సారాంశం
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని అమెరికాలో కూడ ప్రవాస భారతీయులు సంబరాలు చేసుకున్నారు.
న్యూఢిల్లీ: భారత దేశ చరిత్రలో సోమవారం నాడు (జనవరి 22) అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం చారిత్రాత్మక రోజుగా నిలిచిపోనుంది.ప్రవాస భారతీయులు న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద గుమికూడారు. సంప్రదాయ దుస్తులను ధరించారు . అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమ వేడుకలను పురస్కరించుకొని భజనలు, పాటలు పాడారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించారు.ఈ విషయాన్ని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా న్యూయార్క్ తెలిపింది.
అమెరికాలోని టైమ్స్ స్క్వేర్ లోని స్క్రీన్ లపై రాముడి చిత్రాలు ప్రదర్శించారు. ఈ చిత్రాలను చూస్తూ కాషాయ జెండాలతో ప్రవాస భారతీయులు వేడుకల్లో పాల్గొన్నారు.అయోధ్యలో రామ మందిరంలో రాముడి విగ్రహా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఇవాళ మధ్యాహ్నం జరగనుంది. ఈ కార్యక్రమం కోసం దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన ఏడు వేల మందికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది. ప్రాణ ప్రతిష్టలో ప్రధాన కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్య కర్తగా వ్యవహరించనున్నారు. అయోధ్యలో జరుగుతున్న వేడుకలకు సంబంధించిన వీడియోలను అమెరికాలోని ఐకానిక్ వెన్యూలో జరిగిన వీడియోలను సోషల్ మీడియాలో యూజర్లు షేర్ చేశారు.
హోస్టన్ లో సంబరాలు
విధ్వంసం నిర్లక్ష్యం నుండి అయోధ్య తిరిగి ప్రారంభం అవుతుందని అమెరికాలోని హిందూ విశ్వ విద్యాలయం అధ్యక్షుడు కళ్యాణ్ విశ్వనాథన్ బ్లాగ్ పోస్టులో తెలిపారు.550 ఏళ్ల తర్వాత రామ్ లల్లా విగ్రహనికి ప్రాణ ప్రతిష్ట జరగడం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు ఎనలేని ఆనందాన్ని కలిగిస్తుందన్నారు.
also readiఅయోధ్య రామ మందిరం: ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకానున్న నిత్యానంద
500 ఏళ్ల నిరీక్షన తర్వాత అయోధ్యలోని రామ్ లల్లా ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా హిందువుల విశ్వాసం, వేడుకలకు ముఖ్యమైన రోజు అని టెక్సాస్ లోని శ్రీసీతారామ్ పౌండేషన్ కు చెందిన కపిల్ శర్మ చెప్పారు.