Asianet News TeluguAsianet News Telugu

ఛీ..ఛీ.. భార్యపై అత్యాచారం.. ప్రైవైట్ భాగాల్లో ప్లాస్టిక్ పైపు చొప్పించి.. ఓ భర్త పైశాచికత్వం..

భార్యమీద అతి దారుణంగా అత్యాచారం చేసి.. ఆమె ప్రైవేట్ భాగాల్లో ప్లాస్టిక్ పైపును చొప్పించి.. అసహజశృంగారానికి పాల్పడ్డాడో వ్యక్తి. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

Man arrested for allegedly rape and inserts plastic object in s wife private part in Mumbai
Author
First Published Dec 7, 2022, 7:33 AM IST

మహారాష్ట్ర : ముంబైలో అత్యంత అమానవీయ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి భార్యను అత్యంత దారుణంగా హింసించిన విషయం బయటపడింది. మద్యం మనిషి విచక్షణను నశింపజేస్తుందని ఈ ఘటన రుజువు చేస్తోంది. మద్యం మత్తులో తాళి కట్టిన భార్య మీద పైశాచికత్వానికి తెగించాడో వ్యక్తి. భార్యే కదా.. పడి ఉంటుంది అనుకున్నాడో.. ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నాడో తెలియదు కానీ..  ఆమె మీద  దాష్టీకానికి ఒడిగట్టాడు. ఆ హింస భరించలేక ఆమె పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఫుల్లుగా మద్యం తాగిన ఓ భర్త..  ఊగుతూ తూగుతూ ఇంటికి చేరాడు. ఆ తర్వాత ఇంట్లో ఎదురుగా కనబడిన భార్య మీద చేయి చేసుకున్నాడు. ఆమెను అసహజ లైంగిక కార్యక్రమాల్లో పాల్గొనాలని వేధించాడు. ఆమె దానికి తిరస్కరించడంతో.. అత్యంత హేయంగా వ్యవహరించాడు. ఓ ప్లాస్టిక్ పైపును ఆమె ప్రైవేటు భాగాల్లో చొప్పించాడు. ఒళ్ళు గగుర్పొడిచే ఈ ఘటన  మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఆదివారం రాత్రి  జరిగింది.  అక్కడ ములుంద్ ప్రాంతంలో ఉండే వ్యక్తి ఆదివారం రాత్రి 11 గంటలకు మద్యం మత్తులో ఇంటికి చేరుకున్నాడు.

హనీట్రాప్.. రేప్ కేసులో ఇరికిస్తానని బెదిరించి రూ.80 లక్షలకు టోకరా.. యూట్యూబర్ అరెస్ట్..

తలుపు తీసి, తనకు సపర్యలు చేయడానికి ప్రయత్నించిన భార్యను  విపరీతంగా కొట్టాడు. ఆ తర్వాత తనతో అసహజ శృంగారంలో పాల్గొనాలని  బలవంతం చేశాడు. దీనికి ఆమె తీవ్రంగా వ్యతిరేకించింది. ఆమె ప్రతిఘటించడంతో భర్తలోని మృగం మేల్కొంది. ఓ ప్లాస్టిక్ పైపు లాంటి వస్తువును ఆమె ప్రైవేట్ భాగాలలోకి చొప్పించాడు. దీంతో నొప్పి భరించలేక విలవిల్లాడింది. భర్తనుంచి తప్పించుకుని ఆసుపత్రికి వెళ్ళింది. ఆమె పరిస్థితి చూసిన వైద్యులు షాక్ అయ్యారు. ఏం జరిగిందంటూ నిలదీశారు. దీంతో బాధితురాలు అసలు విషయం చెప్పింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకుని బాధితురాలిని నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. భర్తను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. 

ముదురుతున్న సరిహద్దు వివాదం.. కర్ణాటకకు బస్సు సేవలను నిలిపివేసిన‌ మహారాష్ట్ర

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో, ఎంటీ అగర్వాల్ ఆసుపత్రి వైద్యుల నుండి ములుంద్ పోలీసులకు ఫోన్ వచ్చింది. 35 ఏళ్ల మహిళ తన ప్రైవేట్ భాగాల్లో తీవ్రమైన నొప్పితో ఆసుపత్రికి చేరుకుందని.. తాము అడిగితే.. తన భర్త మద్యం తాగి ఇంటికి వచ్చి కొట్టాడని చెప్పిందని తెలిపారు. "కొట్టిన తర్వాత ఆమె దుస్తులను చింపేసాడు. ఆమె ప్రైవేట్ భాగాల్లో ఏదో చొప్పించాడు, ఇది తీవ్రమైన నొప్పికి దారితీసింది" అని ములుంద్ పోలీసులు తెలిపారు.

"ఆసుపత్రిలో వైద్యులు ఆమె ప్రైవేట్ భాగాల్లో నుండి ప్లాస్టిక్ పైపులాంటి వస్తువును తొలగించారు." అని కూడా పోలీసులు తెలిపారు. ఈ విషయంపై దర్యాప్తు చేసిన తర్వాత, పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios