ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ ఎంపీ ఏఆర్ చౌదరి లేఖ రాశారు. ప్రతిపక్ష పార్టీల అభిప్రాయాలకు ప్రభుత్వం తగినంత గౌరవం ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుత నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఢిల్లీ పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు.
ప్రతిపక్షాల అభిప్రాయాలకు కేంద్ర ప్రభుత్వం తగిన గౌరవం ఇవ్వడం లేదని కాంగ్రెస్ నేత, లోక్ సభ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో పార్టీ నేత రాహుల్ గాంధీని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఇటీవల చేసిన నిరసనలను లేఖలో ప్రస్తావించారు.
కరోనా కొత్త వేరియంట్ పై ‘ఇన్సాకాగ్’ ప్రత్యేక దృష్టి.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచనలు..
కాంగ్రెస్ చేస్తున్న ఆందోళన ఉద్దేశ్యాన్ని అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు మితిమీరిన, అసమంజసమైన శక్తులను ఆశ్రయిస్తున్నారని ఆయన అన్నారు. ‘‘ నేను చాలా బాధతో ఈ ఉత్తరం రాస్తున్నాను. ప్రతీకార రాజకీయాలకు వ్యతిరేకంగా మా స్వరాన్ని పెంచడానికి కాంగ్రెస్ పార్టీ శాంతియుత రాజకీయ ప్రదర్శనను నిర్వహిస్తోంది. కానీ ఆందోళన ఉద్దేశ్యాన్ని అడ్డుకోవడానికి ఢిల్లీ పోలీసులు మితిమీరిన, అసమంజసమైన శక్తులను ఆశ్రయిస్తున్నారు ’’ అని ఆయన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
‘ముందు కొట్టండి.. తర్వాతే ఆలోచించండి’ అనే విధానం సరికాదు.. కేంద్రంపై బీజేపీ ఎంపీ ఫైర్..
పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీల ప్రజా ప్రతినిధులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలను నిర్దాక్షిణ్యంగా కొట్టారని,
దీనివల్ల మన దేశ ప్రజాస్వామ్య నైతికతకు ప్రత్యక్ష అవమానం జరిగిందని లోక్ సభ ఎంపీ అన్నారు. ‘‘ప్రజాస్వామ్యం ప్రధాన సారాంశం అంటే వాక్ స్వాతంత్రం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. అయితే ఈ ప్రభుత్వం ప్రతిపక్షాల అభిప్రాయానికి తగిన గౌరవం ఇవ్వడం లేదు. భారతదేశంలో ప్రతిపక్షానికి స్థానం లేదు ’’ అని ఆయన అన్నారు.
అగ్నిపథ్ వెనక్కి తీసుకునే ఛాన్సే లేదు.. ఆందోళనలు మొత్తం యువత అభిప్రాయాలను వెల్లడించవు: బీజేపీ
నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తమ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు, ఎంపీలు దేశంలోని పలు రాష్ట్రాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు , ఆ పార్టీ నాయకులకు మధ్య తోపులాటలు జరిగాయి. నిరసన సమయంలో పలువురు నాయకులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఎంపీ ఏఆర్ చౌధురి కాంగ్రెస్ నాయకుడికి లేఖ రాశారు. కాగా రేపు (జూన్ 20) కాంగ్రెస్ నాయకుల ప్రతినిధి బృందం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసే అవకాశం ఉంది. తమ పార్టీ ప్రధాన కార్యాలయంలోకి ఢిల్లీ పోలీసుల ప్రవేశం, నిరసనల సమయంలో పార్టీ ఎంపీలతో పోలీసుల అనుచితంగా ప్రవర్తన అంశాలను ప్రస్తావిస్తూ ఒక మెమోరాండం సమర్పించనున్నారు.
