Asianet News TeluguAsianet News Telugu

పెద్ద నోట్ల రద్దును సమర్ధించిన సుప్రీం కోర్టు.. కీలక కామెంట్స్..

పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం నేడు తీర్పు వెలువరించింది. 2016లో కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.

Supreme Court Upholds Demonetisation in 2016
Author
First Published Jan 2, 2023, 11:13 AM IST


2016లో కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం నేడు తీర్పు వెలువరించింది. 2016లో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లను కొట్టివేసింది. అది పరిపాలన ఆర్థిక విధానం అయినందున ఆ నిర్ణయాన్ని మార్చలేమని పేర్కొంది. నోట్ల రద్దుకు ముందు కేంద్రం, ఆర్‌బీఐ మధ్య సంప్రదింపులు జరిగాయని ధర్మాసనం పేర్కొంది. ఇందుకు సంబంధించి 2016   నవంబర్ 8 నాటి నోటిఫికేషన్ చెల్లుబాటవుతుందని తెలిపింది.

డీమోనిటైజేషన్‌ను తీసుకురావడానికి ఆర్‌బీఐకి స్వతంత్ర అధికారం లేదని.. కేంద్రం, ఆర్‌బీఐల మధ్య సంప్రదింపుల తర్వాత నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. ఆర్‌బీఐ, ప్రభుత్వాల మధ్య సంప్రదింపులు జరిగినందున కేంద్రం నిర్ణయం తీసుకునే ప్రక్రియను తప్పుపట్టలేమని జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. అయితే లక్ష్యం సాధించబడిందా లేదా అనేది ముఖ్యం కాదని పేర్కొన్నారు. 

అయితే ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్న జస్టిస్ బీవీ నాగరత్న మెజారిటీ అభిప్రాయంతో విభేదించారు. ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్ 26(2) ప్రకారం కేంద్రం అధికారాల విషయంలో జస్టిస్ బీఆర్ గవాయి ఇచ్చిన తీర్పుకు జస్టిస్ బీవీ నాగరత్న భిన్నంగా ఉన్నారు. భిన్నమైన తీర్పును రాశారు.

Follow Us:
Download App:
  • android
  • ios