జమ్ము కశ్మీర్‌లో సూఫీ దర్గాల అభివృద్ధి.. సూఫీ సర్క్యూట్‌తో ఆధ్యాత్మిక యాత్రలకు ప్రభుత్వ ప్రణాళిక
జమ్ము కశ్మీర్‌లో ప్రభుత్వం సూఫీ సర్క్యూట్ ఏర్పాటు చేయాలని, తద్వార ఆధ్యాత్మిక యాత్రలను పెంచి ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని తలచింది. ఇందుకోసం జమ్ము కశ్మీర్‌లోని సూఫీ దర్గాలను గుర్తించి వాటిని నవీకరిస్తున్నారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
Sufi Circuit: జమ్ము కశ్మీర్‌కు పర్యాటకల తాకిడి పెరుగుతున్నది. త్వరలో సూఫీ గురువుల అనుగ్రహాన్ని పొందాలని, ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రాప్తి కోసం జమ్ము కశ్మీర్‌కు వచ్చే వారి సంఖ్య పెరగనుంది. ఇక్కడ సూఫీ సర్క్యూట్ ఏర్పాటు చేసి మతపరమైన పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.
సూఫీ దర్గాలు అత్యధికంగా కశ్మీర్‌లోనే ఉన్నాయి. ఇస్లాం బోధకుడు సయ్యిద్ అలీ హమదాన్ (షాహి హమదాన్) మత వ్యాప్తి కోసం సుమారు 700 మంది అనుచరులతో ఇక్కడికి వచ్యారు. ఆయన శిష్యులు ఆ లోయ మొత్తం తిరిగతారు. ఫలితంగా కశ్మీర్ లోయలో సూఫీ సంస్కృతి ఏర్పడింది. సయ్యిద్ అలీ హమదాన్ దర్గా శ్రీనగర్‌లోని ఉన్నది. ఇటీవలే ఈ దర్గాను రిపేర్ చేసి సుందరీకరించారు.
జమ్ము కశ్మీర్‌లోని అన్ని సూఫీ కేంద్రాలను కలుపాలనే సూఫీ సర్క్యూట్ ప్రాజెక్ట్ 2019లోనే తుది మెరుగులు దిద్దుకుంది. కానీ, అదే ఏడాది ఆగస్టు 5న ఆర్టికల్ 370 తొలగించడం, బలగాల మోహరింపు పెరగడం, ఆ తర్వాత కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ వంటివాటితో ఈ ప్రాజెక్టు అమలు జాప్యమైంది.
ఈ ప్రాజెక్ట్‌ను సాంస్కృతిక శాఖ సమన్వయపరుస్తున్నది. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం సూఫీ కేంద్రాల సంఖ్యను లెక్కించడంతో ప్రాజెక్ట్ ప్రారంభమైంది.
ఈ ప్రాజెక్టులో మతపరమైన స్థలాలనూ చేర్చాలని టూర్ ప్యాకేజీలో చేర్చాలని జమ్ము కశ్మీర్ వక్ఫ బోర్డ్ చైర్‌పర్సన్ దరక్షన్ అంద్రాబి కోరారు. తద్వార పర్యాటకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుందని, అలాగే, ఆ ఆధ్యాత్మిక ప్రాంతాలూ సురక్షితంగా ఉంటాయని వివరించారు.
జమ్ము కశ్మీర్‌లో ఒక సూఫీ సర్క్యూట్, రెండు హిందూ సర్క్యూట్‌లను (ఒకటి జమ్ములో, మరొకటి కశ్మీర్ లోయలో) ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు వివరించాయి.
ఈ సర్క్యూట్ ప్రకటించడానికి ముందు సూఫీ దర్గాలను రిపేర్ చేసి.. వాటిని అనుసంధానించే మార్గాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. సూఫీ పర్యాటక సర్క్యూట్‌ను అభివృద్ధి చేయడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే.
HAZRATBAL SHRINEమన దేశంలోనే ఖ్యాతి గాంచిన హజ్రత్‌బల్‌తోపాటు స్థానికులు ఎక్కువగా సందర్శించే ఇతర సూఫీ దర్గాలను ఈ సర్క్యూట్‌లో ప్రభుత్వం చేర్చనుంది. ఈ సర్క్యూట్ శ్రీనగర్‌లోని మఖ్దూమ్ సాహిబ్ నుంచి ఖాంఖే మొల్లా మీదుగా ఉత్తర కశ్మీర్‌లోని వతాలబ్ బాబా రేషి నుంచి దక్షిణ కశ్మీర్‌లోని పాఖర్పొరా అయిష్ముఖమ్ వరకు ఉంటుంది. ఈ సర్క్యూట్ డెవలప్‌మెంట్‌లో కల్చరల్, ఆర్కైవ్స్, ఆర్కియాలజీ, మ్యూజియం శాఖలతోపాటు వక్ఫ్ బోర్డు కూడా పాలుపంచుకుంటున్నాయి.
ఈ కింది సూఫీ దర్గాలను నవీకరించి సూఫీ సర్క్యూట్‌లో చేర్చనున్నారు.
Makhdoom Sahib
మఖ్దూం సాహిబ్
షేక్ హంజా మఖ్దూం ఎక్కువగా మఖ్దూం సాహిబ్ పేరుతో ప్రసిద్ధి. కశ్మీర్‌లోనే జన్మించిన ఈయన 16వ శతాబ్దానికి చెందిన గురువు. 1494లో జన్మించిన మఖ్దూం సాహిబ్ గ్రామంలోనే ఖురాన్ నేర్చుకుని మద్రాసాలో చేరారు. ఆ తర్వాత రిలీజియస్ ఎడ్యుకేషన్ కోసం సెమినరీలను నేర్చుకున్నారు. క్రీస్తు శకం 1576లో ఆయన మరణించిన సుమారు 14 ఏళ్లకు అప్పటి పాలకుడు జలాలుద్దిన్ అక్బర్ ఈ దర్గా నిర్మించారు.
ఖాంఖే మొల్లా
ఈ దర్గా జీలం నదీ తీరంలో 1395లో సుల్తాన్ సికందర్ నిర్మించారు. 14వ శతాబ్దికి చెందిన సూఫీ గురువుకు స్మారకంగా ఈ నిర్మాణం చేశారు. హమదాన్ మన దేశంలోకి ప్రవేశించిన తర్వాత జమ్ము కశ్మీర్‌లో నిర్మించిన తొలి దర్గా ఇది.
The shrine of Baba Shakooruddinబాబా షకూరుద్దీన్ దర్గా
15వ శతాబ్దికి చెందిన ఈయన కశ్మీర్‌లోనే జన్మించిన సూఫీ గురువు. ఈయన కోసం ఆసియాలోనే అతిపెద్ద తాజా నీటి సరస్సు(వులర్ లేక్) దగ్గర ఉత్తర కశ్మీర్‌లోని సోపోర్‌లో వతాలాబ్ షారికోట్ హిల్లాక్ వద్ద దర్గాను నిర్మించారు. పొలం వద్ద షకూరుద్దీన్ పని చేసుకుంటూ ఉండగా ఆహారం తీసుకెళ్లుతున్న తల్లిని కలిసి షేక్ నూరుద్దీన్ నూరానీ తన కొడుకును రోజూ ఖురాన్‌లోని ఒక వాక్యం చదివి ఆహారాన్ని తినడం కొంచెం తగ్గించమని చెప్పారు. అలాగే చేసిన షకూరుద్దీన్ వారు వెళ్లిన మార్గంలో వెళ్లి చ్రార్ ఎ షరీఫ్ వద్ద షేక్ నూరుద్దీన్ నూరానీ (కశ్మీర్‌లో సూఫీ ఆర్డర్ వ్యవస్థాపకులు) కలిశారు.
బాబా రిషి
బారాముల్లాలోని గుల్మార్గ్‌కు 13 కిలోమీటర్ల దూరంలో తంగ్‌మార్గ్‌లోని బాబా పయాముద్దీన్ రిషి దర్గా ఉన్నది. ఆయన 1480లో ధ్యానంలోనే కన్నుమూశారు. అక్కడే దర్గా నిర్మించారు. అన్ని మతస్తులు ఈ దర్గాను దర్శిస్తారు. ఇక్కడ మొక్కితే కోరుకున్నది సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. బాబా షకూరుద్దీన్‌కు బాబా పయాముద్దీన్ రిషి అనుచరుడిగా చాలా కాలం పని చేశాడని పెద్దలు చెబుతుంటారు.
The shrine of Syed Balkhi at Pakharporaపఖేర్‌పొరా దర్గా
బుడ్గాం జిల్లాలో పఖేర్‌పొరాలో యుస్మార్గ్ సమీపంలో సయ్యద్ బాల్కి దర్గా ఉంటుంది. 15వ శతాబ్దం తొలినాళ్లలో అఫ్ఘనిస్తాన్ నుంచి ీయన ఇక్కడికి విచ్చేశారు. షేక్ నూరుద్దీన్ నూరానీ వాలికి శిష్యుడిగా చేశారు.
The shrine of Sheikh Zain-ud-Din at Aishmuqamషేక్ జైనుద్దీన్ దర్గా
చివరి గమ్యస్థానంగా అనంత్‌నగ్‌లో పహల్గామ్ టూరిస్టు స్పాట్‌కు 20 కిలోమీటర్ల దూరంలో అయిష్ముకమ్ వద్ద షేక్ జైనుద్దీన్ దర్గా ఉన్నది. షేక్ నూరుద్దీన్ వలికి ముఖ్య శిష్యుడైన ఈయన 15వ శతాబ్ది గురువు. అన్ని మతాల ప్రజలు ఈ దర్గా ను పవిత్ర మైనదిగా భావిస్తారు. ఉర్సు, జూల్ పండుగలకు ఈ దర్గాకు వేలాది మంది ఘనంగా జరుపుకుంటారు.
---ఎహెసాన్ ఫాజిలీ