Asianet News TeluguAsianet News Telugu

కరోనా మందు పంపిణీకి అనుమతికై: ఏపీ హైకోర్టులో ఆనందయ్య పిటిషన్


కరోనా ఓమిక్రాన్ పై తాను తయారు చేసిన మందు పంపిణీకి సంబంధించిన అడ్డంకులు లేకుండా చూడాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ఆనందయ్య పిటిషన్ దాఖలు చేశారు.

Anandaiah files petition in AP High Court for Corona medicine dstribution
Author
Nellore, First Published Dec 31, 2021, 5:00 PM IST


అమరావతి:Corona  మందు తీసుకొనేందుకు వస్తున్న వారిని పోలీసులు అడ్డుకుంటున్నారని ఏపీ హైకోర్టులో Anandaiah పిటిషన్ దాఖలు చేశారు.డివిజన్‌ బెంచ్‌లో విచారణకు సింగిల్‌ జడ్జి సూచించారు. గతంలో ఆనందయ్య మందుపై ధర్మాసనంలో విచారణ జరిగిన విషయాన్ని న్యాయవాదులు  గుర్తుచేశారు. దీనితో ప్రధాన న్యాయమూర్తి దగ్గరకి పంపాలని సింగిల్‌ జడ్జి పేర్కొన్నారు.

Omicron వేరియంట్‌కి తాను ఆయుర్వేద మందు తయారు చేశానని  పంపిణీకి సిద్ధంగా ఉందని ఇటీవల  ఆనందయ్య ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి భారీగా వాహనాల్లో కృష్ణపట్నం వచ్చారు. కొవిడ్‌ బాధితులు, ఇతర వ్యాధిగ్రస్థులు నేరుగా గ్రామంలోకి వస్తుండటంపై Krishnapatnam గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆనందయ్య ఇంటి వద్దకు వెళ్లి మందు పంపిణీని అడ్డుకున్నారు. కొవిడ్‌ బాధితులు నేరుగా గ్రామంలోకి వస్తే తమ పరిస్థితి ఏమిటని నిలదీశారు.అయితే ఆనందయ్య తయారు చేసిన మందుపై Ayush కీలక ప్రకటనను చేసింది.  ఈ మందుకు తమ అనుమతి లేదని గతంలోనే ప్రకటించింది.

also read:ఆనందయ్య దరఖాస్తును వెంటనే పరిశీలించండి.. ఏపీ హైకోర్టు ఆదేశం..

కరోనాపై మందు కోసం ఈ ఏడాది  మే మాసంలో ఆనందయ్య మందుపై విస్తృతంగా చర్చ ప్రారంభమైంది. ఏపీతో పాటు పలు రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున ప్రజలు కరోనా మందు కోసం వచ్చేవారు. దీంతో ఐసీఎంఆర్ , ఆయుర్వేద సంస్థలు ఈ మందుపై అధ్యయనం చేశాయి. ఆనందయ్య ఇచ్చే కంటి మందుపై కొన్ని అభ్యంతరాలను నిపుణుల కమిటీలు అభ్యంతరాలు తెలిపాయి. ఆనందయ్య మందుతో సైడ్ ఎఫెక్ట్స్ లేవని నిపుణుల కమిటీ తెలిపింది.ఈ మందు పంపిణీని టీటీడీ కూడా తయారు చేసి ఇస్తామని కూడా ప్రకటించింది. అయితే ఆ తర్వాత నిపుణుల నివేదికల ఆధారంగా ఈ ప్రయత్నం నుండి టీటీడీ తప్పుకొంది.

తాను కనిపెట్టిన మందు ప్రజల్లోకి వెళ్లకుండా ఎన్నో అడ్డంకులు సృష్టించారని  కూడా ఆనంతయ్య గతంలో ఆరోపించారు. తనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు కూడా వచ్చారని... అయితే, గ్రామస్తులంతా అండగా నిలవడంతో అరెస్ట్ చేయకుండా వెనుదిరిగారని చెప్పారు. విజయనగరంలో జరిగిన యాదవ మహాసభ సమితి కార్యక్రమంలో మాట్లాడుతూ ఆనందయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయుర్వేదానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించాల్సిన అవసరం ఉందని చెప్పారు.  ఆనందయ్య మందు పంపిణీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఆనందయ్య  మందును ఆన్ లైన్ లో పంపిణీ కోసం ప్రయత్నాలు జరిగాయి. ఈ మేరకు ప్రభుత్వం వెబ్ సైట్ ను కూడా స్టార్ట్ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.

 ఆనందయ్య  మందు తీసుకన్నవారు తాము కరోనా నుంచి కోలుకున్నామని చెప్పారు. అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో ఆనందయ్య మందుకు బ్రేక్ పడింది.  ఆ తర్వాత ఆనందయ్య తయారుచేసిన మందును ఆయుర్వేద  నిపుణుల బృందం పరిశీలించింది. అయితే ఆనందయ్య మందు తయారుచేసే మూలికల్లో ఎలాంటి హానికరమైన పదార్థాలు లేవని చెప్పింది. ఈ క్రమంలోనే ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్ లభించిది. కానీ కంటి చుక్కల మందుకు మాత్రం అనుమతి లభించలేదు.
 

Follow Us:
Download App:
  • android
  • ios