Asianet News TeluguAsianet News Telugu

జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ, ముగ్గురు మృతి.. 16 మందికి గాయాలు..

జమ్మూ కాశ్మీర్ లో రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో 16 మందికి గాయాలు అయ్యాయి. వారంతా ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. 

Serious road accident in Jammu and Kashmir Three killed, 16 injured in two bus collision
Author
First Published Nov 10, 2022, 1:07 AM IST

జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొనడంతో ముగ్గురు చనిపోయారు. మరో 16 మందికి గాయాలు అయ్యాయి. చనిపోయిన వారిలో ఇద్దరు తల్లీకూతుర్లు ఉన్నారు. జమ్మూ-పఠాన్‌కోట్ హైవేపై నానకే చక్ వద్ద ఓ బస్సు మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేస్తున్న సమయంలో ఓవర్ స్పీడ్ వల్ల ఈ ప్రమాదం జరిగింది.

ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్ సభ్యుడిపై అనుబంధ చార్జ్ షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ

ఈ ప్రమాదానికి గురైన బస్సుల్లో ఒకటి సహరాన్‌పూర్‌కు వెళుతుండగా, మరొకటి కథువా జిల్లా వైపు వెళ్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో  36 ఏళ్ల మంగీ దేవీ, ఆమె 14 ఏళ్ల కుమార్తె తనియా, రాజ్‌పురాకు చెందిన 58 ఏళ్ల కస్తూరి లాల్‌ చనిపోయినట్టు గుర్తించామని మరో 16 మంది గాయపడ్డారని సాంబ డిప్యూటీ కమిషనర్ అనురాధ గుప్తా వార్తా సంస్థ ‘పీటీఐ’కి తెలిపారు. మృతులను పంజాబ్‌లోని బటాలాకు చెందిన వారని పేర్కొన్నారు. క్షతగాత్రుల్లో ఏడుగురిని జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ)కి, మరో ఎనిమిది మందిని సాంబాలోని జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు ఆమె తెలిపారు.

ప్రమాదానికి గురైన రెండు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆమె పేర్కొన్నారు. మృతుల బంధువులకు ఒక్కొక్కరికి రూ.లక్ష, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50,000, స్వల్పంగా గాయపడిన వారికి రూ.10,000 చొప్పున పరిహారాన్ని జిల్లా యంత్రాంగం ప్రకటించిందని గుప్తా తెలిపారు కాగా.. డిప్యూటీ కమిషనర్ అనురాధ గుప్తా జిల్లా ఆసుపత్రిని సందర్శించి క్షతగాత్రులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. 

హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలు.. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పార్టీలకు రూ.545 కోట్ల విరాళాలు

ఇదిలా ఉండగా.. ఈ ప్రమాదంపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దోడా, సాంబాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం చాలా బాధ కలిగించిందని అన్నారు. ‘‘మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. అన్ని విధాలా సహాయాన్ని అందించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించాను ’’ అని ఆయన ట్వీట్ చేశారు. 

కాగా.. ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీన కూడా జమ్మూ కాశ్మీర్ లో ఇలాంటి ప్రమాదమే జరిగింది. రెండు బస్సులు ఢీకొనడంతో ఐదేళ్ల చిన్నారి చనిపోయింది. 16 మందికి గాయాలు అయ్యాయి. ఢిల్లీకి చెందిన దాదాపు 35 మంది భక్తులు మా వైష్ణోదేవిని దర్శించుకునేందుకు కత్రాకు వచ్చారు. అయితే వారు తిరుగు ప్రయాణం మొదలుపెట్టిన తరువాత కత్రాలోనే ప్రమాదానికి గురయ్యారు. భక్తులు ప్రయాణిస్తున్న బస్సును మరో బస్సు ఢీకొట్టింది.

మాజీ ప్రధాన న్యాయమూర్తిని రాజ్యసభకు నామినేట్ చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు

అలాగే మంగళవారం రాత్రి జమ్మూ కాశ్మీర్ లోని ఓ నదిలో కారు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు చనిపోయారు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో బటోట్-కిష్త్వార్ జాతీయ రహదారిపై షిబ్నోట్-కరారా వద్ద ఈ ప్రమాదం జరిగిందని ఎస్‌డీఎం (తాతిరి) అథర్ అమీన్ జర్గర్ తెలిపారు. కారు దోడా నుంచి కిష్త్వార్‌కు వెళ్తుండగా అకస్మాత్తుగా ప్రవహిస్తున్న నదిలో పడిపోయిందని ఆయన పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios