Asianet News TeluguAsianet News Telugu

ఉగ్రవాదాన్ని ఏ మతంతోనూ ముడిపెట్టకూడదు - కేంద్ర హోం మంత్రి అమిత్ షా

ఉగ్రవాదాన్ని ఏ మతంతోనూ ముడిపెట్టకూడదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఉగ్రవాదం ప్రపంచ శాంతి, భద్రతకు తీవ్రమైన ముప్పుగా మారిందని తెలిపారు. జాతీయ దర్యాప్తు సంస్థ నిర్వహించిన నో మనీ ఫర్ టెర్రర్ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. 

Terrorism should not be linked to any religion - Union Home Minister Amit Shah
Author
First Published Nov 18, 2022, 2:49 PM IST

ఉగ్రవాదం కంటే దానికి నిధులు సమకూర్చడం ప్రమాదకరమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. దీని ముప్పు ఏ మతం, జాతీయత, గ్రూపుతో ముడిపడి ఉండకూడదని అన్నారు. హింసకు పాల్పడేందుకు, యువతను సమూలంగా మార్చేందుకు, ఆర్థిక వనరులను పెంపొందించేందుకు ఉగ్రవాదులు నిరంతరం కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారని, రాడికల్ కంటెంట్‌ను వ్యాప్తి చేయడానికి, వారి గుర్తింపులను దాచడానికి డార్క్‌నెట్‌ను ఉపయోగిస్తున్నారని ఆయన అన్నారు.

బాలీవుడ్ చిత్రం 'స్పెషల్ 26' స్ఫూర్తి .. నకిలీ ఈడీ సమన్ల రాకెట్ గుట్టు రట్టు.. 9 మంది అరెస్ట్

ఎన్‌ఐఏ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘నో మనీ ఫర్ టెర్రర్’ సదస్సుకు కేంద్ర హోంమంత్రి హాజరై మాట్లాడారు. ఉగ్రవాదం నిస్సందేహంగా ప్రపంచ శాంతి, భద్రతకు అత్యంత తీవ్రమైన ముప్పు అని అన్నారు. కానీ తీవ్రవాదం కంటే దానికి ఆర్థిక సహాయం చేయడం చాలా ప్రమాదకరమని తెలిపారు. ఇలా చేయడం వల్ల ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు బలహీనం అవుతాయని చెప్పారు. 

తీవ్రవాదులు డార్క్‌నెట్‌ను ఉపయోగించి రాడికల్ కంటెంట్‌ను వ్యాప్తి చేయడానికి, వారి గుర్తింపులను దాచడానికి ఉపయోగిస్తున్నారని అన్నారు. క్రిప్టోకరెన్సీల వంటి వర్చువల్ ఆస్తుల వినియోగం కూడా పెరుగుతోందని తెలిపారు. డార్క్ నెట్‌లో జరుగుతున్న ఇలాంటి కార్యకలాపాల తీరును విశ్లేషించి, అర్థం చేసుకోవాలని కేంద్ర హోం మంత్రి అన్నారు. వాటికి పరిష్కారాలను కనుగొనాలని తెలిపారు. దురదృష్టవశాత్తు తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి చేస్తున్న సామూహిక సంకల్పాన్ని అణగదొక్కడానికి, నాశనం చేయడానికి కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు.

సహనాన్ని చేతగానితనం అనుకోవద్దు.. మా కార్యకర్తలు బరిలోకి దిగితే తట్టుకోలేరు.. బండి సంజయ్..

అలాగే కొన్ని దేశాలు ఉగ్రవాదులకు రక్షణ కల్పిస్తూ ఆశ్రయాన్ని అందిస్తున్నాయని చెప్పారు.  ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పించడం అంటే దానిని ప్రోత్సహించినట్లే అని చెప్పారు. అలాంటి దేశాలు చేస్తున్న ప్లాన్ లను విజయవంతం కాకుండా చూడటం అందరి సమిష్టి బాధ్యత అని అన్నారు.

2021 ఆగస్టు తర్వాత దక్షిణాసియా ప్రాంతంలో పరిస్థితిలో చాలా మార్పులు వచ్చాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పాలనలో మార్పు, ఐఎస్ఐఎస్, అల్ ఖైదాల ప్రభావం పెరగడం ప్రాంతీయ భద్రతకు పెద్ద సవాలుగా మారాయని చెప్పారు. కొత్త సమీకరణాలు టెర్రర్ ఫండింగ్ సమస్యను మరింత తీవ్రంగా మార్చాయని తెలిపారు. 

భీమా కోరేగావ్ కేసు.. మాజీ ప్రొఫెసర్ ఆనంద్ తెల్తుంబ్డేకు బెయిల్ మంజూరు చేసిన బొంబాయి హైకోర్టు

కాగా.. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఢిల్లీలో ‘నో మనీ ఫర్ టెర్రర్’ సదస్సును నిర్వహిస్తోంది. దీనిని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 72 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. అయితే ఇందులో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ పాల్గొనడం లేదు.

Follow Us:
Download App:
  • android
  • ios