Asianet News TeluguAsianet News Telugu

రామ్ లల్లా విగ్రహా ప్రాణప్రతిష్ట: అయోధ్యకు చేరుకున్న చంద్రబాబు

అయోధ్యలోని రామ్ లల్లా విగ్రహా ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని పలువురు ప్రముఖులు  అయోధ్యకు చేరుకున్నారు.

 Telugu Desam Party President Nara Chandrababu Naidu Reaches To Ayodhya lns
Author
First Published Jan 22, 2024, 10:41 AM IST | Last Updated Jan 22, 2024, 10:41 AM IST

న్యూఢిల్లీ: తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు అయోధ్యకు చేరుకున్నారు.  అయోధ్యలో  రాముడి విగ్రహా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి చంద్రబాబుకు నిర్వహకులు ఆహ్వానం పంపారు.ఈ ఆహ్వానం మేరకు చంద్రబాబు నాయుడు  ఇవాళ  ఉదయం  పది గంటల సమయంలో  అయోధ్యకు చేరుకున్నారు. 

also read:అయోధ్య రామ మందిరం: అమెరికా టైమ్స్ స్క్వేర్ లో స్క్రీన్లపై రాముడి ఫోటోలు, ఎన్ఆర్ఐల సంబరాలు

అయోధ్యలో రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. గత వారం రోజులుగా ఈ కార్యక్రమం సాగుతుంది. అయితే  ప్రాణ ప్రతిష్టలో ప్రధాన  ఘట్టం  ఇవాళ జరగనుంది. దీంతో ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన  ఏడు వేల మందిని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్  ఆహ్వానించింది.రాజకీయ, సినీ,క్రీడా,వ్యాపార ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు నిర్వాహకులు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios