Asianet News TeluguAsianet News Telugu

సిద్దూమూసేవాలా హత్య: పోలీస్ కస్టడీ నుండి తప్పించుకున్న టిను, మండిపడ్డ బీజేపీ

పంజాబ్ గాయకుడు కాంగ్రెస్ నేత సిద్దూ మూసేవాలా హత్య కేసులో నిందితుడిగా ఉన్న  టిను పోలీస్ కస్టడీ నుండి తప్పించుకున్నాడు. ఈ ఘటనపై బీజేపీ మండిపడింది. ఆప్ సర్కార్ తీరును బీజేపీ నేత పూనావాలా  ఎండగట్టారు. 
 

 Sidhu Moosewala Murder Case: Accused Deepak Tinu escapes from police custody
Author
First Published Oct 2, 2022, 2:59 PM IST

న్యూఢిల్లీ: పంజాబ్ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్దూ మూసేవాలా  హత్య కేసులో నిందితుల్లో ఒకరైన దీపక్ టిను పంజాబ్ పోలీసుల కస్టడీ నుండి తప్పించుకున్నాడు.. గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ సన్నిహితుడే టిను. రిమాండ్ లో ఉన్న టినును  కపుర్తల జైలు నుండి మాన్యా సీఐఏ కార్యాలయానికి తరలిస్తున్న సమయంలో టిను తప్పించుకున్నాడు.  టిను తప్పించుకోవడంపై బీజేపీ ఆప్ సర్కార్ పై విమర్శలు గుప్పించింది. 

పంజాబ్ లోని కపుర్తల జైలు నండి మాన్సాకు రిమాండ్ పై టినును తీసుకు వచ్చారు.సిద్దూ మూసేవాలా హత్యకు రెండు రోజుల ముందు ఈ ఏడాది మే 27న బిష్ణోయ్ తో టిను మాట్లాడినట్టుగా సమాచారం. సిద్దూ మూసేవాలాను ఈ ఏడాది మే 29వ తేదీన  దుండగులు కాల్చి చంపారు. మాన్సాజిల్లాలోని జవహర్కే గ్రామంలోఈ ఘటన చోటు చేసుకుంది. 

 సిద్దూ మూసేవాలా  హత్యకు బిష్ణోయ్  గ్యాంగ్ కారణమని పంజాబ్ పోలీసులు గుర్తించారు. ఆప్ ప్రభుత్వం పంజ.ాబ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత  మూసేవాలా హత్యకు గురయ్యారు. మూసేవాలాకు ఉన్న భద్రతను తగ్గించిన తర్వాతే హత్యకు గురయ్యారని ఆప్ పై విపక్షాలు విమర్శలుచేశాయి.ఈ ఘటనలో టినుతో పాటు ఇటీవల అరెస్టైన జగ్గు భగవాన్‌పురియాలో ముఠాలోని ఇద్దరు సభ్యులు మూసేవాలాను హత్య చేసేందుకు  ప్రయత్నించారని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.  మణిరయ్య, మన్ దీప్ సింగ్ అలియాస్ తుఫాన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.దీంతో బిష్ణోయ్ గ్యాంగ్  ప్రణాళికను రూపొందించింది. ఆరుగురు షార్ప్ షూటర్లతో గ్యాంగ్ ను ఏర్పాటు చేసింది. 

టిను తప్పించుకోవడంపై బీజేపీ విమర్శలు

పోలీస్ కస్టడీ నుండి టిను తప్పించుకోవడంపైబీజేపీమండిపడింది. బీజేపీఅధికార ప్రతినిధి షెహజార్  పూనావాలా ఆదివారం నాడు ట్విట్టర్ వేదికగా ఈ విషయమై ఆప్ ప్రభుత్వంపై మండిపడ్డారు.పంజాబ్ లో వ్యవస్థీకృత నేరాలను అరికట్టడంలో ఆప్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బీజేపీ  మండిపడింది.

భద్రతా ప్రమాణాలు పాటించని కారణంగానే టిను తప్పించుకొన్నాడని బీజేపీ ఆరోపించింది.  పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ కు 42 కార్ల కాన్వాయ్ ఉపయోగిస్తారని బీజేపీ ఆరోపించారు. ఆప్ నేతలకు వీవీఐపీ రక్షణ కల్చించిన సర్కార్,  టిను ను  తరలించే సమయంలో సరైన రక్షణ చర్యలు తీసుకోలేదన్నారు. నిందితులకు  ఆప్ సర్కార్ సహాయం చేస్తుందనేందుకు ఇంతకన్నా మరో సాక్ష్యం అవసరమా అని ఆయన ప్రశ్నించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios