Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్ లో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ.. బీజేపీలో చేరిన 11 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మోహన్ సింగ్ రథ్వా

గుజరాత్ లో కాంగ్రెస్ తరఫున 11 సార్లు ఎమ్మెల్యే విజయం సాధించిన సీనియర్ నాయకుడు మోహన్ సింగ్ రథ్వా పార్టీకి రాజీనామా చేశారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. 

A setback for Congress in Gujarat. Mohan Singh, who was elected MLA 11 times after leaving the party and joining BJP
Author
First Published Nov 9, 2022, 1:20 AM IST

గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు ప్రచారం జోరుగా సాగిస్తున్నాయి. దీంతో పాటు నేతల వలసల పర్వం కూడా అదే జోరుతో సాగుతోంది. ఈ రోజు ఒక పార్టీలో ఉన్న నాయకులు తెల్లారి మరో పార్టీలో కనిపిస్తున్నారు. రెండు ప్రధాన పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీల్లోనూ ఇది కనిపిస్తోంది. తాజాగా కాంగ్రెస్ కు చెందిన ఓ సీనియర్ నాయకుడు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. 

గుజరాత్ లో ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుతం తరుణంలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛోటా ఉదయ్‌పూర్ నుంచి 11 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మోహన్ సింగ్ రథ్వా పార్టీని వీడారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు.

కర్ణాటకలో మత ఘర్షణ.. శృంగేరిలో మసీదు ఎదుట వెలిసిన కాషాయ జెండాలే కారణం..

పలు మీడియా సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం.. రథ్వా గత కొన్ని రోజులుగా పార్టీపై ఆగ్రహంగా ఉన్నారు. దీంతో మే నెలలో జరిగే ఎన్నికల్లో పోటీ చేయడం లేదనే చర్చ సాగింది. తనకు వయస్సు మీద పడిందని, కొంతకాలంగా రాజకీయాల్లో చురుగ్గా ఉన్న తన కుమారుడు రాజేంద్ర సింగ్ రథ్వాకు టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ ను కోరారు. అయితే దీనికి అధిష్టానం నిరాకరించినట్టు తెలుస్తోంది. దీంతోనే ఆయన బీజేపీలో చేరారని టాక్ నడుస్తోంది.

ఇటీవల మోహన్ సింగ్ రథ్వా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను గత 55 సంవత్సరాలుగా నిరంతరం శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పారు. ఇప్పుడు గుజరాత్‌లో కొత్త ముఖాలు, ముఖ్యంగా యువత రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నానని వెల్లడించారు. అయితే ఆయన వ్యాఖ్యలతో తన కుమారుడికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారని అర్థం అయ్యింది. కానీ అదే స్థానం నుంచి ఈ సారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ నరన్ రథ్వా కుమారుడు కూడా ప్రయత్నిస్తున్నారు.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని మహిళ మృతి.. గుజరాత్‌లోని ఆనంద్‌లో ఘటన

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో టికెట్ రాదని తన కుమారుడికి టికెట్ రాదని భావించిన మోహన్ సింగ్ రథ్వా కాంగ్రెస్ పార్టీని వీడారు. కాగా. మరో సీనియర్ నేత హిమాన్షు వ్యాస్ కూడా శనివారం బీజేపీలో చేరారు. ఆయన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించారు. ఈ చేరిక సందర్భంగా హిమాన్షు మాట్లాడుతూ.. పార్టీ కోసం పని చేసే వారిని నాయకులు విస్మరించారని ఆరోపించారు. తాను కాంగ్రెస్ కు రాజీనామా చేయడానికి ఆ పార్టీ నాయకత్వమే కారణమని అన్నారు. కాంగ్రెస్ నాయకత్వం ప్రజలతో, పార్టీ కార్యకర్తలతో సంభాషించడంలో కూడా విఫలమైందని హిమాన్షు వ్యాస్ అన్నారు. నిజమైన కార్యకర్తలను నాయకత్వానికి చేరుకోవడానికి కూడా అనుమతి లభించడం లేదని అన్నారు.  కాగా.. ఆయన రాష్ట్రంలోని సురేంద్రనగర్ జిల్లాలోని వాధ్వన్ అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.

రిజ‌ర్వేష‌న్ల‌పై 50 శాతం ప‌రిమితి తొలగించండి: బీహార్ సీఎం డిమాండ్

గుజరాత్ లో వరుసగా ఆరుసార్లు బీజేపీ చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ ఈ సారి ఎలాగైనా పార్టీని అధికారంలోకి రావాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తోంది.  2017 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 182 సీట్లలో 77 సీట్లు గెలుచుకుని బీజేపీకి గట్టి పోటీ ఇచ్చింది. ఈ సారి సగం కన్నా ఎక్కువ సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అయితే ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతలు వెళ్లిపోవడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది.

Follow Us:
Download App:
  • android
  • ios