Asianet News TeluguAsianet News Telugu

క్యాంపస్ లో ఉద్రిక్తత.. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ కార్యకర్తల మధ్య ఘర్షణ.. విద్యార్థులకు గాయాలు..

ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇరు సంఘాలకు చెందిన విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీలో జరిగింది. పోలీసులు రెండు వర్గాలపై కేసు నమోదు చేశారు. 

Tension in the campus.. Clash between ABVP and SFI activists.. Students injured..
Author
First Published Dec 7, 2022, 9:07 AM IST

హిమాచల్ ప్రదేశ్ యూనివర్శిటీలో మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ), స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) సభ్యుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. 

బోరుబావిలో చిన్నారి.. 400 అడుగుల లోతు బావిలో పడ్డ 8 యేళ్ల బాలుడు...

సీపీఐ(ఎం) అనుబంధంగా కొనసాగే విద్యార్థి విభాగం, దాని కార్యకర్తలు మహిళా సభ్యులపై వేధించారని, ఇతరులపై దాడి చేశారని, దీని వల్ల ఎనిమిది మందికి గాయాలయ్యాయని ఆర్ఎస్ఎస్ అనుబంధంగా పని చేసే విద్యార్థి విభాగమైన ఏబీవీపీ ఆరోపించింది. అయితే యూనివర్సిటీ ఆన్‌లైన్ వ్యాలుయేషన్ వ్యవస్థ అయిన ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ సిస్టమ్ (ఈఆర్పీ)కి వ్యతిరేకంగా తమ నిరసనను భంగపరిచేందుకు ఏబీవీపీ ఈ దాడికి కుట్ర చేసిందని ఎస్ఎఫ్ఐ ఆరోపించింది.

ఇరువర్గాలు ఒకరిపై ఒకరు చేసిన ఆరోపణల ఆధారంగా ఆరుగురు ఏబీవీపీ సభ్యులు, ఆరుగురు ఎస్ఎఫ్ఐ, ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు కొందరు మహిళా సభ్యులను వేధించారని ఏబీవీపీ అధ్యక్షుడు సచిన్ రాణా ఆరోపించారు. ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు ఏబీవీపీ సభ్యులపై కూడా ఆయుధాలతో దాడి చేశారని, వారిలో ఎనిమిది మంది గాయపడ్డారని ఆయన పేర్కొన్నారని ‘టైమ్స్ నౌ’ నివేదించింది.

ఛీ..ఛీ.. భార్యపై అత్యాచారం.. ప్రైవైట్ భాగాల్లో ప్లాస్టిక్ పైపు చొప్పించి.. ఓ భర్త పైశాచికత్వం..

ఎస్‌ఎఫ్‌ఐ యూనివర్శిటీ క్యాంపస్ సెక్రటరీ సుర్జీత్ ఆరోపణలను తోసిపుచ్చారు. యూనివర్శిటీలోని ఈఆర్పీ వ్యవస్థకు వ్యతిరేకంగా తమ ఉద్యమంలో చిచ్చు పెట్టేందుకు ఏబీవీపీ సభ్యులు ఈ దాడికి ప్లాన్ చేశారని ఆరోపించారు. మంగళవారం ఉదయమే ఏబీవీపీ సభ్యులు ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలపై రాళ్లు రువ్వారని, ఆయుధాలతో దాడి చేశారని అన్నారు. 

హనీట్రాప్.. రేప్ కేసులో ఇరికిస్తానని బెదిరించి రూ.80 లక్షలకు టోకరా.. యూట్యూబర్ అరెస్ట్..

ఏబీవీపీ కార్యకర్తలపై గతంలో అనేక ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆయన ఆరోపించారు. ఇదిలావుండగా.. వాయనాడ్ జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో పీఎఫ్ అబ్బాయిల బృందం దాడి చేయడంతో మహిళా నాయకురాలు గాయాలతో హాస్పిటల్ లో చేరారు. దీని తరువాత కేరళలో పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios