Asianet News TeluguAsianet News Telugu

యూపీలో ఘోరం.. 25 ఏళ్ల యువతిపై అత్యాచారం.. నిందితుడి అరెస్టు..

యూపీలో ఓ మహిళపై ఓ దుండుగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. 

Terrible in UP.. Rape of 25-year-old girl.. Accused arrested..
Author
First Published Nov 10, 2022, 6:11 AM IST

దేశంలో మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఒంటరిగా మహిళలు కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. అభం శుభం తెలియని చిన్న పిల్లలపై క్రూరంగా లైంగిక దాడికి ఒడిగడుతున్నారు. తాజాగా యూపీలో కూడా ఓ అత్యాచార ఘటన వెలుగుచూసింది.

2024లో మోడీని రాహుల్ గాంధీ సవాల్ చేస్తారు.. కానీ ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయిస్తాయి - అశోక్ గెహ్లాట్

వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మెయిన్‌పురి ప్రాంతంలో ఓ 25 ఏళ్ల యువతిపై అత్యాచారం జరిగింది. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన మంగళవారం జరిగింది. ఈ సమాచారం పోలీసులకు తెలియగానే వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. 

మెయిన్‌పురి ఎస్పీ కమలేష్ దీక్షిత్ మాట్లాడుతూ.. ‘‘అత్యాచార సమాచారం అందుకున్న వెంటనే మేము ఘటనా స్థలానికి చేరుకున్నాం. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించాం. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసాము. ఈ విషయంలో చట్ట ప్రకారం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ’’ అని తెలిపారు.

గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సంచలన నిర్ణయం.. ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటన..

ఇదే రాష్ట్రంలో వారం రోజుల కిందట గ్యాంగ్ రేప్ ఘ‌ట‌న ఒకటి వెలుగులోకి వ‌చ్చింది. ప‌దో త‌ర‌గ‌తి బాలిక‌పై పలువురు దుండగులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ దారుణాన్ని తీసి బెదిరింపుల‌కు దిగారు. దీనిపై బాధితురాలి తండ్రి పోలీసులకు సమాచారం అందించారు. వివరాలు ఇలా ఉన్నాయి. హత్రాస్ జిల్లాలో పదో తరగతి చదివే బాలిక  కోచింగ్ క్లాసులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తోంది. ఈ క్రమంలో ఐదుగురు వ్యక్తులు బాలికకు మ‌త్తు మందు ఇచ్చి.. అపస్మారక స్థితిలోకి వెళ్లిన త‌ర్వాత అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఘటనను వీడియో తీశారు. త‌ర్వాత బాలిక‌ను బెదిరింపుల‌కు గురిచేయ‌డం ప్రారంభించారు. అక్టోబరు 10న ఈ ఘటన జరగ్గా, గ్యాంగ్‌రేప్‌కు సంబంధించిన వీడియో కనిపించడంతో బాలిక కుటుంబసభ్యులకు గత మంగళవారం ఈ విషయం తెలిసింది.  పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది. 

అస్సాంలో బుధవారం ఓ అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. కరీంగంజ్‌లో 13 ఏళ్ల బాలికపై ఆరుగురు మైనర్ బాలురు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. రామకృష్ణ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కరీంగంజ్‌లో స్థానికంగా నివసించే ఆరుగురు యువకులు ఓ మైనర్ బాలిక ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డారు. ఒక్కరి తర్వత ఒక్కరూ అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని ఫోన్ వీడియో తీశారు. ఈ విషయన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని హెచ్చరించారు.

జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ, ముగ్గురు మృతి.. 16 మందికి గాయాలు..

కానీ తరువాత బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు మొదలు పెట్టి ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులంతా 13 నుంచి 15 ఏళ్ల లోపు వారే ఉండటం ఇక్కడ శోఛనీయం. నిందితుల నుంచి మొబైల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై పోక్సో కింద కేసు నమోదు చేశారు. జువైనల్ హోంకు తరలించారు.

Follow Us:
Download App:
  • android
  • ios