించారు. తన కాన్వాయ్ లో హైవేపై ప్రయాణిస్తున్న సమయంలో ఆ రోడ్డుపై ఓ బస్సు చెడిపోయింది. దీంతో అక్కడికి చేరుకున్న కేంద్ర మంత్రి ఏం జరిగిందని ఆరా తీశారు. స్థానికులతో కలిసి బస్సు నెట్టి స్టార్ట్ అయ్యేలా చేశారు. 

The bus broke down on the highway. Union Minister Anurag Thakur pushed down from the convoy.. Video goes viral
Author
First Published Nov 9, 2022, 3:04 AM IST

హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో హైవే మధ్యలో చెడిపోయిన బస్సును కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ నెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బ్రేక్ డౌన్ అయిన బస్సు ట్రాఫిక్ జామ్‌కు కారణమైంది. దీంతో ఠాకూర్ కాన్వాయ్ కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుంది. ఈ ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి బస్సును నెట్టుతున్న స్థానికులకు కేంద్ర మంత్రి కూడా సాయం చేశారు. 

బ్రేకింగ్ న్యూస్.. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో బలమైన భూకంపం.. ఇళ్లలో నుంచి బయటకు వచ్చిన ప్రజలు

ఆ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లాలోని ఘుమర్వి, జందూతా, సదర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ర్యాలీలలో ప్రసంగించి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. హైవేపై ట్రాఫిక్ లో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఠాకూర్ కాన్వాయ్‌ కూడా ఇరుక్కుపోయింది. అక్కడి పరిస్థితిని గమనించిన ఆయన.. బస్సు అక్కడి నుంచి బయలుదేరితేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావించారు. దీంతో అక్కడ ఉన్న ప్రజలతో కలిసి బస్సును తోశారు.

అలాగే డ్రైవర్‌ను, ప్రయాణికులను వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బస్సు మళ్లీ కదలడం ప్రారంభించిన తరువాత ఠాకూర్ తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించారు. కాగా.. మంగళవారం మూడు ఎన్నికల ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించిన కేంద్ర మంత్రి.. హిమాచల్ ప్రదేశ్‌లో రాబోయే బీజేపీ ప్రభుత్వం ఐదేళ్లలో రాష్ట్రంలోని ప్రతీ గ్రామాన్ని మెటల్ రోడ్లతో కలుపుతుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని తీర్థయాత్ర కేంద్రాలు, దేవాలయాల సమీపంలో రవాణా, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు వచ్చే పదేళ్లలో రూ.12,000 కోట్లు ఖర్చు చేస్తుందని అన్నారు. 

సుదూర ప్రాంతాల ప్రజలకు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మొబైల్ క్లినిక్ వ్యాన్‌ల సంఖ్యను రెట్టింపు చేయనున్నట్లు ఆయన తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు వస్తాయని, పేద మహిళలకు వివాహ సమయంలో రూ.51,000 అందజేస్తామని ఠాకూర్ చెప్పారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు సైకిళ్లు ఇస్తామని, కాలేజీకి వెళ్లే విద్యార్థులకు స్కూటీ ఇస్తామని ఠాకూర్ చెప్పారు.

గుజరాత్ లో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ.. బీజేపీలో చేరిన 11 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మోహన్ సింగ్ రథ్వా

హిమాచల్‌లోని ‘డబుల్ ఇంజన్’ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో 12,000 కిలోమీటర్ల పొడవైన గ్రామీణ రహదారుల నిర్మించిందని, అత్యాధునిక వందే భారత్ రైలును రాష్ట్రం నుంచి ఢిల్లీకి అనుసంధానించిందని తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై ఆయన విమర్శలు చేశారు. బిలాస్‌పూర్ జిల్లాలో అభివృద్ధి ప్రాజెక్టులను ఆ పార్టీ ఆపేస్తోందని ఆరోపించారు. 

కర్ణాటకలో మత ఘర్షణ.. శృంగేరిలో మసీదు ఎదుట వెలిసిన కాషాయ జెండాలే కారణం..

‘‘రూ.1,470 కోట్లతో ఎయిమ్స్‌ ప్రాజెక్టును మంజూరు చేశాం. కానీ అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం భూములు కేటాయించలేదు. 2010లో రాష్ట్రంలోని అప్పటి బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ప్రతిపాదించింది. అయితే కాంగ్రెస్‌ అడ్డంకులు సృష్టించింది.’’ అని ఠాకూర్ తెలిపినట్టు వార్తా సంస్థ ‘పీటీఐ’ నివేదించింది. ఇదిలా ఉండగా.. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 12న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టి, అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios