Asianet News TeluguAsianet News Telugu

భీమా కోరేగావ్ కేసు.. మాజీ ప్రొఫెసర్ ఆనంద్ తెల్తుంబ్డేకు బెయిల్ మంజూరు చేసిన బొంబాయి హైకోర్టు

భీమా కోరేగావ్ హింసాకాండ కేసులు నిందితుడిగా ఉన్న దళిత విద్యావేత్త, మాజీ ప్రొఫెసర్ కు బెయిల్ మంజూరు అయ్యింది. ఎన్ఐఏ కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆయన బొంబాయి కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

Bhima Koregaon case.. Bombay High Court grants bail to former professor Anand Telthumbde
Author
First Published Nov 18, 2022, 1:37 PM IST

భీమా కోరేగావ్ ఎల్గార్ పరిషత్ మావోయిస్ట్ లింక్ కేసులో ఐఐటీ మాజీ ప్రొఫెసర్, దళిత విద్యావేత్త, కార్యకర్త ఆనంద్ తెల్తుంబ్డేకు బాంబే హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తన బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు తిరస్కరించడాన్ని వ్యతిరేకిస్తూ తెల్తుంబ్డే గతేడాది హైకోర్టును ఆశ్రయించారు.

కర్నూలు బాబుకు చేదు అనుభవం.. రాయలసీమ ద్రోహి చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు...

డిసెంబర్ 31, 2017న పూణేలోని శనివార్వాడలో జరిగిన ఎల్గార్ పరిషత్ సమ్మేళనంలో ఆనంద్ తెల్తుంబ్డే ఉద్రేకపూరితంగా ప్రసంగించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కార్యక్రమం జరిగిన మరుసటి రోజు నగర శివార్లలో ఉన్న కోరేగావ్-భీమా యుద్ధ స్మారక చిహ్నం సమీపంలో హింస జరిగింది. ఈ ఘటనకు తెల్తుంబ్డే ప్రసంగం కూడా ఒక కారణమని పేర్కొంటూ ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ హింసాకాండలో ఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. డజనుకు పైగా కార్యకర్తలు, విద్యావేత్తలు నిందితులుగా పేర్కొన్న ఈ కేసును ముందుగా పూణే పోలీసులు విచారించారు. అనంతరం దీనిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) స్వాధీనం చేసుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios