కేథర్ నాథ్ హెలికాప్టర్ ప్రమాదంలో మంగళవారం చనిపోయిన పైలెట్ అనిల్ సింగ్.. అంతకు ముందు రోజు రాత్రి తన భార్యకు కాల్ చేశారు. తన కూతురు యోగ క్షేమాలను ఆరా తీశారు. ఆమెను బాగా చూసుకోవాలని భార్యను కోరారు.

‘‘కూతురు ఆరోగ్యం బాగాలేదు.. తనను బాగా చూసుకో’’ ఇవి కేదార్‌నాథ్ ఛాపర్ క్రాష్‌లో ప్రాణాలు కోల్పోయిన పైలట్ అనిల్ సింగ్ చివరి మాటలు. ఆరుగురు యాత్రికులతో చిర్నిద్ర వద్ద నిద్రపోయే ఒక రోజు ముందు ఆ పైలట్ తన భార్యతో ఫోన్ లో ఇలా మాట్లాడారని ‘ఎన్డీటీవీ’ నివేదించింది. ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతాలపై మంగళవారం ప్రయాణిస్తున్న సమయంలో ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో హెలికాప్టర్ కొండను ఢీకొట్టింది.సరైన విజిబిలిటీ లేకపోవడమే ఈ చాపర్ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేలింది.

అధికారం కోసమే బీజేపీ భాష చిచ్చుపెడుతోంది.. హిందీ విధింపున‌కు వ్యతిరేకంగా త‌మిళ‌నాడు అసెంబ్లీ తీర్మానం

ఈ ప్రమాదంలో మొత్తంగా ఏడుగురు చనిపోయారు. ఇందులో 57 ఏళ్ల పైలెట్ అనిల్ సింగ్ కూడా ఉన్నారు. ఆయన ఢిల్లీలోని షహదారా ప్రాంతానికి చెందినవారు. అయితే సింగ్ గత 15 ఏళ్లుగా ముంబైలో నివసిస్తున్నారు. అంధేరి శివారులో ఒక హౌసింగ్ సొసైటీలో తన కుటంబంతో కలిసి ఉండేవారు. ఆయనకు భార్య షిరీన్ ఆనందిత, కుమార్తె ఫిరోజా సింగ్‌ ఉన్నారు. భార్య సినీ రచయితగా పని చేస్తున్నారు. 

ఆర్యన్ ఏవియేషన్‌కు చెందిన ఆరు సీట్ల హెలికాప్టర్-బెల్ 407 (VT-RPN) కేదార్‌నాథ్ ఆలయం నుండి గుప్తకాశీకి యాత్రికులను తీసుకువెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి ముందు రోజు ఆయన తన భార్యకు కాల్ చేశారు. కూతురు ఆరోగ్యం విషయంలో ఆయన ఆందోళన చెందారు. తనను బాగా చూసుకోవాలని కోరారు. ఈ మాటలు ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. ‘‘ఆయన (అనిల్ సింగ్) మాకు నిన్న (సోమవారం) చివరి కాల్ చేశారు. నా కుమార్తె ఆరోగ్యం బాగా లేదు. ఆమెను జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు’’ఆనందిత ఫోన్‌లో ‘పీటీఐ’కి తెలిపారు. ఆయన అంత్యక్రియలు ఢిల్లీ నిర్వహిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. దాని కోసం తన కూతురుతో కలిసి అక్కడికి బయలుదేరి వెళ్లనున్నట్లు కూడా పేర్కొన్నారు.

మ్యాథ్స్ నేర్పించడానికి శశిథరూర్ హెయిర్ వాడిన బంగ్లాదేశ్ టీచర్.. ఫోటో వైరల్..!

కేదార్‌నాథ్ ఛాపర్ క్రాష్ పై అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB), ఏవియేషన్ రెగ్యులేటర్- డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) బృందాలు హెలికాప్టర్ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నాయి. ఛాపర్ కంపెనీ ఆర్యన్ ఏవియేషన్ నియంత్రణ పరిశీలనలో ఉంది. కొన్ని నిబంధనలను ఉల్లంఘించినందుకు ఇటీవల డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఆ ఏవియేషన్ సంస్థకు రూ. 5 లక్షల జరిమానా విధించింది.

ఎఐసీసీ అధ్యక్ష ఎన్నికలు:ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

DGCA వెబ్‌సైట్ ప్రకారం.. కంపెనీకి చెందిన ఐదు హెలికాప్టర్లలో ఇది ఒక్కటే 6-సీట్ల హెలికాప్టర్. కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్ ప్రమాదంపై రుద్రప్రయాగ్ జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ మాట్లాడుతూ.. గరుడ చట్టిలోని దేవ్ దర్శని వద్ద ఉదయం 11.45 గంటలకు మంటలు చెలరేగాయని చెప్పారు. ఈ ప్రమాదంలో అందరూ చనిపోయారని పేర్కొన్నారు.