Asianet News TeluguAsianet News Telugu

దీపావళి కోసం సెలవుపై వచ్చిన ఆర్మీ జవాన్ దారుణ హత్య.. ఎక్కడంటే?

కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి సంతోషంగా పండగ జరుపుకుందామని వచ్చిన ఆ ఆర్మీ దారుణ హత్యకు గురయ్యారు. కారును అడ్డగించి ఓ ఎనిమిది మంది వ్యక్తులు జవాన్ ను కాల్చి చంపారు. 

The brutal murder of an army jawan who came on leave for Diwali.. Where?
Author
First Published Oct 26, 2022, 1:36 PM IST

దీపావళి పండగను జరుపుకోవడానికి ఇంటికి వచ్చిన ఆర్మీ జవాన్ ను కాల్చి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ లో వెలుగులోకి వచ్చింది. ప్రియురాలి భర్త, మరి కొందరు వ్యక్తులతో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.

బిహార్‌లో ఘోర ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. 53 వ్యాగన్లు బోల్తా..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలీగడ్ లోని తప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రసూల్‌పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. మృతుడు బికాన్ కుమార్ (24) పంజాబ్ లో ఆర్మీ జవానుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల పండగ కోసం అని సెలువులు పెట్టి స్వగ్రామానికి చేరుకున్నారు. ఆదివారం రాత్రి తన మామతో కలిసి కారులో అలీఘఢ్ కు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎనిమిది మంది వ్యక్తులు కారును అడ్డగించారు. కర్రలు, పదునైన వస్తువులతో దాడి చేశారు. ఆపై జవాన్ ను కాల్చి చంపారు.

ఎయిర్ పోర్టుకు లేట్ గా తీసుకెళ్లినందుకు ఫ్లైట్ మిస్.. ఉబర్ కు 20 వేల ఫైన్.. ఎక్కడంటే ?

ఈ ఘటనపై బీకాన్ కుమార్ తండ్రి జంతా సింగ్ మాట్లాడుతూ.. “ నా కుమారుడికి, నిందితులలో ఒకరి భార్యకు మధ్య సంబంధం ఉంది. ఆమె భర్త విజయపాల్, ఆమె సోదరుడు బబ్లూ, వారి కుటుంబానికి చెందిన మరో ఆరుగురు కలిసి నా కుమారుడిని హత్య చేశారు ’’ అని ఆయన ఆరోపించారు.

కాంగ్రెస్ సిద్దాంతాలను ముందుకు తీసుకెళ్లడమే నా లక్ష్యం:మల్లికార్జున ఖర్గే

ఈ దారుణ హత్యపై తప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదైంది. ఇప్పటి వరకు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని, విజయ్‌పాల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పి) కళానిధి నైతాని మాట్లాడుతూ.. విజయ్‌పాల్ భార్యతో అక్రమసంబంధం కారణంగానే జవాను హత్యకు గురయ్యాడని తెలిపారు. ఎనిమిది మందిపై కేసు నమోదు చేయగా, అందులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. బీకాన్ కుమార్ 2017లో ఇండియన్ ఆర్మీకి ఎంపికై హోషియార్‌పూర్‌లో విధులు నిర్వహిస్తున్నట్లు మృతుడి సోదరుడు ప్రేమ్‌వీర్ సింగ్ తెలిపారు. మామతో పాటు మరికొందరితో కలిసి ఆయన కారులో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు కొందరు గ్రామస్తులు ఆయన కారుపై దాడి చేసి తలపై కాల్చారని చెప్పారు. ఆయనను హాస్పిటల్ కు తీసుకెళ్లామని, కానీ అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios