Asianet News TeluguAsianet News Telugu

ఎయిర్ పోర్టుకు లేట్ గా తీసుకెళ్లినందుకు ఫ్లైట్ మిస్.. ఉబర్ కు 20 వేల ఫైన్.. ఎక్కడంటే ?

ఉబర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళా ప్రయాణికురాలు తన విమానాన్ని అందుకోలేకపోయారు. దీంతో ఆమె వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ఫోరం తప్పు ఉబర్ సంస్థదే అని నిర్ధారించింది. ఆ సంస్థకు ఫైన్ విధించింది. 

Missed the flight for being taken to the airport late.. 20 thousand fine to Uber.. Where?
Author
First Published Oct 26, 2022, 12:48 PM IST

ఎయిర్ పోర్టుకు లేట్ గా తీసుకెళ్లినందుకు మహిళా ప్రయాణీకురాలికి రూ.20,000 జరిమానా చెల్లించాలని మహారాష్ట్రలోని ముంబాయి జిల్లా వినియోగదారుల కోర్టు ఉబర్ ఇండియాను ఆదేశించింది. సేవల్లో లోపానికి ఆ సంస్థను దోషిగా నిర్ధారించిన కోర్టు.. ప్రయాణికురాలి మానసిక వేధనకు రూ. 10,000, ఆమెకు అధనంగా అయిన ఖర్చుకు రూ. 10,000 చెల్లించాలని పేర్కొంది. 

కాంగ్రెస్ సిద్దాంతాలను ముందుకు తీసుకెళ్లడమే నా లక్ష్యం:మల్లికార్జున ఖర్గే

వివరాలు ఇలా ఉన్నాయి. కవితా శర్మ అనే న్యాయవాది 2018 జూన్ 12న సాయంత్రం ముంబై విమానాశ్రయం నుంచి చెన్నైకి విమానంలో వెళ్లాల్సి ఉంది. ఆమె తన నివాసానికి 36 కి.మీ దూరంలో ఉన్న విమానాశ్రయానికి వెళ్లేందుకు మధ్యా హ్నం 3.29 గంటలకు ఉబర్ క్యాబ్ ను బుక్ చేసుకున్నారు. దీంతో ఆ కారు 14 నిమిషాల తరువాత ఆమె నివాసం దగ్గరకు వచ్చింది.

అయితే అక్కడి నుంచి కారు తీసే ముందు డ్రైవర్ ఫోన్ మాట్లాడుతున్నాడు. కవితా శర్మ ఎన్ని సార్లు చెప్పినా వినకుండా ఫోన్ లో బిజీగా ఉన్నారు. కాల్ కట్ అయిన తరువాత మాత్రమే అక్కడి నుంచి ప్రయాణం మొదలైంది. తరువాత కు డ్రైవర్ సీఎన్జీ స్టేషన్ కు రాంగ్ టర్న్ తీసుకొని 15-20 నిమిషాలు వృథా చేశాడు. చివరికి ఎయిర్ పోర్టుకు చేరుకునే సరికి సాయంత్రం 5.23 గంటలు అయ్యింది. దీంతో ఆమె ఫ్లైట్ మిస్ అయ్యింది. మళ్లీ ఆమె తన సొంత ఖర్చుతో మరో విమానంలో ప్రయాణించాల్సి వచ్చింది.

క‌ర్నాట‌క శివమొగ్గలో టెన్ష‌న్ టెన్ష‌న్.. భారీగా పోలీసుల మోహరింపు

క్యాబ్ బుక్ చేసిన సమయంలో అంచనా రూ.563 అవుతుందని ఉబర్ పేర్కొంది. కానీ ఎయిర్ పోర్టులో దిగిన తరువాత రూ. 703 అని చూపించింది. దీంతో అడిగినంత మొత్తాన్ని ఆమె డ్రైవర్ చెల్లించింది. డ్రైవర్ నిర్లక్ష్యం, అనైతిక ప్రవర్తన కారణంగా ఆమె తన విమానాన్ని కోల్పోయానని పేర్కొంటూ ట్విట్టర్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఉబర్ ఆమెకు రూ.139 రీఫండ్ చేసింది. 

కరెన్సీ నోట్లపై వినాయకుడి, లక్ష్మీ దేవి ఫొటోలను పెట్టాలి.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

ఉబర్ సంస్థ వేసిన అంచనా, వాస్తవ ఛార్జీల్లో తేడా.. అలాగే డ్రైవర్ ప్రవర్తన వల్ల తనకు జరిగిన అన్యాయాన్ని తెలుపుతూ ఆమె థానే అదనపు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ లో ఫిర్యాదు చేశారు. పలు దఫాల చర్చల తరువాత చివరికి ఉబర్ ఆ మహిళా ప్రయాణికురాలికి నష్టపరిహారం చెల్లించాలని తీర్పు వెలువరించింది. ప్రయాణికురాలు పడిన మానసిక వేదనకు రూ.10 వేలు , అలాగే ఆమె మరో  విమానంలో ప్రయాణించినందుకు అయిన ఖర్చుకు రూ.10 వేలు చెల్లించాలని ఆదేశించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios