Asianet News TeluguAsianet News Telugu

బాలీవుడ్ చిత్రం 'స్పెషల్ 26' స్ఫూర్తి .. నకిలీ ఈడీ సమన్ల రాకెట్ గుట్టు రట్టు.. 9 మంది అరెస్ట్

బాలీవుడ్ చిత్రం 'స్పెషల్ 26' నుంచి స్ఫూర్తి పొందిన ఓ ముఠా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నకిలీ నోటీసు పంపి నిప్పాన్ ఇండియా పెయింట్స్ లిమిటెడ్ చైర్మన్ హర్దేవ్ సింగ్ నుంచి రూ.20 కోట్లు దోపిడీ చేసేందుకు ప్రయత్నించింది. ఈ కేసులో 9 మంది నిందితులను అరెస్టు చేశారు. 

Inspired By Film Special 26 How A Delhi Gang Pulled Off 20 Crore Con
Author
First Published Nov 18, 2022, 2:19 PM IST

నకిలీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు ​​పంపి సుమారు ₹ 20 కోట్లు వసూలు చేసిన ముఠా గుట్టు రట్టు చేశారు ఢిల్లీ పోలీసులు. ఈ ముఠా నాయకుడితో సహా తొమ్మిది మంది వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితులు ప్రముఖ బాలీవుడ్ సినిమా 'స్పెషల్ 26'ని స్ఫూర్తిగా తీసుకుని ఈ మోసానికి పాల్పడుతున్నట్టు  తెలుస్తోంది.

వివరాల్లోకెళ్తే.. నిప్పాన్ ఇండియా పెయింట్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్ హర్దేవ్ సింగ్‌కు నిందితులు నకిలీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు పంపారు. అతని నుంచి రూ.20 కోట్లు దోపిడీ చేసేందుకు ప్రయత్నించింది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ విషయాన్ని బయటపెట్టారు. ఈ ముఠాలో పాల్గొన్న అస్సాం రైఫిల్స్ హెడ్ కానిస్టేబుల్ సహా తొమ్మిది మందిని అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

నిప్పాన్ ఇండియా పెయింట్స్ లిమిటెడ్ చైర్మన్ హర్దేవ్ సింగ్‌కు నిందితులు రెండు నకిలీ నోటీసులు పంపారని, ఫెడరల్ ఏజెన్సీ అతనిపై కేసు నమోదు చేసిందని మోసం చేశారని ఢిల్లీ స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రవీంద్ర సింగ్ యాదవ్ తెలిపారు. నిందితుడు హర్‌దేవ్ సింగ్‌కు ఫోన్ చేసి, తాను తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోతున్నానని, ఢిల్లీలోని ED కార్యాలయంలో సంప్రదించడం ద్వారా మొత్తం విషయాన్ని పరిష్కరించగలనని చెప్పాడు.దీని తర్వాత హర్దేవ్ సింగ్ స్పీడ్ పోస్ట్ ద్వారా ఇలాంటి నకిలీ నోటీసులు పొందారు. దీంతో 
అతడు భయాందోళనలకు గురయ్యాడు.  

మాస్టర్ మైండ్ సహా 9 మంది అరెస్ట్

ఫిర్యాదుల ఆధారంగా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు యాక్షన్ లోకి దిగింది. నకిలీ సమన్లు ​​ఇచ్చి బడా కంపెనీల యజమానుల నుంచి ఓ ముఠా డబ్బులు వసూలు చేస్తుందని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో అందిన ఫిర్యాదులు ఆధారంగా కేసు నమోదు చేశారు.  రంగంలోకి దిగిన పోలీసులు ఈ ముఠా మాస్టర్ మైండ్ సహా 9 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.

ఈ క్రమంలో ఈ ముఠా సూత్రధారి నుంచి ఢిల్లీ పోలీసులు 12 మొబైల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్ కాల్ వివరాలు , దాని నంబర్ ఆధారంగా ఇతర దుండగులను అరెస్టు చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్‌, కాజల్‌ అగర్వాల్‌ నటించిన 'స్పెషల్‌ 26' సినిమాని స్ఫూర్తిగా తీసుకుని ఈ ముఠా ఈ చర్యకు పాల్పడుతోందనీ,ముంబైలోని ఓ పెద్ద కంపెనీకి ఈడీ ఫేక్ నోటీసు కూడా పంపాడు.

Follow Us:
Download App:
  • android
  • ios