విద్యార్థులకు సొంత భాషలో లేదా వారు కోరుకున్న భాషలో పరీక్షలు రాసే హక్కు ఉంటుందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ప్రతీ భాషకు దాని గొప్పధనం, చరిత్ర ఉంటుందని చెప్పారు. 

విద్యార్థులు మాట్లాడే భాష‌లో ప‌రీక్ష‌లు రాసే హ‌క్కు వారికి ఉంద‌ని కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆ హ‌క్కును హ‌రించ‌కూడ‌ద‌ని అన్నారు. సొంత భాష‌లో ప‌రీక్ష‌లు రాయ‌నివ్వాల‌ని కోరారు. కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర ప్ర‌స్తుతం క‌ర్ణాట‌కలో కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో నిరుద్యోగం, సంబంధిత సమస్యలపై ఆ రాష్ట్ర న‌లుమూల‌ల నుంచి త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన సుమారు 1,800 మంది యువకులను ఉద్దేశించి ఆయ‌న ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

టపాసుల అమ్మకాలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎంకె స్టాలిన్ లేఖ‌.. ఏమన్నారంటే.. ?

‘‘ ఏ వ్యక్తికైనా ఒక భాష కేవలం సంభాషణకు మూలం కాదు. ఒక భాష ఆశను ప్రతిబింబిస్తుంది, ఒక భాషకు ఊహాశక్తి ఉంటుంది. అందులో చాలా చరిత్ర ఉంటుంది. ’’ అని రాహుల్ గాంధీ అన్నారు. ఒకరి మాతృభాష ప్రాముఖ్యతను గ్రహించాలని తెలిపారు. ప్రతీ రాష్ట్రానికి దాని భాషను ఉపయోగించే హక్కు ఉండాలని, విద్యార్థులు వారు కోరుకున్న లేదా ఉపయోగించిన భాషలో సమాధాన పత్రాలను రాయడానికి అనుమతించాలని రాహుల్ గాంధీ చెప్పారు.

అన్ని సెంట్రల్ టెక్నికల్, నాన్-టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్స్‌తో పాటు సెంట్రల్ వర్సిటీలలో బోధనా మాధ్యమంగా ఇంగ్లీష్ స్థానంలో హిందీని ప్ర‌వేశ‌పెట్టాల‌ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన పార్లమెంటరీ ప్యానెల్ సిఫార్సులు చేసింది. దీనిపై వివాదం నెలకొంది. దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఉత్తరాఖండ్ లో షూటౌట్‌.. బీజేపీ నాయకుడి భార్య మృతి.. యూపీ పోలీసులపై హత్య కేసు..

ఈ ప్యానెల్ భారతదేశంలో విస్తృతంగా మాట్లాడే హిందీని ఐక్యరాజ్యసమితి అధికారిక భాషలలో ఒకటిగా కూడా ఉంచాలని సూచించింది. హిందీ భాషకు అదనపు వెయిటేజీ ఇవ్వడాన్ని దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఈ సిఫార్సులు మరోసారి భారతదేశంలో భాషాయుద్ధానికి దారితీశాయి.

దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ కంటే ప్రాంతీయ భాషలే ఎక్కువ ప్రాబల్యం ఉన్నందున, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వంటి పలువురు రాజకీయ నేతలు పార్లమెంటరీ కమిటీ సిఫార్సుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

ఉద్ధవ్ ఠాక్రే నా సేనాపతి.. శివ‌సేనకు ఎప్పటికీ ద్రోహం చేయను- ఎంపీ సంజ‌య్ రౌత్.. త‌ల్లికి భావోద్వేగ లేఖ

ఇదే విషయంలో గత మంగళవారం ఎంకే స్టాలిన్ కేంద్ర ప్ర‌భుత్వానికి, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి లేఖ‌లు రాశారు. హిందీని తప్పనిసరి భాషగా పేర్కొంటూ మరో భాషాయుద్ధం ప్రారంభించకూడదని చెప్పారు. ఆ దిశగా ప్రయత్నాలను విరమించుకొని భారతదేశ ఐక్యతను కాపాడాలని విజ్ఞ‌ప్తి చేశారు. పార్లమెంట‌రీ ప్యానెల్ చేసిన ఈ సిఫార్సుల‌ను అమ‌లు చేస్తే దేశ ఐక‌త్య నాష‌నం అవుతుంద‌ని స్టాలిన్ ఒక ప్ర‌క‌ట‌న‌లో ఆవేద‌న వ్య‌క్తం చేశారు. భారతదేశం అంతటా హిందీని సాధారణ భాషగా చేయాలని ప్యానెల్ సిఫార్సు చేసిందని ఆయ‌న పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో తమిళంతో సహా 22 భాషలను సమాన హోదా ఇచ్చారని స్టాలిన్ గుర్తు చేశారు. భారతదేశంలో హిందీని ఉమ్మడి భాషగా సిఫారసు చేయడానికి ప్యానెల్ కు ఎందుకు అవ‌స‌రం వ‌చ్చిందని ఆయ‌న ప్ర‌శ్నించారు.