Asianet News TeluguAsianet News Telugu

Tamlahal: సూఫీలకు కేంద్రంగా ఈ కశ్మీరీ గ్రామం.. ఇప్పటికీ సూఫీ సాంప్రదాయాలు సజీవం

జమ్ము కశ్మీర్ పుల్వామా జిల్లాకు చెందిన తమ్లహాల్ గ్రామం సూఫీలకు కేంద్రంగా చెబుతారు. ఇక్కడ ఇప్పటికీ సూఫీ సంప్రదయాలు సజీవంగా ఉన్నాయి. ఇంకా కొందరు సూఫీలు జీవించే ఉన్నారు. ఈ గ్రామంలో సూఫీలతోపాటు దైవాన్ని ఇష్టపడే పెద్దలు, డెర్విష్‌లు, మలంగ్‌‌లు, కలందర్లు, మజూబ్‌లు ఈ గ్రామంలో పుట్టారు. 
 

tamlahal a kashmiri village, where people revere sufism, follows sufi traditions kms
Author
First Published Jun 3, 2023, 1:41 PM IST

Sufism: జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో తమ్లహాల్ అనే ఓ గ్రామం ఉన్నది. ఈ గ్రామం సూఫీ సాంప్రదాయాలకు ప్రసిద్ధి. సూఫీ గురువులకూ కేంద్రంగా ఉంది. ఇక్కడ ఇప్పటికీ సూఫీ సాంప్రదాయాలు సజీవంగా కనిపిస్తాయి. 3000 గ్రామస్తులు గల ఈ గ్రామంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం మారణకాండను సృష్టించడానికి ముందు 200 మంది కశ్మీరీ పండిట్లు ఉండేవారు. పుల్వామా జిల్లా హెడ్ క్వార్టర్‌కు 7 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉన్నది. ఈ గ్రామాన్ని సూఫీల గ్రామం అని కూడా పిలుస్తారు. ఇక్కడ సాధారణ ప్రజలంతా సూఫీ సాంప్రదాయాన్నే పాటిస్తారు. ఈ గ్రామంలో సూఫీలతోపాటు దైవాన్ని ఇష్టపడే పెద్దలు, డెర్విష్‌లు, మలంగ్‌‌లు, కలందర్లు, మజూబ్‌లు ఈ గ్రామంలో పుట్టారు.

ఈ జిల్లా సూఫీ కవులు, గాయకులకు పుట్టినిల్లు వంటిది. ఉదాహరణకు వాహబ్ ఖర్, సౌచ్ కరల్, మోమిన్ షా సాహిబ్, గులాం అహ్మద్ మెజూర్, హబా ఖతూన్, ఖాదిర్ సాహిబ్ అలుపొరాలు ఇక్కడే జన్మించారు. సూఫీలు, డెర్విష్‌లు, మలంగ్‌లకు ఈ జిల్లాలోని చాలా గ్రామాలు కేంద్రాలుగా ఉన్నాయి.అందులో జిల్లా హెడ్ క్వార్టర్‌కు 7 కిలోమీటర్ల దూరంలోని తమ్లహాల్ కూడా ఉన్నది.

కబరూయా సిల్సిలా పెద్దలు హజ్రత్ సయ్యద్ ముహమ్మద్ జాఫర్ ఇక్కడే 12 ఏళ్లు ధ్యానం చేశారు. శ్రీనగర్ నగరంలోని రావల్‌పురా ఏరియాలో ఈయన దర్గా ఒకటి ఉన్నది. కశ్మీరీ సూఫీజానికి తమ గ్రామామే కేంద్రమని తమ్లహాల్ గ్రామానికి చెందిన గులాం మొహియుద్దీన్ భట్ అభిప్రాయపడ్డారు. కశ్మీరీ సమాజ ఆధ్యాత్మిక కోణంలో కీలకమైన నిర్ణయాలు ఇక్కడే జరిగాయని చెప్పారు. ఈ సమావేశాలు హజ్రత్ సయ్యద్ మొహమ్మద్ జాపర్ కొబర్వి సమాధి వద్దే ఈ సమావేశాలు జరిగాయి.

హజ్రత్ పీర్ సమద్ షా కబారీ, హజ్రత్ పీర్ ముహమ్మద్ ముస్తఫా షా కబారీ, హజ్రత్ పీర్ ముబారక్ షా కబారీ, హజ్రత్ పీర్ ముహమ్మద్ మక్బూల్ షా కబారీ, పీర్ ఫకీర్ మొహమ్మద్ తయ్యబ్ షా కబార్వీ వంటి అనేక సంతులు, సన్యాసులు, సూఫీలు, ఖలందర్లు, మజూబ్‌లను ఈ గ్రామం అందించింది. గులాం నబీ మీర్, యూసుఫ్ మన్సూర్ షా, అహంగర్ మస్తానాలు ఇక్కడ పుట్టిన ప్రముఖ మజూబ్‌లు, మలంగ్‌లు.

Also Read: జమ్ము కశ్మీర్‌లో సూఫీ దర్గాల అభివృద్ధి.. సూఫీ సర్క్యూట్‌తో ఆధ్యాత్మిక యాత్రలకు ప్రభుత్వ ప్రణాళిక

ఇక్కడ పంట, హార్టికల్చర్, వ్యాపారాలు చేసే గ్రామస్తులు తమ జీవితంలో సూఫీ సాంప్రదాయాలనే పాటిస్తారు. సూఫీజానికి సంబంధించిన అనేక సాధువులు, సూఫీలు ఇప్పటికీ ఈ గ్రామంలో జీవించే ఉన్నారు. అందులో కొందరు మీర్ అబ్దుల్ అజీజ్ ఖాద్రీ, మలంగ్ గులం హసన్ మీర్, గులాం మొహియుద్దీన్ భట్, అబ్దుల్ జబ్బర్ దాంగ్రు, ముహమ్మద్ అక్బర్ పాయిలు ఉన్నారు.

మీర్ అబ్దుల్ అజీజ్ ఖాద్రి ఇంటి నిండా ఎప్పుడూ భక్తులు, అభిమానులతో నిండి ఉంటుంది.

ఈ గ్రామ యువత డాక్టర్లు, ప్రొఫెసర్లు, ఇంజినీర్లుగా ప్రొఫెషనల్స్ అయినప్పటికీ వారు సూఫీలకు సేవలు చేస్తుంటారు. 

శీతాకాలంలో తమ్లహాల్ గ్రామం నుంచి చాలా మంది రాజస్తాన్ అజ్మేర్‌లోని హజ్రత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గాను సందర్శిస్తారు. తమ్లహాల్ నుంచి అజ్మేర్ దర్గాకు నేరుగా బస్సులు వేస్తారు. కొందరు నేరుగా రాజస్తాన్‌కు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోతారు. దర్గా వద్ద ఉర్స్, ఇతర ఇస్లాం పండుగల నిర్వహణలో ఈ గ్రామస్తులు ముందు వరుసలో ఉంటారు.

కబారీ ట్రెడిషన్‌కు చెందిన పీర్ జహూరుద్దీనర్ షా ఏమంటారంటే.. హజ్రత్ బాబా నసీబుద్దీన్ ఘాజీ 400 ఏళ్ల క్రితం ఈ గ్రామానికి వచ్చారని,ఇక్కడ మసీదు నిర్మించారని, మరికొన్ని సంవత్సరాలకు ఇంకో మసీదు నిర్మించారని చెబుతారు.

Follow Us:
Download App:
  • android
  • ios