Asianet News TeluguAsianet News Telugu

శివ‌సేనకు మ‌రో ఎదురుదెబ్బ‌.. భారీ ఎత్తున ఏక్ నాథ్ షిండే వ‌ర్గంలో చేరిన ముంబై కార్య‌క‌ర్త‌లు

ముంబైలోని శివసేన కార్యకర్తలు భారీ సంఖ్యలో షిండే వర్గంలో చేరిపోయారు. బీఎంసీ ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ఉద్దవ్ ఠాక్రే వర్గానికి కొంత ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. 

Another setback for Shiv Sena..Mumbai activists joined Ek Nath Shinde's movement in large numbers
Author
First Published Oct 2, 2022, 3:46 PM IST

మ‌హారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలో ఉన్న శివ‌సేన‌కు భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. ఆ పార్టీలోని ముంబైకి చెందిన కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో ప్ర‌స్తుత  సీఎం ఏక్ నాథ్ వ‌ర్గంలో చేరిపోయారు. వర్లీ ప్రాంతానికి చెందిన ఆ కార్య‌క‌ర్త‌లు సీఎం అధికారిక నివాసంలో షిండే స‌ర‌స‌న చేరారు.

బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి సుధాకర్ సింగ్ రాజీనామా

ఈ వారం ప్రారంభంలో షిండే నేతృత్వంలోని వర్గం ఆ పార్టీ యువసేన, యువజన విభాగం కార్యనిర్వాహక కమిటీ సభ్యులను నియమించింది. అయితే ఈ పోస్టుల్లో అనేక మంది రెబల్ ఎమ్మెల్యేల బంధువులే ఉన్నారు. 

సిద్దూమూసేవాలా హత్య: పోలీస్ కస్టడీ నుండి తప్పించుకున్న టిను, మండిపడ్డ బీజేపీ

కాగా.. మాజీ సీఎం, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే  కుమారుడు అయిన ఆదిత్య ఠాక్రే యువసేనకు నాయకత్వం వహిస్తున్నారు. అయితే తాజాగా షిండే సమధన్ సర్వాంకర్, రాజ్ కులకర్ణి, రాజ్ సుర్వే, ప్రయాగ్ లాండేలను యువసేన ముంబై యూనిట్ ఇంచార్జులుగా నియ‌మించారు. వారిలో శవంకర్ ముంబై నగరపాలక సంస్థ మాజీ కార్పొరేటర్, షిండే నేతృత్వంలోని తిరుగుబాటు శిబిరంలో కీలక సభ్యుడు. మహిమ్ ఎమ్మెల్యే సదా సర్వాంకర్ కుమారుడు. సుర్వే మగధనే ఎమ్మెల్యే ప్రకాశ్ సుర్వే కుమారుడు కాగా, లాండే చండివాలి ఎమ్మెల్యే దిలీప్ లాండే కుమారుడు.

గాంధీల మద్దతు లేదు!.. దళిత నేతగానే కాదు, కాంగ్రెస్ నాయకుడిగా బరిలోకి దిగా.. : మల్లికార్జున్ ఖర్గే

శివసేన శ్రేణుల్లో తిరుగుబాటు కారణంగా ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయడంతో ఏక్నాథ్ షిండే, ఫడ్నవీస్ జూన్ 30న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు ఏక్ నాథ్ షిండే.. మ‌హారాష్ట్ర కేబినేట్ లో మంత్రిగా ఉన్నారు. కానీ ఎమెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల స‌మ‌యంలో శివ‌సేన‌లో తొలిసారిగా చీలిక‌లు వెలుగులోకి వ‌చ్చాయి. ఆ స‌మ‌యంలో షిండే త‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చే ఎమ్మెల్యేల‌ను తీసుకొని రాష్ట్రం బ‌య‌ట క్యాంపు ఏర్పాటు చేశారు.

త‌ద‌నంత‌రం జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల వ‌ల్ల ఉద్ద‌వ్ ఠాక్రే త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. దీంతో ఎంవీఏ ప్ర‌భుత్వం కుప్ప‌కూలింది. షిండే నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలు, బీజేపీతో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. కొత్త ప్ర‌భుత్వంలో బీజేపీ నుంచి శివ‌సేన నుంచి ఎమ్మెల్యేలు మంత్రులుగా ఎంపిక‌య్యారు. సీఎంగా ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్న‌వీస్ ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. కాగా.. శివ‌సేన ఎవ‌రికి చెందుతుంద‌నే విష‌యం ఇప్పుడు కోర్టులో ఉంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios