Asianet News TeluguAsianet News Telugu

జ‌మ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో ఉగ్రదాడి.. పోలీసు మృతి, సీఆర్పీఎఫ్ జవానుకు గాయాలు

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో మరో సారి ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడిలో ఒక పోలీసు అమరుడయ్యారు. మరో జవానుకు గాయాలు అయ్యాయి. ప్రస్తుతం  ఆయన హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. 

Terror attack in Pulwama, Jammu and Kashmir.. Policeman killed, CRPF jawan injured
Author
First Published Oct 2, 2022, 4:44 PM IST

జమ్మూకాశ్మీర్ లో ఉగ్ర‌దాడి జ‌రిగింది. ఈ దాడిలో ఒక పోలీసు మృతి చెంద‌గా.. మ‌రో సీఆర్పీఎఫ్ జవానుకు గాయాలయ్యాయి. ఈ విష‌యాన్ని జ‌మ్మూ కాశ్మీర్ పోలీసులు ఆదివారం వెల్ల‌డించారు. దాడి స‌మాచారం తెలియ‌గానే ఆ ప్రాంతాన్ని భ‌ద్ర‌త బల‌గాలు చుట్టుముట్టాయి. మ‌రిన్ని బ‌ల‌గాలు అక్క‌డికి చేరుకుంటున్నాయి.

కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌కు ఈడీ సమన్లు.. మనీలాండరింగ్ కేసు విచారణకు హాజరవ్వాలని ఆదేశం

పుల్వామాలోని పింగ్లానా ప్రాంతంలో సీఆర్పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసుల సంయుక్త బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఒక పోలీసు అమరుడ‌య్యార‌ని, ఒక ఒక సీఆర్పీఎఫ్ జవాను గాయపడ్డార‌ని పేర్కొన్నారు. క్ష‌త‌గాత్రుడు ప్ర‌స్తుతం హాస్పిట‌ల్ లో చికిత్స పొందుతున్నార‌ని తెలిపారు. 

కాగా.. ఈ ఘ‌ట‌న‌కు ముందు రోజు షోపియాన్‌లోని బాస్కుచాన్ ప్రాంతంలో ప్రారంభమైన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ)తో సంబంధం ఉన్న ఒక ఉగ్రవాది హతమయ్యాడు. హ‌త‌మైన ఉగ్ర‌వాది నౌపోరా బాస్కుచాన్‌కు చెందిన నసీర్ అహ్మద్ భట్‌గా గుర్తించామ‌ని కశ్మీర్ ఏడీజీపీ తెలిపారు. మృతుడి వ‌ద్ద నుంచి ఏకే 47 రైఫిల్ తో పాటు నేరారోపణ చేసే పదార్థాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అత‌డు అనేక ఉగ్రవాద నేరాలలో పాల్గొన్నారు. ఇటీవల జ‌రిగిన ఓ ఎన్‌కౌంటర్ నుండి కూడా తప్పించుకున్నాడు.

శివ‌సేనకు మ‌రో ఎదురుదెబ్బ‌.. భారీ ఎత్తున ఏక్ నాథ్ షిండే వ‌ర్గంలో చేరిన ముంబై కార్య‌క‌ర్త‌లు

శుక్రవారం బారాముల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ తో సంబంధం ఉన్న ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లా జిల్లా పట్టన్ ప్రాంతంలోని యెడిపోరా గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులకు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. ఈ ప్రాంతంలో పోలీసులు, ఆర్మీ, సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) సంయుక్తంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ను నిర్వ‌హించారు.

సిద్దూమూసేవాలా హత్య: పోలీస్ కస్టడీ నుండి తప్పించుకున్న టిను, మండిపడ్డ బీజేపీ

సెర్చ్ ఆపరేషన్ సమయంలో జాయింట్ సెర్చ్ పార్టీ అనుమానిత ప్రదేశానికి చేరుకోగానే,  దాక్కొని ఉన్న ఉగ్రవాదులు భద్రతా దళాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో భ‌ద్రతా బ‌ల‌గాలు కూడా కాల్పులు జ‌ర‌ప‌డం ప్రారంభించాయి. ఇవి ఎదురుకాల్పుల‌కు దారి తీశాయి.

ఈ ఎన్ కౌంట‌ర్ లో నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ తో సంబంధం ఉన్న ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు ప్ర‌క‌టించారు. మృతుల‌ను కలాంపోరా పుల్వామా నివాసి యవర్ షఫీ భట్, వెష్రో షోపియాన్ నివాసి అమీర్ హుస్సేన్ భట్ గా గుర్తించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios