Asianet News TeluguAsianet News Telugu

మ్యాథ్స్ నేర్పించడానికి శశిథరూర్ హెయిర్ వాడిన బంగ్లాదేశ్ టీచర్.. ఫోటో వైరల్..!

ట్విట్టర్ లో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు.  అందుకే... ఆయనకు సోషల్ మీడియాలో 8.4 మిలియన్ల మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు.
 

Bangladeshi teacher finds interesting way to teach Maths and it involves Shashi Tharoor. See tweet
Author
First Published Oct 19, 2022, 10:51 AM IST

ప్రస్తుతం దేశంలో ఎక్కడ విన్నా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పేరే వినపడుతోంది. ఆయన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం, ఈ రోజు ఆ ఎన్నికల ఫలితాలు వెలువడుతుండటంతో... ఆయన పేరు ఎక్కడ చూసినా వినపడుతోంది. అయితే... ఆ ఎన్నికలతో సంబంధం లేని విషయంలోనూ ఆయన ట్విట్టర్ లో వైరల్ గా మారడం విశేషం. ఒక లెక్కల టీచర్.. పిల్లలకు సులభంగా మ్యాథ్స్ నేర్పించడానికి శశిథరూర్ హెయిర్ స్టైల్ ని వాడటం గమనార్హం.

ఎంపీ శశిథరూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆయనకు నచ్చిన విషయాన్ని ట్విట్టర్ లో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు.  అందుకే... ఆయనకు సోషల్ మీడియాలో 8.4 మిలియన్ల మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు.

 

తాజాగా ఆయన తన ఎకౌంట్ లో   థరూర్ గణితానికి సంబంధించిన చాలా ఆసక్తికరమైన పోస్ట్‌ను పంచుకున్నారు. బంగ్లాదేశ్ లోని ఓ గణితం టీచర్... పిల్లలకు సులభంగా మ్యాథ్స్ అర్థమయ్యేలా చేసేందుకు శశిథరూర్ జుట్టను ఉపయోగించారు. 

ఈ విషయాన్ని శశిథరూర్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.   "బంగ్లాదేశ్‌లోని ఢాకాలోని గణిత ఉపాధ్యాయుడు జలజ్ చతుర్వేది నుండి వచ్చిన లేఖ: 'గణితాన్ని సంఖ్యలకు మించి బోధించాలని నేను నమ్ముతున్నాను. గ్రేడ్ 12లో మ్యాథమెటికల్ మోడలింగ్‌లో, మీ హెయిర్ లైన్ మంచి క్వార్టిక్ ఫిట్‌గా ఉందని మేము అన్వేషించాము. దయచేసి క్రింద చూడండి & దాన్ని ఉపయోగించడానికి సంకోచించకండి’ అని థరూర్ క్యాప్షన్‌లో రాశారు.

ఈ పోస్ట్‌కు 4,789 లైక్‌లు,అనేక స్పందనలు వచ్చాయి. ఈ పోస్టు చూసి నెటిజన్లు భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. ఇలా కూడా మ్యాథ్స్ చెప్పొచ్చా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios