హైదరాబాద్; ఉద్యోగుల  ఫిర్యాదులను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు విద్యుత్ ఉద్యోగుల విభజనపై ఏర్పాటు చేసిన దర్మాధికారి కమిటీని శుక్రవారం నాడు ఆదేశించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టు విచారణ చేసింది.

 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజనకు  సంబంధించి దర్మాధికారి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ  విద్యుత్ ఉద్యోగుల విభజనకు చెందిన విధి విధానాల ప్రకారం విభజించింది.

అయితే నిబంధనలకు విరుద్దంగా దర్మాధికారి కమిటీ ఉద్యోగులను విభజించిందని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం వాదనలు చేసింది. అయితే ఈ విషయమై సుప్రీంకోర్టు  దర్మాధికారి కమిటీకి కీలకమైన ఆదేశాలు ఇచ్చింది.

విద్యుత్ ఉద్యోగుల ఫిర్యాదులను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు దర్మాధికారి కమిటీని సుప్రీంకోర్టు శుక్రవారం నాడు ఆదేశించింది. నిబంధనలకు విరుద్దంగా  ఉద్యోగులను విభజించడం వల్ల  తమ రాష్ట్రానికి 600 మంది ఉద్యోగులు వచ్చారని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేసింది.  దీని వల్ల తమపై  ఎక్కువ భారం పడుతోందని చెప్పారు.

రెండు వారాల్లో విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సుప్రీంకోర్టు దర్మాధికారి కమిటీని ఆదేశించింది. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.  దర్మాధికారి కమిటీ సిఫారసుల్లో తప్పులుంటే మరోసారి పున: సమీక్ష చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.