Asianet News TeluguAsianet News Telugu

బిహార్‌లో ఘోర ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. 53 వ్యాగన్లు బోల్తా..

బిహార్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. బుధవారం ఉదయం ధన్‌బాద్ డివిజన్‌లోని కోడెర్మా, మన్‌పూర్ రైల్వే సెక్షన్‌ల మధ్య గుర్పా స్టేషన్‌లో బొగ్గుతో కూడిన గూడ్స్ రైలులోని 53 వ్యాగన్లు పట్టాలు తప్పాయి.

goods train derail in Bihar Gurpa
Author
First Published Oct 26, 2022, 12:55 PM IST

బిహార్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. బుధవారం ఉదయం ధన్‌బాద్ డివిజన్‌లోని కోడెర్మా, మన్‌పూర్ రైల్వే సెక్షన్‌ల మధ్య గుర్పా స్టేషన్‌లో బొగ్గుతో కూడిన గూడ్స్ రైలులోని 53 వ్యాగన్లు పట్టాలు తప్పాయి. బుధవారం ఉదయం 6.24 గంటలకు గూడ్స్ రైలు పట్టాలు తప్పిందని తూర్పు మధ్య రైల్వే తెలిపింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో  రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని పేర్కొంది.

ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టేందుకు బర్వాదిహ్, గయా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గోమో, ధన్‌బాద్ నుంచి యాక్సిడెంట్ రిలీఫ్ వెహికల్స్, సిబ్బంది, అధికారుల బృందం బయలుదేరారని వెల్లడించింది. ఇక, ఘటన స్థలంలో రైలు వ్యాగన్లు చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. ఇక, ఆ మార్గంలో పలు వెళ్లే పలు రైళ్లను దారి మళ్లించారు.

 

12381- హౌరా-న్యూ ఢిల్లీ ఎక్స్‌ప్రెస్, 13151- కోల్‌కతా-జమ్ముతావి ఎక్స్‌ప్రెస్, 12365- పాట్నా-రాంచీ ఎక్స్‌ప్రెస్, 12319- కోల్‌కతా - ఆగ్రా కాంట్ ఎక్స్‌ప్రెస్, 12260- బికనీర్ - సీల్దా ఎక్స్‌ప్రెస్, 12988- అజ్మీర్-సీల్దా ఎక్స్‌ప్రెస్, 12382- న్యూఢిల్లీ-హౌరా ఎక్స్‌ప్రెస్, 13152- జమ్ము తావి-కోల్‌కతా ఎక్స్‌ప్రెస్, 12444- ఆనంద్ విహార్ టెర్మినస్-హల్దియా ఎక్స్‌ప్రెస్, 12802- న్యూఢిల్లీ-పూరి ఎక్స్‌ప్రెస్‌లను దారి మళ్లీంచారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పిన దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే హెల్ప్‌లైన్ నంబర్లను కూడా జారీ చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios