Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటకలో మత ఘర్షణ.. శృంగేరిలో మసీదు ఎదుట వెలిసిన కాషాయ జెండాలే కారణం..

కర్ణాటకలో చిక్కమగళూరు జిల్లా శృంగేరి మసీదు ఎదుట కాషాయ జెండాలు కట్టడం మత ఘర్షణకు దారి తీసింది. దీంతో పోలీసులకు అక్కడికి చేరుకొని ఇద్దరిపై కేసు నమోదు చేశారు. 

Saffron flag hoisted in front of mosque in Sringeri, Karnataka sparks communal clash
Author
First Published Nov 9, 2022, 12:13 AM IST

కర్ణాటక రాష్ట్రంలో మంగళవారం రాత్రి మత ఘర్షణ చోటు చేసుకుంది. చిక్కమగళూరు జిల్లా శృంగేరిలో ఉన్న మసీదు ఎదుట కాషాయ జెండాలు కట్టడం వల్ల శ్రీరామ్‌సేన సభ్యులకు, కాంగ్రెస్‌కు చెందిన మసీదు కమిటీ సభ్యుడు రఫీక్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని మహిళ మృతి.. గుజరాత్‌లోని ఆనంద్‌లో ఘటన

బాబాబుడన్‌గిరి యాత్రలో భాగంగా శ్రీరామ్‌సేన సభ్యులు జెండాలు కట్టారని మసీదు కమిటీ సభ్యుడు ఆరోపించారు. దీనిపైనే ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాల మధ్య శాంతి సమావేశానికి పిలుపునిచ్చారు.

ఈ ఘటర్షణకు కారణమైన ఇద్దరు నిందితులు రఫీక్, అర్జున్‌లపై పోలీసులు అభియోగాలు మోపారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆ ప్రాంతంలో శాంతి చేకూర్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios