Asianet News TeluguAsianet News Telugu

ద‌క్షిణభార‌తంపై Omicron పంజా.. Tamil Naduలో ఒక్క రోజే 76 కేసులు

భార‌త్ లో Omicron  చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రోజురోజుకు వైరస్​ బారినపడే వారి సంఖ్య పెరుగుతోంది. Tamil Nadu లో ఒక్కరోజే 76 ఒమిక్రాన్‌ కేసులు నమోదు షాక్ కు గురి చేస్తోంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 120కి పెరిగింది.
 

Tamil Nadu records sharp rise in fresh cases of Omicron; tally at 120
Author
Hyderabad, First Published Jan 1, 2022, 1:55 AM IST

గ‌త రెండేళ్లుగా కరోనా మహమ్మారి నీడలా వెంటాడుతూనే ఉంది. కొత్త కొత్త‌ రూపాలతో ప్రజల్ని భయాందోళనలకు గురిచేస్తూనే ఉంది.  తాజాగా క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. భార‌త్ లో Omicron  చాపకింద నీరులా వ్యాపిస్తోంది. క్ర‌మంగా కొత్త కేసుల సంఖ్య‌ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో.. దేశంలో ఇన్నాళ్లు ప్రబలంగా ఉన్న కరోనా డెల్టా వేరియంట్ స్థానాన్ని 'ఒమిక్రాన్' భర్తీ చేసే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని వైద్య నిపుణ‌లు హెచ్చరిస్తున్నారు  

ఇదిలా ఉంటే.. Tamil Naduలో ఒక్కరోజే 76 Omicron కేసులు నమోదు షాక్ కు గురి చేస్తోంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 120కి పెరిగింది. 117 శాంపిల్స్‌ని పుణులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌కు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపగా.. 115 శాంపిల్స్‌ ఫలితాలు వచ్చాయని అందులో 74 మందికి  ఒమిక్రాన్‌ ఉన్నట్టు తేలగా.. 41 మందిలో డెల్టా వేరియంట్‌ ఉన్నట్టు నిర్ధారణ అయినట్టు వెల్లడించారు. ఇంకా రెండు నమూనాల ఫ‌లితాలు రావాల్సి ఉంది. అయితే, ఇప్పటివరకు రాష్ట్రంలో 66 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. 52 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు తెలిపారు. 

Read Also: తెలంగాణలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా: కొత్తగా 311 మందికి పాజిటివ్, ఒక్క హైదరాబాద్‌లోనే 198 కేసులు

రాష్ట్రంలో న‌మోదైన కేసుల్లో చెన్నైలోనే 95 కేసులు నమోదు కాగా.. చెంగల్‌పేటలో ఐదు, మధురైలో నాలుగు, తిరువల్లూరులో మూడు, సేలం, తిరువరూరు, కోయంబత్తూరు, పడుక్కొట్టై, తంజావూరు, తిరుచిరాపల్లి, రాణిపేటలలో ఒక్కో కేసు నమోదైనట్టు అధికారులు తెలిపారు. దీంతో స్టాలిన్ స‌ర్కార్ అప్ర‌మ‌త్త‌మ‌య్యింది. క‌రోనా నిబంధ‌న‌లు త‌మిళ‌నాడు రాష్ట్ర వ్యాప్తంగా న‌మోదు చేయ‌నున్న‌ట్టు తెలిపింది ఆ రాష్ట్ర స‌ర్కార్.  ఆంక్ష‌ల‌ను మ‌రింత క‌ఠిన‌త‌రం చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.

మాల్స్‌, పార్ల‌ర్లు, పార్కులు, మెట్రో రైళ్లు, జువెల‌రీ షాపులు, థియేట‌ర్లు 50 శాతం కెపాసిటీతో మాత్ర‌మే న‌డిపించుకోవాలని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. పాఠ‌శాల విద్యార్థుల‌కు ఆన్‌లైన్ క్లాసులు నిర్వ‌హించాల‌ని, 9 నుంచి ఇంట‌ర్ వ‌ర‌కు మాత్రం ప్ర‌భుత్వం సూచించిన మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం న‌డుచుకోవాల‌ని ప్ర‌క‌టించింది. ఇక పెళ్లిలు, పార్టీల మీద ఆంక్షాలు విధించింది. కేవ‌లం 100 మందితో నిర్వ‌హించాల‌నీ,  అలాగే.. అంత్య‌క్రియ‌లకు కేవ‌ల 50 మంది మాత్ర‌మే హాజ‌రు కావాల‌ని పేర్కొంది స్టాలిన్ స‌ర్కార్.  

Read Also: కరోనా మందు పంపిణీకి అనుమతికై: ఏపీ హైకోర్టులో ఆనందయ్య పిటిషన్
 

కర్ణాటకలోనూ ఒమిక్రాన్‌ కేసులు రోజురోజుకీ భారీగా నమోదయ్యాయి. కొత్తగా మరో 23 కొత్త కేసులు వచ్చినట్టు ఆరోగ్యశాఖ మంత్రి కె. సుధాకర్‌ వెల్లడించారు. వీరిలో 19 మంది అమెరికా, యూరప్‌, ఆఫ్రికా వంటి దేశాల నుంచి వచ్చిన వారేనన్నారు. కొత్త వాటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 66కి చేరిందన్నారు. దేశంలో తొలిసారి నమోదైన రెండు ఒమిక్రాన్‌ కేసులు కర్ణాటకలోనే నమోదైన విషయం తెలిసిందే.

అందులో 19 మంది USA, యూరప్, మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికా నుండి వచ్చిన అంతర్జాతీయ ప్రయాణికులున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలో నూత‌న సంవత్సర వేడుకలపై  కర్ణాటక ప్ర‌భుత్వం కఠిన ఆంక్షలు విధించింది. శుక్రవారం రాత్రి 7గంటలు దాటాక బీచ్‌లకు ప్రజల రాకపై నిషేధం అమలుచేశారు. బహిరంగ ప్రదేశాల్లోనూ వేడుకలకు అనుమతిలేదని చెప్పారు. ఒమిక్రాన్‌ కలకలంతో డిసెంబర్‌ 28 నుంచే రాత్రిపూట కర్ఫ్యూఅమలు చేస్తున్నారు. 

Read Also: Telanganaలో ఏరులై పారుతోన్న మద్యం.. రికార్డు స్థాయిలో liquor అమ్మ‌కాలు

 మ‌రో వైపు కేర‌ళ‌లో కూడా ఒమిక్రాన్‌ కేసులు భారీగా నమోదు అయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 44 కొత్త కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. దీంతో కేర‌ళ‌లో ఓమిక్రాన్ కేసుల సంఖ్య‌ 107కి పెరిగిందని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. వీరిలో 10 మంది బాధితులు హైరిస్క్‌ దేశాల నుంచి రాగా.. 27 మంది లో-రిస్క్‌ దేశాల నుంచి వచ్చారని తెలిపారు. మిగతా ఏడుగురికి  కాంటాక్టు ద్వారా సోకినట్టు అధికారులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios